హైదరాబాద్‌లో నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలివే..
ABN , Publish Date - Feb 06 , 2026 | 06:52 AM
హైదరాబాద్‌లోని ఆయా ఏరియాల్లో శుక్రవారం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు ట్రాన్స్ కో అధికారులు తెలిపారు. విద్యుత్ లైన్ల మరమ్మతులు, ఆతర పనుల కారణంగా విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు తెలిపారు.
చిక్కడపల్లి(హైదరాబాద్): ఆజామాబాద్ డివిజన్, హైదరాబాద్ సిటీ-2 పరిధిలో శుక్రవారం విద్యుత్ సరఫరా ఉండదని సీబీడీఏడీఈలు జి. నాగేశ్వరరావు, డి. వినోద్‌కుమార్ తెలిపారు. సీఈ కాలనీ, ఏటీఐ క్యాంపస్ రోడ్, కూచిపూడి, ఆర్‌కె మఠ్ 11కేవీ విద్యుత్ ఫీడర్ల పరిధిలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, బతుకమ్మకుంట, బాగ్‌అంబర్‌పేట(Bathukammakunta, Bagh Amberpet), తిలక్‌నగర్‌రోడ్, వివేక్‌నగర్, గాంధీనగర్ పరిధిలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని త్వరగా పనులు పూర్తైతే నిర్ణీత సమయం కంటే ముందే విద్యుత్ సరఫరా పునరుద్ధరించబడుతుందని వినియోగదారులు సహకరించాలని కోరారు.
పంజాగుట్ట: బంజారాహిల్స్ ఏడీఈ(Banjara Hills ADE) పరిధిలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ జి.గోపీ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు 11కేవీ అమర్ సొసైటీ, టీవీ-5 ఫీడర్ల పరిధిలోని పలు ప్రాంతాలు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 11కేవీ దివ్య డైమండ్, జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్.22, ఓబుల్‌రెడ్డి స్కూల్ ఫీడర్ల పరిధిలోని ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందని ఏడీఈ పేర్కొన్నారు.
చిక్కడపల్లి: ఆజామాబాద్ డివిజన్(Azamabad Division), హైదరాబాద్ సిటీ-2 పరిధిలో శుక్రవారం విద్యుత్ సరఫరా ఉండదని సీబీడీఏడీఈలు జి. నాగేశ్వరరావు, డి. వినోద్‌కుమార్ తెలిపారు. సీఈ కాలనీ, ఏటీఐ క్యాంపస్ రోడ్, కూచిపూడి, ఆర్‌కె మఠ్ 11కేవీ విద్యుత్ ఫీడర్ల పరిధిలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, బతుకమ్మకుంట, బాగ్‌అంబర్‌పేట, తిలక్‌నగర్‌రోడ్, వివేక్‌నగర్, గాంధీనగర్ పరిధిలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని త్వరగా పనులు పూర్తైతే నిర్ణీత సమయం కంటే ముందే విద్యుత్ సరఫరా పునరుద్ధరించబడుతుందని వినియోగదారులు సహకరించాలని కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి.
సినిమాలు తక్కువ.. గాసిప్స్ ఎక్కువ
భాస్కరా అవార్డులాగా కేసీఆర్‌కు జాతిపితనా..!
Read Latest Telangana News and National News