Share News

టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన లోకేశ్.. నేతల అభినందనలు

ABN , Publish Date - Apr 29 , 2026 | 01:35 PM

టీడీపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మంత్రి నారా లోకేశ్‌ను పలువురు నేతలు కలిసి అభినందనలు తెలిపారు. పార్టీ కేంద్ర కార్యాలయంలోని తన ఛాంబర్‌లో లోకేశ్‌ను మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు, వివిధ స్థాయి నాయకులు కలిసి శుభాకాంక్షలు చెప్పారు.

టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన లోకేశ్.. నేతల అభినందనలు
Nara Lokesh

అమరావతి, ఏప్రిల్ 29: తెలుగుదేశం పార్టీలో మరో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మంత్రి నారా లోకేశ్‌ను పలువురు నేతలు కలిసి అభినందనలు తెలిపారు. పార్టీ కేంద్ర కార్యాలయంలోని తన ఛాంబర్‌లో లోకేశ్‌ను మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు, వివిధ స్థాయి నాయకులు కలిసి శుభాకాంక్షలు చెప్పారు. కార్యనిర్వాహక అధ్యక్షుడిగా లోకేశ్ పార్టీని మరింత బలోపేతం చేసి ముందుకు నడిపించాలని నేతలు ఆకాంక్షించారు.


అంతకుముందు.. ఎంపీ, టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మంత్రి నారా లోకేశ్ సమక్షంలో కేక్ కట్ చేశారు. శ్రీకృష్ణదేవరాయలకు లోకేశ్ కేక్ తినిపించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.


ఇవి కూడా చదవండి..

ప్రత్యర్థి పార్టీ కుట్రలకు ఇక కాలం చెల్లింది: సీఎం చంద్రబాబు

అక్కడే తేల్చుకోండి.. ఆకివీడు రామాలయం పిల్‌పై ఏపీ హైకోర్టు

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 29 , 2026 | 01:57 PM