Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Feb 06 , 2026 | 06:05 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి..

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Feb 06, 2026 21:38 IST

    మహారాష్ట్ర: గడ్చిరోలిలో భారీ ఎన్‌కౌంటర్‌

    • ముగ్గురు మహిళలు సహా ఏడుగురు మావోయిస్టులు మృతి.

    • మృతుల్లో గడ్చిరోలి డివిజన్‌ కమిటీ ఇన్‌చార్జ్‌.

    • కామారెడ్డి జిల్లాకు చెందిన ప్రభాకర్‌ మృతి.

    • ప్రభాకర్‌పై రూ.25 లక్షల రివార్డు.

    • ఘటనాస్థలిలో 3 AK-47, పలు ఆయుధాలు స్వాధీనం.

    • ఎదురుకాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతి.

  • Feb 06, 2026 21:30 IST

    aఅమరావతి: జోగి రమేష్‌ పిటిషన్‌పై హైకోర్టు విచారణ.

    • తనపై కేసులు క్వాష్‌ చేయాలని జోగి రమేష్‌ పిటిషన్‌.

    • జోగి రమేషన్‌ను అరెస్ట్‌ చేయొద్దని హైకోర్టు ఆదేశం.

    • అనుచిత వ్యాఖ్యలు చేశారని ఇబ్రహీంపట్నం, తిరుపతి పీఎస్‌ల్లో కేసులు.

  • Feb 06, 2026 21:28 IST

    దేవుడిని అడ్డుపెట్టుకుని రూ.250 కోట్లు దోచేశారు: మంత్రి నారా లోకేశ్‌

    • కల్తీ లిక్కర్, నెయ్యి, బాబాయ్‌ హత్యకు టీమ్‌ 11 బ్రాండ్ అంబాసిడర్లు.

    • క్లీన్‌చిట్ వచ్చిందంటూ టీమ్‌ 11 తప్పుడు ప్రచారం.

    • టీమ్‌ 11 దుష్ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టాలి.

    • విశాఖ ఉక్కును లాభాల్లోకి తెచ్చిన ఘనత కూటమి సర్కార్‌దే.

    • దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో ఏపీకి 25 శాతం వస్తున్నాయి.

    • బూత్‌స్థాయి నుంచి పార్టీ పునర్నిర్మాణమే లక్ష్యం.

  • Feb 06, 2026 21:02 IST

    చీరాల: 'మహాపాపం.. నిజం' పేరుతో ప్లెక్సీ ఏర్పాటు

    • జగన్ ఫొటోతో ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన టీడీపీ శ్రేణులు.

    • గడియార స్తంభం సెంటర్‌కు టీడీపీ, వైసీపీ శ్రేణులు.

    • ఘర్షణలు జరగకుంటా పటిష్ట పోలీసు బందోబస్తు.

  • Feb 06, 2026 20:58 IST

    యువభారత్‌ గెలుపులో వైభవ్‌ సూర్యవంశీ కీలకపాత్ర

    • 80 బంతుల్లో 175 పరుగులు చేసిన వైభవ్‌ సూర్యవంశీ.

    • 15 సిక్స్‌లు, 15 ఫోర్లతో 175 పరుగులు చేసిన వైభవ్‌.

    • ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ - వైభవ్‌ సూర్యవంశీ.

    • ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నీ - వైభవ్‌ సూర్యవంశీ.

  • Feb 06, 2026 20:53 IST

    ఢిల్లీ: సఫ్దర్‌జంగ్‌లోని ఎన్‌డీఎంసీ గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం

    • మంటలార్పుతున్న 8 ఫైర్ ఇంజన్లు.

  • Feb 06, 2026 20:39 IST

    U-19 వరల్డ్‌ కప్‌ విజేత భారత్‌

    • ఆరోసారి ప్రపంచ ఛాంపియన్‌గా యువ భారత్‌.

    • ఇంగ్లండ్‌పై 100 పరుగుల తేడాతో ఘన విజయం.

    • భారత్‌ 411/9, ఇంగ్లండ్‌ 311 ఆలౌట్‌.

    • ఇప్పటికే 2000, 2008, 2012, 2018, 2022లో టైటిల్స్‌ గెలిచిన భారత్‌.

    • 80 బంతుల్లో 175 పరుగులు చేసిన వైభవ్‌ సూర్యవంశీ.

