సంచలనం.. రిటైర్‌మెంట్‌ను వెనక్కి తీసుకున్న పాక్ ప్లేయర్
ABN , Publish Date - Mar 01 , 2026 | 03:23 PM
టీ20 ప్రపంచ కప్2026 నుంచి పాకిస్థాన్ నిష్క్రమించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొద్ది గంటలకే పాకిస్థాన్ మాజీ ప్లేయర్ సంచలన ప్రకటన చేశాడు. రిటైర్మెంట్ విషయంలో తన మనసు మార్చుకున్నట్లు ప్రకటించాడు.
స్పోర్ట్స్ డెస్క్: టీ20 ప్రపంచ కప్2026 నుంచి పాకిస్థాన్(Pakistan) నిష్క్రమించిన సంగతి తెలిసిందే. నిన్న(శనివారం) తమ చివరి సూపర్-8 మ్యాచ్‌లో శ్రీలంకపై గెలిచినా మెరుగైన రన్‌రేట్ లేని కారణంగా సెమీస్‌కు అర్హత సాధించలేకపోయింది. గ్రూప్-2 నుంచి ఇంగ్లండ్ ఇదివరకే సెమీస్ బెర్త్ సాధించగా.. తాజాగా మెరుగైన రన్‌రేట్‌తో న్యూజిలాండ్ సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఇదిలా ఉంటే, పాక్ టీ20 ప్రపంచకప్ నుంచి నిష్క్రమించిన గంటల వ్యవధిలో ఆ దేశ దిగ్గజ స్పిన్నర్ కుమారుడు సంచలన నిర్ణయం తీసుకున్నాడు. మరి.. అతడు ఎవరు?, అతడు తీసుకున్న నిర్ణయం ఏంటి?, ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం...
పాకిస్థాన్ దిగ్గజ స్పిన్నర్ అబ్దుల్ ఖాదిర్ కొడుకు, పాక్ మాజీ స్పిన్నర్ అయిన ఉస్మాన్ ఖాదిర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. గతంలో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన అతడు, ఇప్పుడు మళ్లీ అన్ని ఫార్మాట్లలో ఆడేందుకు సిద్ధమని ప్రకటించాడు. ఉస్మాన్ ఖాదిర్ తన రిటైర్‌మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం పాకిస్థాన్ క్రికెట్‌లో చర్చనీయాంశంగా మారింది.
ఉస్మాన్ ఖాదిర్ 2024 అక్టోబర్‌లో ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. అబ్రార్ అహ్మద్, షాదాబ్ ఖాన్ లాంటి వారు జట్టులోకి రాక ముందు పాక్ టీ20 జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా ఉస్మాన్ ఖాదిర్ ఉన్నాడు. అయితే యువ స్పిన్నర్ల రాకతో అతనికి అవకాశాలు తగ్గిపోయాయి. ఈ క్రమంలో రెండేళ్ల క్రితం టీ20 ప్రపంచకప్ 2026 నుంచి వైదొలిగాక ఉస్మాన్ ఖాదిర్.. తాజాగా తన మనసు మార్చుకున్నాడు. ఇటీవల ఆస్ట్రేలియాలో ఆడినప్పుడు ఉస్మాన్ 41 వికెట్లు తీశాడు. అలాగే స్థానిక లీగ్‌లలో ఫర్వాలేదనిపించాడు. తన ప్రదర్శనపై ఇంటాబయటా మంచి స్పందన రావడంతో ఉస్మాన్‌కు అంతర్జాతీయ వేదికపై తిరిగి రాణించగలనన్న నమ్మకం కలిగిందిని సమాచారం.
'నా ప్రయాణం ఇంకా ముగియలేదు. పాకిస్థాన్ క్రికెట్ కోసం మళ్లీ సిద్ధంగా ఉన్నాను. క్రికెట్ నాకు ఒక ఆట కంటే ఎక్కువ. ఇది నా కుటుంబ వారసత్వం.' అని ఎక్స్ వేదికగా ఉస్మాన్ ప్రకటించాడు. ఇక ఉస్మాన్ క్రికెట్ కెరీర్ విషయానికి వస్తే.. తండ్రి తరహాలోనే రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్నర్ అయిన అతడు 2020-2023 మధ్య పాక్ తరఫున 26అంతర్జాతీయ మ్యాచులు ఆడాడు. 25 టీ20 మ్యాచుల్లో 31 వికెట్లు , ఒక వన్డే మ్యాచ్ లో ఒక వికెట్ సాధించాడు. ఉస్మాన్ 2020లో జింబాబ్వేపై టీ20తో పాక్ తరఫున అరంగేట్రం చేశాడు. హాంగ్‌జౌలో జరిగిన 2023 ఆసియా క్రీడల్లో బంగ్లాదేశ్‌పై తన చివరి మ్యాచ్ ఆడాడు.
ఇవి కూడా చదవండి:
టీ20 డబ్ల్యూసీ: విండీస్‌తో పదేళ్ల నాటి పగ.. తీర్చుకునేందుకు సూర్య సేన రెడీ
టీ20 డబ్ల్యూసీ: పాకిస్థాన్ ఓపెనర్ విధ్వంసం.. కోహ్లీ వరల్డ్ రికార్ట్ బ్రేక్