అండర్-19 ప్రపంచ కప్: ఫైనల్‌లో భారత్ 411 పరుగుల భారీ స్కోర్..
ABN , Publish Date - Feb 06 , 2026 | 05:06 PM
అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్ లో యువ భారత్ 411 పరుగుల భారీ స్కోర్ చేసింది. హరారే వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న తుదిపోరులో టీమిండియా యువ హిట్టర్ వైభవ్ సూర్యవంశీ(175) చెలరేగి ఆడాడు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయిన భారత్ 411 పరుగులు చేసింది.
స్పోర్ట్స్ డెస్క్: అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్ లో యువ భారత్ 411 పరుగుల భారీ స్కోర్ చేసింది. హరారే వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న తుదిపోరులో టీమిండియా యువ హిట్టర్ వైభవ్ సూర్యవంశీ(175) చెలరేగి ఆడాడు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయిన భారత్ 411 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లీష్ జట్టు ముందు 412 పరుగుల భారీ టార్గెట్ ఉంది.
మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. భారీ స్కోర్ చేయాలనే ఆలోచనతో బ్యాటింగ్ కు దిగిన యువ భారత్ కు ఆదిలోనే షాక్ తగిలింది. 20 పరుగుల వద్ద ఓపెనర్ అరోన్ జార్జి ఔటయ్యాడు. అతడు కేవలం 9 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో మరో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ కాసేపు ఆచితూచి ఆడాడు. కెప్టెన్ ఆయుష్ మాత్రేతో కలసి స్కోర్ బోర్డును స్పీడ్ పెంచాడు. ఈ క్రమంలోనే 33 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న వైభవ్.. ఆ తర్వాత 55 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇదే సమయంలో మాత్రే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరూ 142 పరుగులు భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
భారత్ స్కోర్ 162 పరుగుల వద్ద మాత్రే(53) పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చిన విహాన్ మలోత్రతో కలిసి వైభవ్ ఇంగ్లీష్ బౌలర్లపై దండయాత్ర చేశాడు. ఈ క్రమంలో 71 బంతుల్లోనే 150 పరుగులు చేశాడు. మొత్తంగా 80 బంతుల్లో 175 పరుగులు(15 ఫోర్లు, 15 సిక్సర్లు) చేసిన వైభవ్ ..మానీ లమ్స్‌డెన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఇక ఆతర్వాత వచ్చిన బ్యాటర్లు కూడా క్రీజులో ఉన్నంత సేపు దూకుడుగా ఆడటంతో భారత్ 411 పరుగుల భారీ స్కోర్ చేసింది. అభిజ్ఞాన్ కుందు(40), కాన్షిక్ చౌహాన్(37*), త్రివేది(32), విహాన్ మల్హోత్ర(30) రాణించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో జేమ్స్ మింటో మూడు వికెట్లు సాధించాడు. సెబాస్టియన్ మోర్గాన్, అలెక్స్ గ్రీన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. మానీ లమ్స్‌డెన్ ఒక వికెట్‌ను సాధించాడు.