    • 15 సిక్స్‌లు, 15 ఫోర్లతో 175 పరుగులు చేసిన వైభవ్‌.

  • Feb 06, 2026 20:05 IST

    మేడారంలో రెండో రోజు 160 హుండీల లెక్కింపు

    • నేటి హుండీల ఆదాయం రూ.3,54,25,200.

    • 2 రోజుల మేడారం హుండీల ఆదాయం రూ. 6,04,53,636.

    • ఇప్పటివరకు మొత్తం 285 హుండీల లెక్కింపు.

  • Feb 06, 2026 20:04 IST

    విశాఖ: ఏపీకి ఈ ఏడాది అత్యంత కీలకం: కేంద్రమంత్రి రామ్మోహన్‌

    • ఏపీకి అనేక పెట్టుబడులు వస్తున్నాయి.

    • శరవేగంగా భోగాపురం ఎయిర్‌పర్టు పనులు.

  • Feb 06, 2026 19:31 IST

    నెల్లూరు: ఉదయగిరి అటవీ ప్రాంతంలో పెద్దపులి కలకలం

    • దుర్గం కొండకోనకాలువ దగ్గర జంతువుల మృతదేహాలు గుర్తింపు.

    • పెద్దపులి జాడ కోసం ట్రాప్‌ కెమెరాలు ఏర్పాటు చేసిన ఫారెస్ట్‌ అధికారులు.

  • Feb 06, 2026 19:07 IST

    రాజమహేంద్రవరం: ఆపరేషన్‌ టైగర్‌ విజయవంతం

    • 4 గంటల రెస్క్యూ తర్వాత పులిని బంధించిన అటవీ సిబ్బంది

    • పులికి మత్తు ఇంజక్షన్‌ ఇచ్చి సురక్షితంగా బంధించిన రెస్క్యూ టీమ్‌

    • బోనులో పులిని బంధించి విశాఖకు తరలింపు

    • 17 రోజుల తర్వాత పులిని బంధించిన పుణె రెస్క్యూ టీమ్‌

  • Feb 06, 2026 18:34 IST

    వేంకటేశ్వరస్వామి సన్నిధిలో పనిచేసేవారిలో చిత్తశుద్ధి లోపించింది: ఎల్వీ సుబ్రహ్మణ్యం

    • తిరుమల ప్రసాదంలో రసాయనాలు కలిపి మహాపాపం చేశారు.

    • అసలు తప్పే జరగలేదన్నట్లు మాట్లాడటం శోచనీయం.

    • తప్పు చేసినవారిలో చిత్తశుద్ధి ఇంకా రావడం లేదు.

    • తమకు శిక్షలు పడవు అనే ధైర్యంతో కొందరు ఉన్నారు.

  • Feb 06, 2026 17:52 IST

    కేసీఆర్‌ను కాపాడుతున్నది కిషన్‌రెడ్డే: సీఎం రేవంత్‌రెడ్డి

    • కిషన్‌రెడ్డి కల్వకుంట్ల కిషన్‌రావుగా మారారు.

    • కేసీఆర్‌కు దొంగపుత్రుడు కేటీఆర్‌.

    • కేసీఆర్‌కు దత్తపుత్రుడు ఈ కిషన్‌రావు.

  • Feb 06, 2026 17:43 IST

    ఎన్టీఆర్‌ జిల్లా: జగన్ ర్యాలీలో మరో మరణం

    • బైక్‌తో విన్యాసాలు చేస్తూ బారికేడ్‌ను ఢీకొని యువకుడు మృతి.

    • మృతుడు ఇబ్రహీంపట్టణానికి చెందిన భార్గవ్‌గా గుర్తింపు.

    • కాసేపటికిందే ర్యాలీలో వైసీపీ నేత రాంబాబు మృతి.

    • యాత్ర సాగదీత వల్లే సొమ్మసిల్లిన రాంబాబు.

    • ఆస్పత్రికి తరలించేలోపే వైసీపీ నేత రాంబాబు మృతి.

    • ఇప్పటి వరకు జగన్ దండయాత్ర ర్యాలీలో ఇద్దరు మృతి.

  • Feb 06, 2026 17:39 IST

    తెలంగాణలో పవన్‌ మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం రద్దు

    • అనివార్య కారణాలతో పవన్‌ ప్రచారం రద్దు: జనసేన

  • Feb 06, 2026 17:38 IST

    టీ20 వరల్డ్‌కప్‌ భారత జట్టులోకి సిరాజ్‌.

