ఇండియా కూటమిని ప్రజలు తిరస్కరిస్తున్నారు: అమిత్ షా
ABN , Publish Date - Oct 09 , 2026 | 09:03 PM
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఇండియా కూటమిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శలు చేశారు. ప్రతిపక్షాలు అబద్ధపు ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు.
ఇంటర్నెట్ డెస్క్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఇండియా కూటమిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా మండిపడ్డారు. అబద్ధపు ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై ప్రజలకు అచంచలమైన విశ్వాసముందన్న ఆయన.. వ్యతిరేక ప్రచారాలను ఎదుర్కొంటూనే బీజేపీ ఎన్నికల్లో వరుస విజయాలు సాధిస్తోందన్నారు.
పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి ఉప ఎన్నికల్లో ఎన్‌డీఏ విజయాలు సాధించడం సహా రాజస్థాన్, త్రిపురల్లో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో సానుకూల ఫలితాలొచ్చాయని షా వ్యాఖ్యానించారు. ఈ ఫలితాలతో ఇండియా కూటమికి ప్రజాదరణ తగ్గిందని స్పష్టంగా తెలుస్తోందని ఆయన చెప్పుకొచ్చారు. ప్రజల మద్దతు కోల్పోతున్న కూటమి పార్టీలు.. ప్రతి ఓటమి తర్వాత ఎన్నికల వ్యవస్థలు, సంస్థలను ప్రశ్నిస్తున్నాయని విమర్శించారు. ప్రతిపక్షాల వైఖరిని ప్రజలు నిత్యం గమనిస్తున్నారని.. మరోసారి బీజేపీపై విశ్వాసం వ్యక్తం చేస్తూ తీర్పునిచ్చారని ఆయన పేర్కొన్నారు.
ఇవీ చదవండి:
‘ఢిల్లీని స్తంభింపజేయడం సమంజసమేనా?’.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
కేరళ మాజీ సీఎం విజయన్‌కు షాక్.. ఎఫ్‌ఐఆర్ నమోదుకు హైకోర్టు ఆదేశం
లైంగిక వేధింపుల ఆరోపణలు.. కాంగ్రెస్ ఎంపీపై జేఎన్‌యూ వేటు