Share News

ఇరాన్ ప్రతీకార దాడులు.. సీరియస్ వార్నింగ్ ఇచ్చిన ట్రంప్

ABN , Publish Date - Mar 01 , 2026 | 01:56 PM

ఇరాన్ ప్రతీకార దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇరాన్‌కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు తన సొంత సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ది ట్రూత్‌లో ఆదివారం ఓ పోస్టు పెట్టారు.

ఇరాన్ ప్రతీకార దాడులు.. సీరియస్ వార్నింగ్ ఇచ్చిన ట్రంప్
Trump Iran warning force

న్యూయార్క్, మార్చి 1: ఇజ్రాయెల్-అమెరికా దాడుల్లో ఇరాన్ సుప్రీంలీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ చనిపోయిన సంగతి తెలిసిందే. శనివారం ఇజ్రాయెల్-అమెరికా దళాలు టెహ్రాన్‌లోని మొత్తం 30 ప్రాంతాలపై బాంబుల వర్షం కురిపించాయి. ఈ దాడుల్లో ఖమేనీతో పాటు ఖమేనీ కూతురు, అల్లుడు, మనవరాలు కూడా చనిపోయారు. సుప్రీం లీడర్ మరణంతో ఇరాన్ తీవ్ర ఆగ్రహానికి గురవుతోంది. అమెరికా, ఇజ్రాయెల్‌పై ప్రతీకార జ్వాలతో రగిలిపోతోంది. యూఎస్ సైనిక స్థావరాలపై భీకరదాడులు తప్పవని, దాడులు మరింత తీవ్రతరం చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. ప్రతీకార దాడులకు సైతం దిగుతోంది.


అమెరికా బేస్‌క్యాంపులు, మిత్రదేశాలపై ఇరాన్ దాడులు చేస్తోంది. దోహా, బెహ్రయిన్, ఖతార్, యూఏఈ, కువైట్, జోర్డాన్, సౌదీలోని యూఎస్ సైనిక స్థావరాలపై దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇరాన్ డ్రోన్ మరోసారి దుబాయ్ ఎయిర్‌పోర్టును తాకింది. యూఏఈ, ఖతార్‌లలో అనేక చోట్ల భారీ పేలుళ్లు సంభవించాయి. అబుదాబి ఎయిర్‌పోర్టుపై కూడా ఇరాన్ దాడి చేసినట్టు సమాచారం. పశ్చిమాసియాలోని 27 యూఎస్ స్థావరాలపై దాడులు చేస్తున్నట్టు ఇరాన్ ప్రకటించింది.


ట్రంప్ సీరియస్ వార్నింగ్

ఇరాన్ ప్రతీకార దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇరాన్‌కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు తన సొంత సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ది ట్రూత్‌లో ఆదివారం ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ‘ప్రతీకారానికి దిగకపోవడమే ఇరాన్‌కు మంచిది. ఇరాన్ ప్రతిదాడులు చేస్తే మరింత తీవ్రంగా దాడులు చేస్తాం. మునుపెన్నడూ చూడని మిస్సైల్స్‌తో దాడి చేస్తాం’అని తేల్చి చెప్పారు.

truth.jpg


ఇవి కూడా చదవండి

ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడి.. శనివారం ఉదయమే ఎందుకు చేశారు?

'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' ఫొటోలను విడుదల చేసిన అమెరికా

Updated Date - Mar 01 , 2026 | 02:48 PM