కన్న తండ్రిని చంపిన కసాయి కొడుకు
ABN , Publish Date - Feb 06 , 2026 | 09:35 AM
మద్యం మత్తులో జరిగిన వాగ్వాదం చివరకు హత్యకు దారితీసింది. తాగిన మైకంలో కన్న తండ్రిని చంపాడు ఓ కసాయి కొడుకు. ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
మెదక్ జిల్లా: రేగోడ్ మండల కేంద్రంలో విషాద ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో కన్న తండ్రినే కొడుకు హత్య చేసిన సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
పోలీసుల వివరాల ప్రకారం.. మహమ్మద్ అనే యువకుడు మద్యం సేవించి ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులతో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో అతడికి, తండ్రి షాకీర్‌తో తీవ్ర వాగ్వాదం జరిగింది. కోపోద్రిక్తుడైన మహమ్మద్.. షాకీర్ తలపై బలంగా కొట్టడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. తీవ్రంగా గాయపడిన షాకీర్ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు మహమ్మద్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మద్యం మత్తే ఈ హత్యకు కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడిస్తామన్నారు. ఈ ఘటనతో రేగోడ్ మండల కేంద్రంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Also Read:
తగ్గిన టమాటా.. పెరిగిన పచ్చిమిర్చి
హైదరాబాద్‌లో నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలివే..
For More Latest News