మూడో వన్డేలోనూ భారత్ ఓటమి.. ఆసీస్ క్లీన్ స్వీప్
ABN , Publish Date - Mar 01 , 2026 | 04:43 PM
భారత్‌తో మూడు వన్డేల సిరీస్‌ను ఆసీస్ దక్కించుకుంది. 3-0తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఆఖరి మ్యాచ్‌లో ఆసీస్‌పై టీమిండియా మహిళలు 185 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలయ్యారు.
ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియాపై టీ20 సిరీస్‌ను ఘనంగా దక్కించుకున్న భారత మహిళా జట్టు.. వన్డే సిరీస్‌లో తీవ్రంగా విఫలమైంది. ఆడిన మూడు మ్యాచుల్లోనూ గెలిచి ఆసీస్ 3-0 తేడాతో సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. హోబర్ట్ వేదికగా టీమిండియాతో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో కంగారూలు 185 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించారు. 409 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత మహిళలు.. 45.1 ఓవర్లలో 224 పరుగులకే కుప్పకూలారు.
స్నేహ్ రాణా(44), జెమీమా రోడ్రిగ్స్(42) పర్వాలేదనిపించారు. మిగతా బ్యాటర్లంతా తీవ్రంగా విఫలమయ్యారు. ప్రతీకా రావల్(27), స్మృతి మంధాన(0), హర్మన్ ప్రీత్(25), హర్లీన్ డియోల్(14), దీప్తి శర్మ(29), రిచా ఘోష్(18), కాష్వీ గౌతమ్(0), శ్రీచరణి(11) నిరాశపర్చారు. ఆసీస్ బౌలర్ల ధాటికి వరుసగా పెవిలియన్‌కు చేరారు. ఆసీస్ బౌలర్లలో అలానా కింగ్ 4 వికెట్లతో చెలరేగింది. జార్జియా వారేహం 2, కేరీ, సదర్లాండ్, ఆష్లీ గార్డ్‌నర్ తలొక వికెట్ పడగొట్టారు.
అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ జట్టు విధ్వంసం సృష్టించింది. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఏకంగా 409 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ అలీసా హీలీ(158), వికెట్ కీపర్ బెత్ మూనీ(106) సెంచరీలతో చెలరేగారు. జార్జియా వాల్(62) హాఫ్ సెంచరీ చేసింది. వికెట్లు తీయడానికి భారత బౌలర్లు తీవ్రంగా చెమటోడ్చారు. శ్రీచరణి 2, స్నేహ్ రాణా 2, రేణుకా సింగ్, కాష్వీ, దీప్తి శర్మ తలొక వికెట్ పడగొట్టారు.
ఇవి కూడా చదవండి:
టీ20 డబ్ల్యూసీ: విండీస్‌తో పదేళ్ల నాటి పగ.. తీర్చుకునేందుకు సూర్య సేన రెడీ
టీ20 డబ్ల్యూసీ: పాకిస్థాన్ ఓపెనర్ విధ్వంసం.. కోహ్లీ వరల్డ్ రికార్ట్ బ్రేక్