    • గాయం కారణంగా సిరీస్‌కు దూరమైన హర్షిత్‌రాణా.

    • హర్షిత్‌రాణా స్థానంలో సిరాజ్‌కు అవకాశం.

  • Feb 06, 2026 17:27 IST

    నిజామాబాద్: కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థులతో సీఎం రేవంత్‌

    • నగరంలో కాంగ్రెస్‌ను గెలిపించే బాధ్యత మీదే.

    • కార్పొరేషన్‌లో మహిళా అభ్యర్థులు సగం మంది ఉన్నారు.

    • ఎన్నికల్లో మహిళలే కీలకంగా మారబోతున్నారు.

    • టికెట్ వచ్చిన వాళ్లు అందరినీ కలుపుకుని పోవాలి.

    • పార్టీ నుంచి అన్ని విధాల సహకారం ఉంటుంది.

    • అన్ని సర్వేలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నాయి.

    • అభివృద్ధికి కావాల్సిన నిధులు ఇస్తా.. నిర్లక్ష్యం చేయొద్దు.

  • Feb 06, 2026 17:14 IST

    ఎన్టీఆర్‌: జోగి రమేష్‌ నివాసానికి వైఎస్‌ జగన్‌

    • తాడేపల్లి నుంచి 6 గంటలపాటు యాత్ర సాగదీసిన జగన్‌.

    • జగన్‌ కోసం ఉదయం నుంచి కార్యకర్తల పడిగాపులు.

    • హైవేపై గంటల తరబడి జగన్‌ యాత్రతో సామాన్యుల అవస్థలు.

  • Feb 06, 2026 17:08 IST

    అండర్ 19 ప్రపంచ కప్ ఫైనల్‌లో భారత్‌ భారీ స్కోర్‌

    • ఇంగ్లండ్‌ టార్గెట్‌ 412 పరుగులు.

    • భారత్‌ స్కోర్‌ 411/9.

    • 80 బంతుల్లో వైభవ్‌ సూర్యవంశీ 175 పరుగులు.

    పూర్తికథనం

  • Feb 06, 2026 17:05 IST

    ఈ నెల 26 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు..

    • 10 నుంచి 15 రోజులపాటు సాగనున్న సమావేశాలు.

    • ఇప్పటికే శాఖలవారీగా సీఎస్‌ సమీక్షలు పూర్తి.

    • త్వరలో శాఖాధిపతులతో సీఎం, డిప్యూటీ సీఎం సన్నాహక సమావేశం.

  • Feb 06, 2026 17:04 IST

    జగన్‌ ఐదేళ్ల పాలనంతా అక్రమాలే: హోంమంత్రి అనిత

    • భక్తుల మనోభావాలతో చెలగాటమాడారు.

    • నెయ్యిలో రసాయనాలు కలిపినట్లు నివేదికలో తేలింది.

    • జంతువుల కొవ్వు ఉన్నట్లు NDDB నివేదిక.

    • తప్పులు కప్పిపుచ్చుకునేందుకే జగన్‌ యాత్రలు.

  • Feb 06, 2026 16:55 IST

    మార్చి 19న గద్దర్‌ అవార్డుల ప్రదానం: దిల్‌రాజు

    • గద్దర్‌ అవార్డులకు 90 సినిమాల ఎంట్రీ.

    • 90 సినిమాల్లో 68 ఫీచర్‌ ఫిల్మ్స్‌.

    • గద్దర్‌ అవార్డులకు 22 షార్ట్‌ ఫిల్మ్స్‌ ఎంపిక.

    • మార్చి 5 లోపు జ్యూరీ స్క్రూటినీ.

  • Feb 06, 2026 16:24 IST

    లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

    • 266 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్.

    • 51 పాయింట్ల లాభంతో ముగిసిన నిఫ్టీ.

  • Feb 06, 2026 16:19 IST

    బూతులు తిట్టేవారిని జగన్ పరామర్శిస్తున్నారు: ఎంపీ అప్పలనాయుడు

    • కనీసం వారిని మందలిస్తారని అనుకున్నాం.

    • కానీ జగన్ తీరు ఆశ్చర్యంగా ఉంది.

    • వైసీపీ నేతలు బూతు పురాణాలు తగ్గించాలని ప్రజలు కోరుకుంటున్నారు.

