అమరావతిలో జ్యుడీషియల్ అకాడమీకి సీజేఐ శంకుస్థాపన
ABN , Publish Date - Mar 01 , 2026 | 04:19 PM
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో జ్యుడీషియల్ అకాడమీ నిర్మాణానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ శంకుస్థాపన చేశారు. ఆదివారం రాజధాని అమరావతి సమీపంలోని పిచ్చుకలపాలెం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
అమరావతి, మార్చి 01: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో జ్యుడీషియల్ అకాడమీ నిర్మాణానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ శంకుస్థాపన చేశారు. ఆదివారం రాజధాని అమరావతి సమీపంలోని పిచ్చుకల పాలెం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, సీఎం చంద్రబాబు నాయుడు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జె.కె. మహేశ్వరి, జస్టిస్ పీఎస్ నర్సింహ, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి, జస్టిస్ జోయ మాల్యా బాగ్చి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్‌తోపాటు పలువురు న్యాయమూర్తులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
రూ. 165 కోట్ల వ్యయంతో ఈ జ్యుడీషియల్ అకాడమీని నిర్మిస్తున్నారు. దీనిలో బ్లాక్ బిలో జి ప్లస్ 3 అంతస్తులతో అకాడమిక్ బ్లాక్ నిర్మాణం చేపట్టనున్నారు. అదే విధంగా జి ప్లస్ 8 అంతస్తులతో హాస్టల్ బ్లాక్, జి ప్లస్ 3 అంతస్తుల్లో ఇండోర్ స్పోర్ట్స్, గెస్ట్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తున్నారు. 120 మంది బ్యాచ్ ఆఫ్ ట్రైనీ జడ్జిల సామర్థ్యంతో ఈ జ్యుడీషియల్ అకాడమీ నిర్మిస్తున్నారు. మొత్తం భవన విస్తీర్ణం 2.05 లక్షల చదరపు అడుగులలో దీనిని ఏర్పాటు చేస్తున్నారు. ఏపీ హైకోర్టు నుంచి ఈ జ్యుడీషియల్ అకాడమి 5.7 కి.మీల దూరంలో 50 మీటర్ల వెడల్పు కలిగిన రహదారిని ఏర్పాటు చేయనున్నారు.
బ్లాక్ ఏ జీ ప్లస్ 3 అంతస్తులతో కూడిన అడ్మినిస్ట్రేటివ్, అకాడమిక్ బ్లాక్ నిర్మిస్తున్నారు. 500 సీట్ల సామర్థ్యంతో ఆడిటోరియంతో కూడిన స్టేజ్‌తోపాటు ఫ్రీ ఫంక్షన్ ఏరియాను ఏర్పాటు చేస్తున్నారు. 120 సీట్లతో కూడిన సెమినార్ హాల్, 70 సీట్లతో రెండు క్లాస్ రూమ్‌లు, 70 సీట్లతో మూట్ కోర్టు హాల్, 60 సీట్లతో ఫోరెన్సిక్ ల్యాబ్‌లు నిర్మిస్తున్నారు.
అంతేకాకుండా.. 50 సీట్లతో కంప్యూటర్ ల్యాబ్, 48 సీట్లతో లైబ్రరీ, రీడింగ్ రూమ్ ఏర్పాటు చేయనున్నారు. బ్లాక్ - బి జి ప్లస్ 3 అంతస్తులతో కూడిన ఈ భవనంలో రెసిడెన్షియల్ సౌకర్యాలు కల్పించనున్నారు. 108 సీట్లతో డైనింగ్ హాల్,10 సీట్ల వీఐపీ డైనింగ్ హాల్, పూర్తి స్థాయి సౌకర్యాలతో కూడిన కిచెన్, సర్వీస్ ఏరియా జిమ్, 2 బ్యాడ్మింటన్ కోర్టు హాళ్లు, స్క్వాష్ కోర్టు, టేబుల్ టెన్నిస్ హాల్, యోగా, మెడిటేషన్‌కు ప్రత్యేకంగా మల్టీ పర్పస్ హాల్ సౌకర్యాలు కల్పించనున్నారు.
బ్లాక్ బి 2 జీ ప్లస్ 8 అంతస్తులతో కూడిన భవనంలో జ్యుడీషియల్ అధికారులు, ట్రైనీలకు రెసిడెన్షియల్ అకామిడేషన్, 98 సీట్లతో టిపికల్ హాస్టళ్ల యూనిట్, 5 సూట్ రూమ్‌లు, ప్రతి అంతస్తులో లాంజ్ స్పేస్, ప్యాంట్రీ, యుటిలిటీ సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నారు. బ్లాక్ బి 3 జి ప్లస్ 1 అంతస్తులతో కూడిన భవనంలో స్విమ్మింగ్ పూల్, పార్కింగ్, సపోర్టింగ్ స్టాఫ్ వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నారు. పార్కింగ్ ఇతర మౌలిక సదుపాయాలకు సంబంధించిన బేస్మెంట్ పార్కింగ్, రెండు జోన్లలో ద్విచక్ర వాహనాల పార్కింగ్, సైక్లింగ్, వాకింగ్ ట్రాకులు ఏర్పాటు చేయనున్నారు. డ్రైవర్స్ డార్మిటరి, రెండు సర్వీస్ క్వార్టర్స్ నిర్మించనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రాష్ట్ర రాజకీయాల్లో టైగర్ జోన్.. నల్గొండ జిల్లా: ఎమ్మెల్యే కోమటిరెడ్డి స
అంగన్వాడీల సంక్షేమానికి కూటమి కట్టుబడి ఉంది: హోం మంత్రి అనిత
Read Latest AP News And Telugu News