టీ20 డబ్ల్యూసీ: విండీస్‌తో పదేళ్ల నాటి పగ.. తీర్చుకునేందుకు సూర్య సేన రెడీ
ABN , Publish Date - Mar 01 , 2026 | 12:48 PM
టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్-8లో భాగంగా ఇవాళ అత్యంత కీలకమైన ఘట్టం ప్రారంభం కానుంది. కోల్ కత్తా వేదికగా భారత్, వెస్టిండీస్ మధ్య డూ ఆర్ డై మ్యాచ్ జరగనుంది. ఈ పోరులో గెలిచిన వారు సెమీస్ కు చేరితే.. ఓడిన జట్టు ఇంటిబాట పట్టనుంది.
స్పోర్ట్స్ డెస్క్: టీ20 ప్రపంచ కప్( T20 World Cup 2026) సూపర్-8లో భాగంగా ఇవాళ అత్యంత కీలకమైన ఘట్టం ప్రారంభం కానుంది. కోల్ కత్తా వేదికగా భారత్, వెస్టిండీస్ మధ్య డూ ఆర్ డై మ్యాచ్ జరగనుంది. ఈ పోరులో గెలిచిన వారు సెమీస్ కు చేరితే.. ఓడిన జట్టు ఇంటిబాట పట్టనుంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్ తన టైటిల్‌ను నిలబెట్టుకునే క్రమంలో ఈ మ్యాచ్ తప్పనిసరిగా గెలవాలి. ఇదే సమయంలో పదేళ్ల నాటి ఓ పగను కూడా తీర్చుకునే అవకాశం భారత్‌కు దక్కింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం...
సరిగ్గా పదేళ్ల క్రితం టీ20 వరల్డ్ కప్ 2016లో భారత్, విండీస్ జట్లు ముఖాముఖి తలపడ్డాయి. భారత్ వేదికగా జరిగిన 2016 సెమీఫైనల్‌లో భారత జట్టును ఓడించి.. వెస్టిండీస్ ఫైనల్‌కు వెళ్లి కప్పు కొట్టింది. సరిగ్గా పదేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ అదే భారత గడ్డపై.. ఇరుజట్లు తలపడనున్నాయి. సెమీస్ బెర్తు కోసం జరుగుతున్న ఈ పోరులో విండీస్‌ను ఓడించి పాత పగను తీర్చుకోవాలని సూర్యకుమార్ యాదవ్ సేన పట్టుదలగా ఉంది. అయితే టీ20 ప్రపంచ కప్ చరిత్రలో ఈ రెండు జట్ల మధ్య 4 మ్యాచులు జరగ్గా.. వెస్టిండీస్ 3 సార్లు గెలవగా, భారత్ ఒక్కసారి (2014లో) మాత్రమే విజయం సాధించింది. ఈ రికార్డు టీమిండియాను కాస్త టెన్షన్ పెడుతుంది.
పొట్టి ప్రపంచ కప్ కాకుండా ఓవరాల్ గా టీ20 రికార్డులను పరిశీలిస్తే మాత్రం భారత్‌దే పైచేయిగా ఉంది. ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య జరిగిన 30 అంతర్జాతీయ టీ20ల్లో ఇండియా 19 సార్లు, వెస్టిండీస్ 10 సార్లు గెలిచింది. ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు. ఇక ఇవాళ మ్యాచ్ జరుగుతున్న ఈడెన్ గార్డెన్స్ స్టేడియం టీమిండియాకు బాగా కలిసొచ్చిన మైదానం. ఇక్కడ కరేబియన్ జట్టుతో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ భారతే విజయం సాధించింది. మరోవైపు ఈ మైదానం విండీస్ జట్టుకు ఎంతో ప్రత్యేకమైనది. ఈ స్టేడియంలో వారు ఆడిన మూడు ప్రపంచ కప్ మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఆదివారం రాత్రి 7:00 గంటలకు ప్రారంభం కానుంది. ఈ కీలక పోరులో రింకు సింగ్ వంటి స్టార్ ప్లేయర్లు జట్టులోకి తిరిగి రావడం భారత్‌కు పెద్ద బూస్ట్ అని చెప్పాలి. వెస్టిండీస్ హిట్టర్లను అడ్డుకోవాలంటే భారత బౌలర్లు శ్రమించక తప్పదు. మరి.. భారత జట్టు పదేళ్ల నాటి పగను తీర్చుకుంటుందా లేదా అనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది.
ఇవి కూడా చదవండి:
టీ20 డబ్ల్యూసీ: పాకిస్థాన్ ఓపెనర్ విధ్వంసం.. కోహ్లీ వరల్డ్ రికార్ట్ బ్రేక్
శ్రీలంక ఓటమి.. జయసూర్య సంచలన నిర్ణయం..