  • Feb 06, 2026 16:15 IST

    కేసీఆర్‌ను జాతిపిత అంటే ఒప్పుకునేదే లేదు: కోదండరామ్

    • సెంటిమెంట్‌ను రాజకీయాల కోసం వాడుకోవడం సరికాదు.

    • తెలంగాణ ఉద్యమకారులను కేసీఆర్ ఏనాడూ పట్టించుకోలేదు.

    • వ్యక్తిగత అవసరాల కోసం తెలంగాణ అస్థిత్వాన్ని వాడుకోవడం తప్పు.

    • జాతిపిత అనే బిరుదు ప్రజలు ఇవ్వాలి.

  • Feb 06, 2026 16:13 IST

    అమరావతి: మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ కవాడి నాగేంద్ర అరెస్ట్

    • అరెస్ట్‌ సమయంలో పోలీసులపై దాడికి నాగేంద్ర యత్నం.

    • కాల్పులు జరిపి నాగేంద్రను అదుపులోకి తీసుకున్న పోలీసులు.

    • 2024లో జరిగిన అత్యాచారం కేసులో నాగేంద్ర నిందితుడు.

    • 40 కేసుల్లో నిందితుడిగా ఉన్న నాగేంద్ర.

    పూర్తికథనం

  • Feb 06, 2026 16:10 IST

    పాక్‌: ఇస్లామాబాద్‌లో భారీ పేలుడు

    • శుక్రవారం ప్రార్థనల తర్వాత పేలుడు, 25 మంది మృతి.

    • ఇస్లామాబాద్‌లో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం.

    • పలువురికి గాయాలు, కొనసాగుతున్న సహాయక చర్యలు.

    పూర్తికథనం

  • Feb 06, 2026 16:09 IST

    తూర్పుగోదావరి జిల్లా: కూర్మాపురంలో ఓ ఇంట్లోకి దూరిన పులి.

    • పొలాల నుంచి ఇంటిలోకి వచ్చిన పెద్దపులి.

    • అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు.

    • మత్తు ఇంజక్షన్‌తో రంగంలోకి పుణె రెస్క్యూ బృందం.

    • పులి భయంతో ఇళ్లపైకి ఎక్కిన గ్రామస్థులు.

    • పులిని బంధించేందుకు సర్వం సిద్ధం.

    పూర్తికథనం

  • Feb 06, 2026 14:51 IST

    అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్లో వైభవ్ సూర్యవంశీ సెంచరీ

    • ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఫైనల్‌ మ్యాచ్‌లో 55బంతుల్లోనే 100పరుగులు చేసిన వైభవ్.

    పూర్తికథనం

  • Feb 06, 2026 14:50 IST

    తెలంగాణలో పేదరిక నిర్మూలనకు సరికొత్త పథకం: మంత్రి సీతక్క

    • తెలంగాణలో కొత్త పథకానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలిపిన మంత్రి సీతక్క.

    • ఈ పథకం ద్వారా అత్యంత పేదరికంలో ఉన్నవారిని గుర్తించనున్న ప్రభుత్వం.

    • కేరళలో అమలు చేసిన ‘కుటుంబశ్రీ’ పథకాన్ని మోడల్‌గా తీసుకోనున్న తెలంగాణ సర్కార్.

    పూర్తికథనం

  • Feb 06, 2026 14:35 IST

    టీడీపీలోకి భారీగా చేరికలు..

    • పార్వతీపురం మన్యం జిల్లా: సీతానగరం మండలం బూర్జ గ్రామంలో 200 వైసీపీ కుటుంబాలు టీడీపీలో చేరిక.

    • వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు పసుపు కండువాలతో టీడీపీలోకి స్వాగతం పలికిన ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర.

  • Feb 06, 2026 13:21 IST

    మార్చి నాటికి విజయవాడ బైపాస్‌ నిర్మాణం పూర్తి: నితిన్‌ గడ్కరీ

    • ఢిల్లీ: మార్చి నాటికి విజయవాడ బైపాస్‌ నిర్మాణం పూర్తి: నితిన్‌ గడ్కరీ

    • చినఅవుటపల్లి-గొల్లపూడి మధ్య 30 కిలోమీటర్ల వరకు.. ఆరు లైన్లుగా విజయవాడ బైపాస్ నిర్మాణం..

