Share News

గంగా ఎక్స్‌ప్రెస్‌‌‌వే యూపీ అభివృద్ధికి కొత్త జీవన రేఖ: మోదీ

ABN , Publish Date - Apr 29 , 2026 | 01:51 PM

భారత ప్రధాని నరేంద్ర మోదీ 594 కిలోమీటర్ల పొడవైన ‘గంగా ఎక్స్‌ప్రెస్‌వే’ను బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆధిత్యనాథ్ పాల్గొన్నారు.

గంగా ఎక్స్‌ప్రెస్‌‌‌వే యూపీ అభివృద్ధికి కొత్త జీవన రేఖ: మోదీ
Narendra Modi Ganga Expressway

న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: భారత ప్రధాని నరేంద్ర మోదీ 594 కిలోమీటర్ల పొడవైన ‘గంగా ఎక్స్‌ప్రెస్‌వే’ను బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆధిత్యనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. గంగా మాత ఆశీర్వాదంతో ఎక్స్‌ప్రెస్‌‌వే ప్రాజెక్ట్ సాకారమైందని అన్నారు. గంగా ఎక్స్‌ప్రెస్‌‌వేను యూపీ అభివృద్ధికి కొత్త జీవన రేఖగా ఆయన అభివర్ణించారు. పశ్చిమ బెంగాల్‌లో భారీ ఆధిక్యంతో బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.


కాగా, సుమారు 36,230 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో గంగా ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం జరిగింది. భారతదేశపు అతిపెద్ద గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు ప్రాజెక్టులలో గంగా ఎక్స్‌ప్రెస్‌వే కూడా ఒకటి. ఉత్తరప్రదేశ్‌లో అత్యంత పొడవైన ఎక్స్‌ప్రెస్‌వే ఇదే కావటం విశేషం. గంగా ఎక్స్‌ప్రెస్‌వే ఆరు లైన్‌ల యాక్సెస్-కంట్రోల్డ్ కారిడార్. 8 లైన్ల వరకు విస్తరించుకునే అవకాశం ఉంది. 12 జిల్లాల గుండా.. మీరట్ నుంచి ప్రయాగ్‌రాజ్ వరకు ఈ ఎక్స్‌ప్రెస్‌వే విస్తరించి ఉంది. ఇది కేవలం ఒక రహదారిగానే కాకుండా.. పారిశ్రామిక, లాజిస్టిక్స్, అభివృద్ధి కారిడార్‌గా పనిచేయాలనే భారీ లక్ష్యంతో రూపొందించబడింది.


గంగా ఎక్స్‌ప్రెస్‌వేలోని నాలుగు సెక్షన్లలో మూడింటిని అదానీ గ్రూప్ నిర్మించింది. గంగా ఎక్స్‌ప్రెస్‌వే కారణంగా మీరట్, ప్రయాగ్‌రాజ్ మధ్య ప్రయాణ సమయం భారీగా తగ్గనుంది. మీరట్ నుంచి ప్రయాగ్‌రాజ్‌కు ప్రయాణించాలంటే.. 11-12 గంటల సమయం పడుతోంది. గంగా ఎక్స్‌ప్రెస్‌వే అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం 6 గంటలకు తగ్గుతుంది.


ఇవి కూడా చదవండి

ఒపెక్ నుంచి యూఏఈ ఔట్.. భారత్‌కు లాభమేనా..

టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన లోకేశ్.. నేతల అభినందనలు

Updated Date - Apr 29 , 2026 | 01:58 PM