-
-
Home » Mukhyaamshalu » ABN Andhrajyothy ap telangana national international viral and trending telugu live updates of 9th february 2026 kjr
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Feb 09 , 2026 | 06:05 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి..
Live News & Updates
-
Feb 09, 2026 21:51 IST
రూ. 5 కోట్ల విలువైన గంజాయి ధ్వంసం..
ఖమ్మం జిల్లాలో ఐదు కోట్ల రూపాయల విలువైన గంజాయిని తగలబెట్టిన ఎక్సైజ్ శాఖ పోలీసులు.
తల్లాడ మండలం గోపాలపేట గ్రామ సమీపంలో తగలబెట్టిన అధికారులు.
ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి ఆదేశాల మేరకు ధ్వంసం.
సుమారు 953 కేజీల గంజాయి బ్యాగులకి నిప్పుపెట్టిన అధికారులు.
-
Feb 09, 2026 21:48 IST
పాకిస్థాన్‌కు షాక్ ఇచ్చిన ఐసీసీ
టీ20 ప్రపంచ కప్‌లో భారత్‌తో ఆడేందుకు పాక్ చేసిన 5 డిమాండ్లను తిరస్కరించిన ఐసీసీ.
-
Feb 09, 2026 21:43 IST
టాటా AIA నుంచి రెండు కొత్త పెట్టుబడి అవకాశాలు
వాల్యూ-బేస్డ్ ఈక్విటీ ఫండ్స్ అనౌన్స్ చేసిన టాటా AIA లైఫ్ ఇన్సూరెన్స్.
టాటా AIA లైఫ్ ఎన్‌హాన్స్‌డ్ వాల్యూ ఇండెక్స్ ఫండ్.
టాటా AIA ఎన్‌హాన్స్‌డ్ వాల్యూ ఇండెక్స్ పెన్షన్ ఫండ్.
-
Feb 09, 2026 21:37 IST
2026 కాంట్రాక్ట్ లిస్ట్ ప్రకటించిన BCCI
ఏ ప్లస్ నుంచి బీ గ్రేడ్‌లోకి రోహిత్ శర్మ, కోహ్లీ.
గ్రేడ్-Aలో శుభ్‌మన్‌గిల్, బుమ్రా, రవీంద్ర జడేజా.
గ్రేడ్-Bలో రోహిత్, కోహ్లీ, రాహుల్, సిరాజ్, పాండ్యా, సుందర్.
గ్రేడ్-Bలో పంత్, కుల్దీప్, జైశ్వాల్, సూర్యకుమార్, శ్రేయస్.
-
Feb 09, 2026 21:36 IST
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో శేరిలింగంపల్లి జోన్‌లో నిషేధాజ్ఞలు: డీసీపీ సీహెచ్. శ్రీనివాస్
శాంతిభద్రతల పరిరక్షణ కోసమే నిషేధాజ్ఞలు.
BNSS సెక్షన్ 163 ప్రకారం ఐదుగురికి మించి గుమికూడరాదని ఆదేశాలు.
పోలింగ్ కేంద్రాల చుట్టూ 200 మీటర్ల పరిధిలో నిషేధాజ్ఞలు అమలు.
ఫిబ్రవరి 11 ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు నిషేధాజ్ఞలు.
ఐడీఏ బొల్లారం, పటాన్ చేరు పోలీస్ స్టేషన్ పరిధిలో నిషేధాజ్ఞలు.
పోలింగ్ కేంద్రాల సమీపంలో ప్రజా సమావేశాలు, గుమికూడడాలు పూర్తిగా నిషేధం.
నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు డీసీపీ.
-
Feb 09, 2026 21:17 IST
ఆదిలాబాద్: చెన్నూర్‌లో బీఆర్ఎస్ నేతల ఇళ్లలో తనిఖీలు
పోలీసుల సోదాలపై మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ ఆగ్రహం.
అధికారులు వివేక్‌కు తొత్తులుగా మారారు: సుమన్
బీఆర్ఎస్ నేతలనే టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారు: సుమన్
కాంగ్రెస్ నేతల ఇళ్లలో సోదాలు చేయడం లేదు: సుమన్
-
Feb 09, 2026 21:14 IST
భారత్‌తో టీ20 ఆడేందుకు పాక్ అంగీకారం
కాసేపట్లో అధికారికంగా ప్రకటించనున్న పీసీబీ.
-
Feb 09, 2026 21:12 IST
ఏపీలో నియోజకవర్గాల ప్రగతిపై నివేదిక విడుదల
మొత్తం 175 ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో A+ గ్రేడ్‌లో 21 నియోజకవర్గాలు.
A గ్రేడ్‌లో 153 నియోజకవర్గాలు, B గ్రేడ్‌లో ఒక నియోజకవర్గం.
90 శాతానికిపైగా మార్కులతో A+ గ్రేడ్ దక్కించుకున్న 13 నియోజకవర్గాలు.
93 శాతం మార్కులతో రాష్ట్రంలోనే నెంబర్ వన్ నియోజకవర్గంగా ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడ పశ్చిమ నియోజక వర్గం.
92 మార్కులతో రెండో ర్యాంకులో విశాఖలోని గాజువాక.