    • ఇప్పటివరకు 29.57 కిలోమీటర్ల వరకు పూర్తి; కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ

  • Feb 06, 2026 13:06 IST

    పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ వాయిదా

    • సుప్రీం కోర్టులో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ వాయిదా..

    • స్పీకర్ విచారణ కొనసాగుతున్నట్టు కోర్టుకు తెలిపిన న్యాయవాది అభిషేక్ సింఘ్వీ..

    • మూడు వారాల సమయం కోరిన సింఘ్వీ..

    • స్పీకర్ పాజిటివ్‌గా నిర్ణయం తీసుకోవాలన్న సుప్రీం కోర్టు..

    • తదుపరి విచారణ 3 వారాలకు వాయిదా వేసిన సుప్రీం కోర్టు..

    • 3 వారాల్లో నిర్ణయం తీసుకోకపోతే.. కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకుంటామన్న సుప్రీం కోర్టు..

  • Feb 06, 2026 12:26 IST

    గడ్చిరోలిలో కాల్పుల కలకలం.. ముగ్గురు మావోల మృతి..

    • మహారాష్ట్ర - ఛత్తీస్‌గఢ్ సరిహద్దు గడ్చిరోలిలో పోలీసులు, మావోల మధ్య ఎదురు కాల్పులు..

    • హోరాహోరీ కాల్పుల్లో ముగ్గురు మావోల మృతి..

    • మావోల కాల్పుల్లో కమాండో దీపక్ ప్రాణాలు కోల్పోగా, మరో అధికారికి గాయాలు..

    పూర్తి కథనం..

  • Feb 06, 2026 11:43 IST

    విద్యార్థులకు ప్రధాని మోదీ సూచనలు..

    • ఢిల్లీ: పరీక్షాపే చర్చలో భాగంగా విద్యార్థులకు ప్రధాని మోదీ సూచనలు..

    • దేశంలోని విద్యార్థులతో మాట్లాడుతున్న ప్రధాని మోదీ..

    • ఒత్తిడిని అధిగమిస్తేనే సత్ఫలితాలు..

    • జీవితంలో ప్రతి విషయంలోనూ సమతుల్యత ఉండాలి..

    • నైపుణ్యాలను ఎప్పటికప్పుడు పెంచుకుంటూ ఉండాలి..

    • విద్య ద్వారానే జీవిత, వృత్తిపర నైపుణ్యాలు సాధ్యం: ప్రధాని మోదీ

  • Feb 06, 2026 11:39 IST

    టీటీడీ ఇన్‌చార్జ్‌ ఈవోగా రవిచంద్ర..

    • తిరుమల: టీటీడీ ఇన్‌చార్జ్‌ ఈవోగా బాధ్యతలు స్వీకరించిన రవిచంద్ర..

    • శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలిలో బాధ్యతల స్వీకరణ..

    • తిరుమలలో భక్తులకు సేవ చేసే భాగ్యం దక్కింది: రవిచంద్ర

    • ప్రభుత్వం, భక్తుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటా: రవిచంద్ర

    పూర్తి కథనం..

  • Feb 06, 2026 11:28 IST

    TVK చీఫ్‌ విజయ్‌ పిటిషన్‌‌ను కొట్టేసిన హైకోర్ట్‌

    • చెన్నై: TVK చీఫ్‌ విజయ్‌ పిటిషన్‌‌ను కొట్టేసిన హైకోర్ట్‌

    • రూ.1.50 కోట్ల ఆదాయపు పన్నుశాఖ పెనాల్టీని... వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించిన విజయ్‌..

  • Feb 06, 2026 10:55 IST

    రౌడీషీటర్ దాడి.. యువకుడికి తీవ్ర గాయాలు..

    • అన్నమయ్య: కురబలకోట మండలం తుమ్మచెట్లపల్లిలో దారుణం..

    • పాత కక్షలతో గురువారం రాత్రి సురేంద్ర అనే వ్యక్తిపై రాడ్లు, కర్రలతో దాడి..

    • దాడిలో సురేంద్రకు తీవ్రగాయాలు, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలింపు..

    • దాడికి పాల్పడిన రౌడీషీటర్ రమణను అదుపులోకి తీసుకున్న పోలీసులు..

  • Feb 06, 2026 10:26 IST

    గడ్కరీకి థ్యాంక్స్ చెప్పిన సీఎం చంద్రబాబు..

