క్రికెట్‌కు వీడ్కోలు.. ఆఖరి మ్యాచ్‌లో దంచికొట్టిన అలీసా హీలీ
ABN , Publish Date - Mar 01 , 2026 | 03:37 PM
ఆస్ట్రేలియా మహిళా జట్టు కెప్టెన్ అలీసా హీలీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. భారత్‌తో ఆసీస్ మూడు వన్డేల సిరీస్ ఆడుతోంది. అందులో భాగంగా నేడు ఆఖరి మ్యాచ్ జరుగుతోంది. ఇందులో హీలీ అద్భుత సెంచరీతో అదరగొట్టింది.
ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టులో ఓ తరం ముగిసింది. 6 సార్లు టీ20 ప్రపంచ కప్.. 2 సార్లు వన్డే ప్రపంచ కప్ ఆసీస్‌కు అందించిన దిగ్గజం నేడు తన చివరి మ్యాచ్ ఆడేసింది. ఆ జట్టు కెప్టెన్, స్టార్ బ్యాటర్ అలీసా హీలీ ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ప్రస్తుతం భారత్‌తో ఆసీస్ మూడు వన్డేల సిరీస్ ఆడుతోంది. తన చివరి మ్యాచ్ హీలీ నేడు ఆడేసింది. తన కెరీర్‌కు తగ్గట్టుగా.. గ్రాండ్‌గా రిటైర్‌మెంట్ తీసుకుంది. అదెలాగంటారా..
టాస్ ఓడి ఆసీస్ మహిళా జట్టు బ్యాటింగ్‌కు దిగింది. కెప్టెన్ అలీసా హీలీ ఓపెనర్‌గా క్రీజులోకి వచ్చింది. అంతేనా అద్భుత సెంచరీతో అదరగొట్టింది. 50 ఓవర్లలో ఆసీస్ చేసిన 409 పరుగుల భారీ స్కోర్‌లో.. కెప్టెన్ హీలీ చేసింది 158 పరుగులు. 98 బంతుల్లో 27 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో ఏకంగా 158 పరుగుల భారీ సెంచరీ సాధించింది. హీలీని మళ్లీ వన్డే క్రికెట్ స్టేడియంలో చూడబోమని కాబోలు.. బంతి, బ్యాట్ రెండూ తనకు అనుకూలంగా మారి అద్భుతం సృష్టించాయి.
2010లో క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన హీలీ.. ఎన్నోరికార్డులను తన పేరిట లిఖించుకుంది. మెగ్ లానింగ్ నాయకత్వంలో చాలా కాలం వైస్ కెప్టెన్‌గా ఉన్న హీలీ.. 2023లో పూర్తి స్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టింది. ప్రపంచ కప్ ఫైనల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్.. మహిళల టీ20 అంతర్జాతీయ ఫార్మాట్లో వికెట్ కీపర్‌గా అత్యధిక డిస్మిసల్స్ వంటి అరుదైన రికార్డులు ఆమె సొంతం. ఆఖరి మ్యాచ్ కావడంతో టీమిండియా ప్లేయర్లంతా ఆమెకు ‘గాడ్ ఆఫ్ హానర్’ ప్రకటించారు.
ఇవి కూడా చదవండి:
టీ20 డబ్ల్యూసీ: విండీస్‌తో పదేళ్ల నాటి పగ.. తీర్చుకునేందుకు సూర్య సేన రెడీ
టీ20 డబ్ల్యూసీ: పాకిస్థాన్ ఓపెనర్ విధ్వంసం.. కోహ్లీ వరల్డ్ రికార్ట్ బ్రేక్