ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడి.. శనివారం ఉదయమే ఎందుకు చేశారు?
ABN , Publish Date - Mar 01 , 2026 | 01:43 PM
ఇరాన్‌పై అగ్రరాజ్యం అమెరికా 'ఆపరేషన్ ఎపిక్ ప్యూరీ'ని చేపట్టి ఆ దేశ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీని హతమార్చింది. అలాగే ఇరాన్‌కు చెందిన టాప్ కమాండర్లు, అత్యున్నత హోదాలో ఉన్న అధికారులు కూడా ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు.
ఇరాన్‌పై అగ్రరాజ్యం అమెరికా 'ఆపరేషన్ ఎపిక్ ప్యూరీ'ని చేపట్టి ఆ దేశ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీని హతమార్చింది. అలాగే ఇరాన్‌కు చెందిన టాప్ కమాండర్లు, అత్యున్నత హోదాలో ఉన్న అధికారులు కూడా ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. దాడి జరుగుతుందని చాలా కాలంగా వినిపిస్తూనే ఉంది. ఇరాన్ నాయకులు కూడా ఊహిస్తూనే ఉన్నారు. ఇంతకీ, ఇరాన్‌పై దాడులకు అమెరికా, ఇజ్రాయెల్ శనివారం ఉదయాన్నే ఎందుకు ఎంచుకున్నాయి? (Saturday morning attack Iran)
ఇరాన్‌పై దాడులకు శనివారం ఉదయం సమయాన్ని ఎంచుకోవడం యాదృచ్ఛికం కాదు. ఇంటెలిజెన్స్ సమాచారం, వ్యూహాత్మక ప్రయోజనం, ఆపరేషన్ లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని అమెరికా, ఇజ్రాయెల్ దళాలు శనివారం ఉదయం దాడి చేశాయి. ఇరాన్ అగ్ర నాయకత్వం శనివారం ఉదయం ఒకే చోట సమావేశమై ఉందని దళాలకు ఇంటెలిజెన్స్ సమాచారం వచ్చినట్టు తెలుస్తోంది (Iran strike strategy explained).

ఈ సమయంలో దాడి చేస్తే 'హై-వాల్యూ టార్గెట్ల'ని ఒకేసారి లక్ష్యంగా చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఉదయం వేళల్లో దాడి చేయడం ద్వారా ప్రయోజనం సాధించవచ్చు. ఆ సమయంలో రక్షణ చర్యలు పూర్తిగా సిద్ధంగా ఉండకపోవచ్చు. ఇరాన్‌లో శనివారం సాధారణంగా పనిదినం. అందువల్ల అధికారులు కార్యాలయాల్లో లేదా సమావేశాల్లో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. (US Israel strikes Iran timing).
నిజానికి ఖమేనీ శనివారం సాయంత్రం టెహ్రాన్‌లో ఈ సమావేశాన్ని నిర్వహిస్తారనే సమాచారం అమెరికా దళాల వద్ద ఉందట. అయితే, ఇజ్రాయెల్ నిఘా వర్గాలు శనివారం ఉదయం ఒక సమావేశం జరుగుతున్నట్టు గుర్తించాయట. దీంతో వెంటనే అమెరికా, ఇజ్రాయెల్ దళాలు దాడి ప్రారంభించాయి.
ఇవి కూడా చదవండి..
ఇరాన్‌పై దాడులు.. భారత్‌కు భారీ నష్టం తప్పదా..?
బంగారం, వెండిపై వార్ ఎఫెక్ట్.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..