    • ఏపీలో ఎన్‌హెచ్ అభివృద్ధికి కేంద్రం నిధుల కేటాయింపుపై..

    • కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ధన్యవాదాలు తెలియజేసిన సీఎం చంద్రబాబు నాయుడు..

    పూర్తి కథనం..

  • Feb 06, 2026 10:04 IST

    ఆప్‌ నేత లక్కీ ఒబెరాయ్‌ హత్య

    • పంజాబ్‌లో ఆప్‌ నేత లక్కీ ఒబెరాయ్‌ హత్య..

    • బైక్‌పై వచ్చిన దుండగులు.. లక్కీ ఒబెరాయ్‌‌పై కాల్పులు..

    • మోడల్‌ టౌన్‌ గురుద్వారా దగ్గర కారు పార్కింగ్‌ చేస్తుండగా ఘటన..

    పూర్తి కథనం..

  • Feb 06, 2026 09:59 IST

    హుస్నాబాద్‌లో మంత్రి పొన్నం పర్యటన..

    • సిద్దిపేట: హుస్నాబాద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన..

    • హుస్నాబాద్‌లోని 10,11,20,17 వార్డుల్లో ఎన్నికల ప్రచారం..

    • ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులు వివరిస్తూ ఇంటింటి ప్రచారం..

  • Feb 06, 2026 09:48 IST

    మరోసారి పిన్నెల్లి బ్రదర్స్‌ విచారణకు కోర్టు అనుమతి

    • పల్నాడు: పిన్నెల్లి బ్రదర్స్‌‌ను మరోసారి విచారించేందుకు కోర్టు అనుమతి..

    • గుండ్లపాడు జంట హత్యల కేసులో నిందితులుగా ఉన్న పిన్నెల్లి బ్రదర్స్‌..

    • నెల్లూరు జిల్లా జైల్లో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వెంకటరామిరెడ్డి..

    • నెల్లూరు జైల్లోనే పిన్నెల్లి బ్రదర్స్‌ను ప్రశ్నించనున్న మాచర్ల పోలీసులు..

  • Feb 06, 2026 09:44 IST

    నటుడు చంద్రహాస్‌పై మరో కేసు నమోదు..

    • హైదరాబాద్‌: జూబ్లీహిల్స్ పీఎస్‌లో నటుడు చంద్రహాస్‌పై కేసు..

    • ఓ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదుతో చంద్రహాస్‌పై కేసు నమోదు..

    • మూవీ ఈవెంట్‌లో అసభ్యకరమైన పాట పాడారంటూ ఫిర్యాదు..

    • చంద్రహాస్‌పై BNS 296 సహా ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు..

    • ఇప్పటికే చంద్రహాస్‌పై మాదాపూర్ పీఎస్‌లో నమోదైన కేసు..

    పూర్తి కథనం..

  • Feb 06, 2026 09:16 IST

    మద్యం మత్తులో తండ్రినే కడతేర్చిన కసాయి కొడుకు..

    • మెదక్ జిల్లా: రేగోడ్ మండల కేంద్రంలో మద్యం మత్తులో కన్న తండ్రిని చంపిన కసాయి కొడుకు..

    • మహమ్మద్ అనే యువకుడు తాగిన మైకంలో కుటుంబ సభ్యులతో వాగ్వాదం..

    • తండ్రి షాకిర్‌ను తలపై బాదడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి..

    • కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు..

    పూర్తి కథనం..

  • Feb 06, 2026 09:12 IST

    కానిస్టేబుల్‌పై కత్తితో దాడి

    • సత్యసాయి జిల్లా: కానిస్టేబుల్‌పై మోస్ట్‌వాంటెడ్‌ క్రిమినల్ నాగేంద్ర కత్తితో దాడి..

    • ఓ కేసులో నాగేంద్రను అదుపులోకి తీసుకునేందుకు వెళ్లిన కానిస్టేబుల్‌..

    • చిలమత్తూరు మండలం ఎర్రకొండ అటవీ ప్రాతంలో ఘటన..

    • ఏపీలో అత్త, కోడలి గ్యాంగ్ రేప్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న నాగేంద్ర..

    • ఎరుకల నాగేంద్రపై రెండు రాష్ట్రాల పీఎస్‌లలో 90కి పైగా కేసులు నమోదు..

  • Feb 06, 2026 08:37 IST

    నేడు ఆర్బీఐ గవర్నర్ మీడియా సమావేశం..

