పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతల ప్రభావం.. మార్చి 2న జరగాల్సిన CBSE పరీక్షలు వాయిదా
ABN , Publish Date - Mar 01 , 2026 | 03:46 PM
ప్రస్తుతం పశ్చిమ ఆసియా దేశాల్లో నెలకొన్న అస్థిర పరిస్థితుల దృష్ట్యా, మార్చి 2న జరగాల్సిన 10, 12వ తరగతి బోర్డు పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు సీబీఎస్ఈ ప్రకటించింది. వివరాల్లోకి వెళితే..
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం పశ్చిమ ఆసియా (Middle East) దేశాల్లో నెలకొన్న అస్థిర పరిస్థితుల దృష్ట్యా, మార్చి 2న జరగాల్సిన 10, 12వ తరగతి బోర్డు పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ప్రకటించింది. విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు స్పష్టం చేసింది. కొత్త తేదీలను తరువాత ప్రకటిస్తామని బోర్డు తెలిపింది.
‘మార్చి 02న జరగాల్సిన 10వ తరగతి, 12వ తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. కొత్త తేదీలను త్వరలోనే ప్రకటిస్తాం. మార్చి 3న పరిస్థితులను సమీక్షించి, మార్చి5 నుంచి జరగాల్సిన పరీక్షలకు సంబంధించిన నిర్ణయం తీసుకుంటాం. బహ్రెయిన్, ఇరాన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈతో సహా అనేక దేశాలలో పరీక్షలు వాయిదా పడ్డాయి. మార్చి 3న పరిస్థితులను సమీక్షించి, మార్చి5 నుంచి జరగాల్సిన పరీక్షలకు సంబంధించిన నిర్ణయం తీసుకుంటాం’ అని ‘ఎక్స్’ వేదికగా అధికారిక నోటీసు జారీ చేసింది.
నకిలీ నోటీసు..
ఉద్రిక్త పరిస్థితుల కారణంగా కారణంగా పశ్చిమ ఆసియాలో కొన్ని బోర్డు పరీక్షలు రద్దయ్యాయని పేర్కొంటూ ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్న నకిలీ నోటీసును.. బోర్డు ఆదివారం తోసిపుచ్చింది. ఈ నకిలీ సర్క్యులర్ నుంచి CBSE విద్యార్థులను అప్రమత్తం చేసింది. విద్యార్ధులు, తల్లిదండ్రులు తప్పుడు ప్రచారాలను నమ్మ వద్దని, కేవలం బోర్డు అధికారిక వెబ్‌సైట్ ద్వారా వచ్చే సమాచారాన్నే పరిగణనలోకి తీసుకోవాలని అధికారులు కోరారు. ఈ ఏడాది భారతదేశం అంతటా విదేశాలలో 26 దేశాలలో 43 లక్షల మందికి పైగా విద్యార్థులు బోర్డు పరీక్షలకు హాజరవుతున్నారు.
ఇవి కూడా చదవండి..
ఇరాన్‌పై దాడులు.. భారత్‌కు భారీ నష్టం తప్పదా..?
బంగారం, వెండిపై వార్ ఎఫెక్ట్.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..