Share News

రాష్ట్ర రాజకీయాల్లో టైగర్ జోన్.. నల్గొండ జిల్లా: ఎమ్మెల్యే కోమటిరెడ్డి

ABN , Publish Date - Mar 01 , 2026 | 03:39 PM

నల్గొండ జిల్లా అంటే రాష్ట్ర రాజకీయాల్లో టైగర్ జోన్ అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అభివర్ణించారు. నల్లగొండ జిల్లా రాష్ట్ర రాజకీయాలను శాసించే జిల్లానే కాదని.. పోరాటాల ఖిల్లా అని ఆయన స్పష్టం చేశారు.

రాష్ట్ర రాజకీయాల్లో టైగర్ జోన్.. నల్గొండ జిల్లా: ఎమ్మెల్యే కోమటిరెడ్డి
Congress MLA Komatireddy Rajagopal Reddy

నల్గొండ, మార్చి 01: దేశంలో ఏ రాష్ట్రం చేపట్టని విధంగా తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల పథకాన్ని తీసుకొచ్చిందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ఈ స్కూళ్లు పూర్తయితే.. దేశంలోని ప్రతి రాష్ట్రం తెలంగాణ వైపు చూస్తోందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆదివారం నల్గొండలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో రూ. లక్షల కోట్లు అప్పులు చేసిందని విమర్శించారు. అవి సీమాంధ్ర కాంట్రాక్టర్లకు లాభమయ్యాయని మండిపడ్డారు.


హైదరాబాద్ మహానగరానికి కూతవేటు దూరంలో ఉన్న మునుగోడు నియోజకవర్గంలో అభివృద్ధి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లాలో అత్యంత వెనుకబడిన ప్రాంతం మునుగోడు నియోజకవర్గమని గుర్తు చేశారు. ఈ నియోజకవర్గానికి ఎంతో చేయాల్సి ఉందన్నారు.


మొట్టమొదటి అడుగు ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణమేనని తెలిపారు. నల్గొండ జిల్లా అంటే రాష్ట్ర రాజకీయాల్లో టైగర్ జోన్ అని అభివర్ణించారు. నల్లగొండ జిల్లా రాష్ట్ర రాజకీయాలను శాసించే జిల్లాతోపాటు పోరాటాల ఖిల్లా అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అంగన్వాడీల సంక్షేమానికి కూటమి కట్టుబడి ఉంది: హోం మంత్రి అనిత

పరీక్షా కేంద్రంలో ఇంటర్ బాలికకు గర్భస్రావం

Read Latest TG News And Telugu News

Updated Date - Mar 01 , 2026 | 05:48 PM