Share News

చేతులపై చాక్లెట్‌ పోస్తారు!

ABN , Publish Date - Mar 01 , 2026 | 12:21 PM

రెస్టారెంట్‌కు వెళ్తే వెయిటర్లు పద్ధతిగా స్పూను, ఫోర్కులు పెట్టి వడ్డిస్తారు. అదే అమెరికాలోని వాషింగ్టన్‌ డి.సి.లో ఉన్న ‘ఎల్‌ సియోలో’ అనే రెస్టారెంట్‌కు వెళ్తే మాత్రం సీన్‌ రివర్స్‌! అక్కడ వెయిటర్‌... వేడి వేడిగా కరిగించిన చాక్లెట్‌ను నేరుగా కస్టమర్‌ అరచేతుల్లో పోస్తాడు.

చేతులపై చాక్లెట్‌ పోస్తారు!

రెస్టారెంట్‌కు వెళ్తే వెయిటర్లు పద్ధతిగా స్పూను, ఫోర్కులు పెట్టి వడ్డిస్తారు. అదే అమెరికాలోని వాషింగ్టన్‌ డి.సి.లో ఉన్న ‘ఎల్‌ సియోలో’ అనే రెస్టారెంట్‌కు వెళ్తే మాత్రం సీన్‌ రివర్స్‌! అక్కడ వెయిటర్‌... వేడి వేడిగా కరిగించిన చాక్లెట్‌ను నేరుగా కస్టమర్‌ అరచేతుల్లో పోస్తాడు. షాక్‌ అయ్యేలోపే... ‘దాన్ని చేతులకు రుద్దుకుని నాకండి’ అంటాడు. వినడానికి వింతగా ఉన్నా, దానికోసం ఏకంగా రూ. 26 వేలు ఖర్చు పెట్టడానికి కూడా జనాలు వెనకాడట్లేదు మరి.


ఈ వింతైన డైనింగ్‌ కాన్సెప్ట్‌ను ప్రముఖ కొలంబియన్‌ చెఫ్‌ జువాన్‌ మాన్యుయెల్‌ బారియెంటోస్‌ (ఎల్‌ సియోలో యజమాని) ప్రవేశపెట్టారు. దీనిని ఆయన ‘న్యూరోగాస్ట్రోనమీ’ అనే కాన్సెప్ట్‌తో రూపొందించారు. అంటే, తినే ఆహారం కేవలం నాలుకకే కాకుండా... ముక్కుకు, చర్మానికి కూడా ఒక గొప్ప అనుభూతిని ఇవ్వాలనేదే ఈ చాకోథెరఫీ ముఖ్యోద్దేశం. చేతులపై చాక్లెట్‌ పోయగానే వచ్చే ఆ పరిమళం చిన్ననాటి జ్ఞాపకాలను తట్టిలేపుతుందట.


అలాగని కేవలం చాక్లెట్‌ కోసమే రూ. 26 వేల ఖర్చు అనుకుంటే పొరపాటే! అక్కడ ‘ది ఎక్స్‌పీరియన్స్‌ మెనూ’లో భాగంగా సుమారు 18 నుంచి 22 రకాల వంటకాలను వడ్డిస్తారు. అందులో ఈ చాక్లెట్‌ థెరపీ కూడా ఒక కోర్స్‌ అన్నమాట. సోషల్‌ మీడియాలో ఈ థెరపీ ట్రెండింగ్‌లో ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి:

బంగారం, వెండిపై వార్ ఎఫెక్ట్.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

తిరుపతిలో మరో చారిత్రక ఘట్టం.. 16 కోర్టు భవనాలకు భూమి పూజ

Read Latest Telangana News and National News

Updated Date - Mar 01 , 2026 | 12:21 PM