సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కేంద్ర మంత్రి పెమ్మసాని
ABN , Publish Date - Apr 29 , 2026 | 12:20 PM
డిజిటల్ అరెస్ట్ పేరుతో జరిగే సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సూచించారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ఓ వీడియోను షేర్ చేశారు
ఇంటర్నెట్ డెస్క్: డిజిటల్ అరెస్ట్ పేరుతో జరిగే సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సూచించారు. పోలీసు అధికారులుగా నటిస్తూ, సైబర్ నేరగాళ్లు వీడియో కాల్స్ చేసి డబ్బులు వసూలు చేస్తారని తెలిపారు. ఇలాంటి మోసాలపై అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరాలపై 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయాలని సూచించారు. ఇలాంటి నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేలా ఒక వీడియోను ఎక్స్ వేదికగా షేర్ చేశారు.
'డిజిటల్ అరెస్ట్ మోసాలతో జాగ్రత్త!. ఇటీవలి కాలంలో సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్ట్ పేరుతో కొత్త రకం మోసాలకు పాల్పడుతున్నారు. పోలీసు అధికారులు లేదా ప్రభుత్వ ప్రతినిధులుగా నటిస్తూ వీడియో కాల్స్ ద్వారా ప్రజలను భయపెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అజ్ఞాత కాల్స్, సందేహాస్పద లింకులు, ఓటీపీలు ఎప్పటికీ షేర్ చేయకండి. ఏదైనా అనుమానం కలిగితే వెంటనే స్థానిక పోలీసులను సంప్రదించండి లేదా 1930 సైబర్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేయండి. స్మార్ట్‌గా ఉండండి, సురక్షితంగా ఉండండి. ఒక్క క్లిక్ మీ భవిష్యత్తును మార్చొచ్చు. జాగ్రత్తగా ఆలోచించండి' అని పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.