అక్కడే తేల్చుకోండి.. ఆకివీడు రామాలయం పిల్‌పై ఏపీ హైకోర్టు
ABN , Publish Date - Apr 29 , 2026 | 01:02 PM
ఆకివీడు రామాలయంపై వేసిన పిల్‌ను ఏపీ హైకోర్టు డిస్పోజ్ చేసింది. ఇదే అంశంపై ఇప్పటికే హైకోర్టులో మరో బెంచ్ ముందు రిట్ పిటిషన్‌తో పాటు కోర్టుధిక్కరణ పిటిషన్ కూడా పెండింగ్‌లో ఉన్నాయని కోర్టు తెలిపింది.
అమరావతి, ఏప్రిల్ 29: ఆకివీడు రామాలయంపై వేసిన పిల్‌ను ఏపీ హైకోర్టు(AP High Court) డిస్పోజ్ చేసింది. ఇదే అంశంపై ఇప్పటికే హైకోర్టులో మరో బెంచ్ ముందు రిట్ పిటిషన్‌తో పాటు కోర్టుధిక్కరణ పిటిషన్ కూడా పెండింగ్‌లో ఉన్నాయని కోర్టు తెలిపింది. అక్కడే తేల్చుకోవాలని హైకోర్టు ధర్మాసనం తేల్చిచెప్పింది. ఈ పిల్‌ను ముందుగా డిస్మిస్ చేస్తామని హైకోర్టు చెప్పగా.. పిల్ తరఫున హాజరైన న్యాయవాది శ్రవణ్ కుమార్ డిస్పోజ్ చేయాలని అభ్యర్థించారు. దీంతో పిల్‌ను డిస్పోజ్ చేస్తున్నట్లు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ ధర్మాసనం ప్రకటించింది.
ఇవి కూడా చదవండి..
ఏపీ పదో తరగతి ఫలితాలు రేపే.. ఉదయం 11 గంటలకు విడుదల
ప్రత్యర్థి పార్టీ కుట్రలకు ఇక కాలం చెల్లింది: సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telugu News