Share News

ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్‌గా అయతుల్లా అలిరేజా అరాఫీ

ABN , Publish Date - Mar 01 , 2026 | 04:49 PM

అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించడంతో షియా సీనియర్ మతాధికారి అయతుల్లా అలిరేజా అరాఫీని తాత్కాలిక సుప్రీం లీడర్‌గా నియమితులైనట్టు ఆ దేశ వార్తాసంస్థ ఆదివారంనాడు వెల్లడించింది.

ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్‌గా అయతుల్లా అలిరేజా అరాఫీ
Ayatollah Alireza Arafi

టెహ్రాన్: అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించడంతో షియా సీనియర్ మతాధికారి అయతుల్లా అలిరేజా అరాఫీ (Ayatollah Ali Khamenei)ని తాత్కాలిక సుప్రీం లీడర్‌గా నియమితులైనట్టు ఆ దేశ వార్తాసంస్థ ఆదివారంనాడు వెల్లడించింది. 67 ఏళ్ల అరాఫీ 'గార్డియన్ కౌన్సిల్' జ్యూరీ సభ్యుడిగా ఉన్నారు. తాత్కాలిక లీడర్‌షిప్ కౌన్సిల్‌కు ఆయనను జ్యూరీ సభ్యుడిగా నియమించారు. ఖమేనీ వారసుడి ఎంపిక జరిగేంతవరకూ ఇరాన్ సుప్రీం లీడర్ బాధ్యతలను అరాఫీ నిర్వహించనున్నారు.


ఎవరీ అయతుల్లా అలిరేజా అరాఫీ?

ఇరాన్‌లోని యాజ్డ్ ప్రావిన్స్‌లోని మెయిబోడ్‌లో 1959లో అరాఫీ జన్మించారు. ఖమేనీ తరహాలోనే సీనియర్ ఇస్లామిక్ స్కాలర్‌‌గా 'అయతుల్లా' అనే బిరుదును ఆయన అందుకున్నారు. గార్డియన్ కౌన్సిల్‌తో పాటు అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ సభ్యుడిగా ఉన్నారు. అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ రెండో డిప్యూటీ చైర్‌పర్సన్‌గా కూడా ఆయన సేవలందించారు.


దీనికిముందు, అల్-ముస్తఫా ఇంటర్నేషనల్ యూనివర్శిటీ చైర్‌పర్సన్‌గా అరాఫీ సేవలందించారు. అరబిక్, ఆంగ్లంలో మంచి వాగ్దాటి కలిగిన నేతగా పేరుంది. ఇరాన్ కృతమ మేథ (AI)ను అందిపుచ్చుకోవాల్సిన అవసరాన్ని ఆయన గట్టిగా చెప్పారు. గణితం, తత్వశాస్త్రంలోనూ ఆయనకు గట్టి పట్టుంది. ఇరాన్‌లో 1979 ఇస్లామిక్ విప్లవం మూలాలు ఉన్న నేతగా చెబుతారు. ఆయన తండ్రి మహమ్మద్ ఇబ్రహీం అల్-ఇరాఫీని తొలి సుప్రీం లీడర్ రుహొల్లా ఖమేనీ సన్నిహిత మిత్రుడిగా చెబుతారు. ఆ కారణంగానే ఖమేనీ మరణాంతరం ఆయన వారసుడిగా అరాఫీ పేరును విశ్లేషకులు తరచు ప్రస్తావిస్తుండేవారు.


ఇవి కూడా చదవండి..

ఖమేనీ మృతితో ముగ్గురి సభ్యుల కౌన్సిల్ చేతికి పాలనా పగ్గాలు

ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడి.. శనివారం ఉదయమే ఎందుకు చేశారు?

Updated Date - Mar 01 , 2026 | 05:35 PM