ఒపెక్ నుంచి యూఏఈ ఔట్.. భారత్‌కు లాభమేనా..
ABN , Publish Date - Apr 29 , 2026 | 01:36 PM
ఒపెక్ నుంచి బయటకు రావాలనే యూఏఈ నిర్ణయం వల్ల చమురు ఉత్పత్తుల్లో, ధరల్లో గణనీయమైన మార్పులు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. యూఏఈ నిర్ణయం వల్ల భారతదేశం బాగా లాభపడబోతున్నట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు.
అతిపెద్ద చమురు ఉత్పత్తి కూటమి అయిన ఒపెక్ నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) బయటకు రాబోతోంది. మే 1వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రాబోతున్నట్టు యూఏఈ ప్రకటించింది. ఒపెక్ నుంచి బయటకు రావాలనే యూఏఈ నిర్ణయం వల్ల చమురు ఉత్పత్తుల్లో, ధరల్లో గణనీయమైన మార్పులు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. యూఏఈ నిర్ణయం వల్ల భారతదేశం బాగా లాభపడబోతున్నట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు (UAE quits OPEC).
భారతదేశం ముడి చమురు కోసం పూర్తిగా దిగుమతుల పైనే ఆధారపడుతుంది. ఇంధన భద్రత, చమురు ధరలను నియంత్రించడం కోసం ఉత్పత్తిని పెంచాలని చాలా కాలంగా ఒపెక్ దేశాలను భారత్ కోరుతోంది. అయితే సౌదీ నేతృత్వంలోని ఒపెక్ అందుకు సానుకూలంగా స్పందించడం లేదు. అయితే ఒపెక్ నుంచి స్వేచ్ఛ లభించడంతో యూఏఈ ఇకపై చమురును భారీగా ఉత్పత్తి చేయగలుగుతుంది (Petrol price India 2026).
ప్రస్తుతం భారత ముడి చమురు అవసరాల్లో దాదాపు పది శాతం యూఏఈ నుంచి దిగుమతి అవుతున్నాయి. ఒపెక్ నియంత్రణ లేకపోడంతో భవిష్యత్తులో యూఏఈ నుంచి భారత్‌కు దిగుమతులు భారీగా పెరగవచ్చు. దీని వల్ల చమురు ధరలు తగ్గుతాయి. సరఫరా మెరుగుపడుతుంది. గల్ఫ్ దేశాలన్నింటిలోనూ యూఏఈతోనే భారత్‌కు స్నేహబంధం ఎక్కువ. భారత్‌లో యూఏఈ భారీగా పెట్టుబడులు కూడా పెట్టింది. కాబట్టి యూఏఈ నుంచి చమురు దిగుమతులు భవిష్యత్తులో భారీగా పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి (Impact on India oil imports).
ఒపెక్ నుంచి యూఏఈ వైదొలగడం వల్ల పడే ప్రభావం ప్రస్తుతానికి పెద్దగా ఉండదు (Crude oil prices India). హోర్ముజ్ జలసంధి తిరిగి తెరుచుకున్న తర్వాత పూర్తి స్పష్టత వస్తుంది. హోర్ముజ్ జలసంధి తిరిగి తెరుచుకున్న తర్వాత ప్రపంచ సరఫరాలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయి. ఒపెక్ నియంత్రణ లేకపోవడం వల్ల యూఏఈ భారీగా చమురు ఉత్పత్తిని పెంచుతుంది. దీంతో చమురు ధరలు భారీగా దిగి వచ్చే అవకాశం ఉంటుంది.
ఇవి కూడా చదవండి..
పసిడి ప్రియులకు శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు..
లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు.. 8 మంది మృతి..