    • ఈ రోజు మధ్యాహ్నం 12గంటలకు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా మీడియా సమావేశం..

    • రెపోరేటుపై స్పందించనున్న ఆర్బీఐ గవర్నర్..

  • Feb 06, 2026 07:50 IST

    నేడు పార్టీ కేంద్ర కార్యాలయానికి మంత్రి లోకేష్‌..

    • అమరావతి: నేడు పార్టీ కేంద్ర కార్యాలయానికి మంత్రి లోకేష్‌..

    • ఉ.10 గంటల నుంచి రాత్రి 7 వరకు కార్యాలయంలోనే లోకేష్‌..

    • పార్టీ సంస్థాగత వ్యవహారాలపై నేతలు, బ్యాక్‌ ఆఫీసు సిబ్బందితో చర్చలు..

  • Feb 06, 2026 07:22 IST

    విద్యార్థి సంఘాల నేతల కిడ్నాప్ కేసులో నిందితులకు రిమాండ్

    • తిరుపతి: కిడ్నాప్ కేసులో 8మంది నిందితులకు ఈ నెల 18 వరకు రిమాండ్..

    • మోహన్‌బాబు యూనివర్సిటీలో పనిచేసే ఆరుగురు సిబ్బంది, ఇద్దరు విద్యార్థులపై కిడ్నాప్ కేసు నమోదు..

    • కోర్టులో హాజరుపరిచిన తిరుచానూరు పోలీసులు..

    • న్యాయాధికారి ఆదేశాలతో నిందితులను తిరుపతి సబ్ జైలుకు తరలింపు..

  • Feb 06, 2026 07:19 IST

    నేడు నిజామాబాద్‌ జిల్లాలో సీఎం పర్యటన..

    • నిజామాబాద్ జిల్లాలో నేడు సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన..

    • మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న రేవంత్..

  • Feb 06, 2026 07:13 IST

    నేడు చిత్తూరు జిల్లాలో షర్మిల పర్యటన..

    • నేడు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏపీసీసీ చీఫ్‌ షర్మిల పర్యటన..

    • పలమనేరు, జీడీ నెల్లూరులో నరేగా యాత్రలో పాల్గొననున్న షర్మిల..

  • Feb 06, 2026 06:55 IST

    నేడు జోగి రమేష్ నివాసానికి జగన్‌..

    • జోగి రమేష్‌ను పరామర్శించనున్న వైఎస్ జగన్‌..

    • తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరనున్న జగన్‌..

  • Feb 06, 2026 06:20 IST

    రేపటి నుంచి మోదీ మలేషియా పర్యటన..

    • రేపటి నుంచి మలేషియాలో ప్రధాని మోదీ పర్యటన..

    • రెండు రోజుల పర్యటనలో భాగంగా మలేషియా ప్రధానితో భేటీ..

  • Feb 06, 2026 06:18 IST

    రేపటి నుంచి.. టీ20 వరల్డ్‌ కప్

    • రేపటి నుంచి టీ20 వరల్డ్‌ కప్ ప్రారంభం..

    • రేపు రాత్రి 7 గంటలకు భారత్‌ Vs అమెరికా మ్యాచ్‌..

  • Feb 06, 2026 06:17 IST

    సిక్కింలో భూ ప్రకంపనలు..

    • సిక్కిం: గ్యాల్షింగ్‌ ప్రాంతంలో భూ ప్రకంపనలు..

    • భూకంప తీవ్రత 4.5గా నమోదు..

  • Feb 06, 2026 06:15 IST

    నేడు సీఎం చంద్రబాబు జిల్లాల పర్యటన..

    • కర్నూలు: నేడు సీఎం చంద్రబాబు జిల్లాల పర్యటన..

    • ఎమ్మిగనూరు మండలం కలుగట్లలో రైతులకు పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం

    • సీఎం చంద్రబాబు పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు, భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు.

  • Feb 06, 2026 06:05 IST

    నేడు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ..

    • నేడు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారించనున్న సుప్రీం కోర్టు..

    • జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్‌ ధర్మాసనం విచారణ..

    • ఇప్పటికే స్పీకర్‌కు చాలా సమయం ఇచ్చామన్న సుప్రీం ధర్మాసనం..

    • స్పీకర్ తీసుకున్న నిర్ణయాల పూర్తి సమాచారం తెలపాలి: సుప్రీం