Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Mar 01 , 2026 | 07:23 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Mar 01, 2026 10:02 IST

    మహారాష్ట్ర: నాగ్‌పూర్‌లో ఘోర ప్రమాదం

    • బాణసంచా గోడౌన్‌లో పేలుడు

    • 12 మంది మృతి, 15 మందికి గాయాలు

    • పేలుడు ధాటికి భవనం ధ్వంసం

  • Mar 01, 2026 10:01 IST

    శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమాన రాకపోకలకు అంతరాయం

    • దుబాయ్, దోహా, కువైట్, సౌదీఅరేబియా, షార్జా, అబుదాబి,..

    • జెడ్డా, మస్కట్ దేశాలకు వెళ్లాల్సిన 23 విమాన సర్వీసులు రద్దు

    • ఆయా ప్రాంతాల నుంచి రావాల్సిన 21 విమానాలు రద్దు

  • Mar 01, 2026 09:11 IST

    హైదరాబాద్: కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ తయారీ ముఠా గుట్టురట్టు

    • శంషాబాద్ జోన్ టాస్క్‌ఫోర్స్, పహాడీషరీఫ్ పోలీసుల జాయింట్ ఆపరేషన్

    • జల్‌పల్లిలోని SK రాయల్ ఎంటర్‌ప్రైజేస్, షాహీ గోల్డ్ కంపెనీలపై దాడులు

    • ప్రధాన నిందితుడు అబ్దుల్ సత్తార్ సహా నలుగురు అరెస్ట్

    • సింథటిక్ రంగులు, తక్కువ నాణ్యత గల పదార్థాలతో అల్లం తయారీ

    • రూ.10లక్షల విలువైన అల్లం, వెల్లుల్లి, ముడిసరుకు స్వాధీనం

  • Mar 01, 2026 09:06 IST

    కాకినాడ వేట్లపాలెం ఘటనలో 22కు చేరిన మృతుల సంఖ్య

  • Mar 01, 2026 08:52 IST

    అమరావతి: ఈ నెల 13న ఏపీ క్యాబినెట్ సమావేశం

    • ఉదయం 10.30 కు ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో సమావేశం

    • కేబినెట్ ప్రతిపాదనలు ఈ నెల 11 సాయంత్రం 4 గంటలు లోపు పంపాలని ఆయా శాఖలకు నోట్ జారీ

  • Mar 01, 2026 08:50 IST

    ఇజ్రాయెల్‌-అమెరికా దాడుల్లో ఇరాన్‌లో 201 మంది మృతి

    • పాఠశాలపై జరిగిన దాడిలో 86 మంది విద్యార్థులు మృతి: ఇరాన్‌

  • Mar 01, 2026 08:47 IST

    తిరుమల: చంద్రగ్రహణం కారణంగా టీటీడీ చర్యలు

    • మంగళవారం 11 గంటల పాటు శ్రీవారి ఆలయం మూసివేత

    • ఉదయం 9 నుంచి సా.6:30 వరకు ఆలయం మూసివేత

    • 2, 3 తేదీల్లో సర్వదర్శనం టోకెన్ల జారీని రద్దు చేసిన టీటీడీ

    • ఈ నెల 3వ తేదీన వీఐపీ బ్రేక్‌ దర్శనం రద్దు

  • Mar 01, 2026 08:46 IST

    తిరుపతి: దామినీడులో 14.44 సెంట్లు భూమి కోర్టు భవనాలకు కేటాయింపు

    • 16 కోర్టు భవనాల సముదాయం నిర్మాణానికి రూ.120 కోట్లు కేటాయింపు

    • నిర్మాణ పనులకు నేడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌ సూర్యకాంత్ భూమిపూజ

  • Mar 01, 2026 08:46 IST

    కాకినాడ: వెట్లపాలెం ప్రమాద మృతుల పోస్ట్‌మార్టం

    • సామర్లకోట సీహెచ్‌సీలో పోస్ట్‌మార్టం నిర్వహణ

    • 11 మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగింత

    • మట్టిఖర్చుల నిమిత్తం ఒక్కొక్కరికి రూ.25 వేలు చొప్పున సాయం

  • Mar 01, 2026 08:45 IST

    కాకినాడ వేట్లపాలెం ఘటనలో 22కు చేరిన మృతుల సంఖ్య

    • కాకినాడ GGHలో చికిత్సపొందుతూ లోవరాజు మృతి

    • మిగిలిన తొమ్మిది మందికి కొనసాగుతున్న చికిత్స

    • ఆరుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు వెల్లడి

  • Mar 01, 2026 08:44 IST

    ఖమేనీ మృతిపై ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ప్రకటన

    • గొప్ప, విప్లవ నాయకుడిని కోల్పోయాం: ఇరాన్

    • దుష్ట ఉగ్రవాదుల చేతుల్లో ఖమేనీ వీరమరణం పొందారు

    • పవిత్ర రంజాన్ మాసంలో ఖమేనీ చనిపోయారు: ఇరాన్

  • Mar 01, 2026 08:42 IST

    దాడులు కొనసాగుతున్నాయి: ఇజ్రాయెల్

    • ఇరాన్‌లో 30 కంటే ఎక్కువ టార్గెట్స్

  • Mar 01, 2026 08:20 IST

    దుబాయ్‌లోని పలు ప్రాంతాలపై ఇరాన్ అటాక్

    • దెబ్బతిన్న దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్

    • భయాందోళనతో పరుగులు తీసిన ప్రయాణికులు

    • సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలు

  • Mar 01, 2026 08:17 IST

    ప్రకాశం: టంగుటూరులో అగ్నిప్రమాదం

    • గ్రాడ్‌ ఫ్రై ఫిలిప్స్ ఇండియా పొగాకు గ్రేడింగ్ కంపెనీలో చెలరేగిన మంటలు

    • ప్రమాదంలో 2 వేలకు పైగా పొగాకు బేళ్లు దగ్ధం

    • మంటలార్పిన అగ్నిమాపక సిబ్బంది

  • Mar 01, 2026 07:23 IST

    ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి

    • ఖమేనీ మృతిని ధృవీకరించిన ఇరాన్ మీడియా

    • ఖమేనీ నివాసం లక్ష్యంగా దాడులు జరిపిన అమెరికా

    • దాడుల్లో ఖమేనీ కుమార్తె, అల్లుడు, మనువరాలు మృతి