కాకినాడ నగర నియోజకవర్గానికి మూడో ర్యాంక్.
విజయవాడ తూర్పు నియోజకవర్గానికి నాలుగో ర్యాంక్.
-
Feb 09, 2026 21:11 IST
అమరావతి: ఏపీలో నియోజకవర్గాల ప్రగతిపై నివేదిక విడుదల
నెంబర్ వన్ ప్లేస్‌లో విజయవాడ వెస్ట్.
రెండో స్ధానంలో ఉన్న విశాఖలోని గాజువాక.
మూడో స్ధానంలో కాకినాడ, నాలుగో స్ధానంలో విజయవాడ ఈస్ట్.
ఐదోస్థానంలో బాలకృష్ణ నియోజకవర్గం హిందూపురం.
పదోస్ధానంలో నిలిచిన పవన్‌కల్యాణ్ నియోజకవర్గం పిఠాపురం.
వివిధ అంశాల్లో 175 నియోజకవర్గాలకు ర్యాంకులు.
వివిధ ఇండికేటర్లను దృష్టిలో పెట్టుకొని ర్యాంకుల ప్రకటన.
-
Feb 09, 2026 21:04 IST
బాపట్ల: చీరాలకు చేరుకున్న కోస్టల్ సైక్లోథాన్–2026 సీఐఎస్ఎఫ్ బృందం సైకిల్ యాత్ర.
ఘన స్వాగతం పలికిన చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య యాదవ్.
కలకత్తా నుంచి కొచ్చిన్ వరకు సైకిల్ యాత్ర చేపట్టిన 150 మంది సీఐఎస్ఎఫ్ పోలీసులు.
మత్స్యకారులకు విపత్తులపై అవగాహన లక్ష్యంగా యాత్ర నిర్వహణ.
కొద్ది దూరం సైకిల్ తొక్కి సైకిలిస్టులను ఉత్సాహపరిచిన ఎమ్మెల్యే కొండయ్య.
-
Feb 09, 2026 20:53 IST
సీఎం రేవంత్ వ్యాఖ్యలకు కేంద్రమంత్రి బండి సంజయ్ కౌంటర్
ఫలితాలకు ముందే సీఎం రేవంత్ ఓటమిని ఒప్పుకున్నారు.
ఓటమి భయంతోనే బీజేపీపై అవాకులు పేలుతున్నారు.
ఎంఐఎంతో డీల్ కుదిరిందా? లేదా? సమాధానం చెప్పాలి.
సీఎం, ఒవైసీ స్క్రిప్ట్ ఒకటే.. దారుస్సలాం, గాంధీభవన్‌లో ప్రిపేర్ అవుతోంది.
సీఎం చేతగానితనాన్ని ఇతరులపై నెట్టడం ఆయనకు అలవాటైంది.
కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ము లేదని లేఖ రాయమనండి.
వాళ్ల సంగతి మేం చూసుకుంటాం.
-
Feb 09, 2026 20:33 IST
విద్యుత్ ఛార్జీల భారం పడనివ్వం.. ప్రజలకే ట్రూ డౌన్ ఫలితాలు: సీఎం చంద్రబాబు
ఆర్టీసీలో 1,000 ఈవీ బస్సుల కొనుగోలు: సీఎం చంద్రబాబు
కీలక శాఖల్లో నిబంధనలు సరళతరంపై దృష్టి పెట్టండి: సీఎం చంద్రబాబు
పన్నుల వసూళ్లు తగ్గకూడదు.. వ్యాపారులను వేధించకూడదు: సీఎం చంద్రబాబు
కేంద్రం నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవాలి: సీఎం చంద్రబాబు
-
Feb 09, 2026 20:30 IST
తిరుమల: సీఎం చంద్రబాబుకు శ్రీవారి ఆలయ పెద్ద జీయర్ లేఖ
లడ్డూ తయారీలో రసాయనాల వినియోగం అపచారం: పెద్ద జీయర్
భక్తుల మనోభావాలను దెబ్బతీశారు: పెద్ద జీయర్
భవిష్యత్తులో మళ్లీ జరగకుండా సీఎం చంద్రబాబు చర్యలు తీసుకోవాలి: పెద్ద జీయర్
ధర్మాన్ని పరిరక్షించడంతో పాటు ఆలయాల పవిత్రతను కాపాడే శక్తిని ఆ దేవుడు సీఎం చంద్రబాబుకు ప్రసాధించాలి: పెద్ద జీయర్
-
Feb 09, 2026 20:29 IST
టీ20 వరల్డ్ కప్: ఒమన్‌పై జింబాబ్వే విజయం
ఒమన్‌పై 8 వికెట్ల తేడాతో జింబాబ్వే గెలుపు
స్కోర్లు: ఒమన్ 103 ఆలౌట్, జింబాబ్వే 106/2(13.3)
-
Feb 09, 2026 20:22 IST
హైదరాబాద్: సీఎస్ రామకృష్ణారావు ఉన్నతస్థాయి సమీక్ష
కేంద్ర వ్యవసాయశాఖ సలహాదారు రాజీవ్ చావ్లా అధ్యక్షతన భేటీ.
డిజిటల్ క్రాప్ సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలని సీఎస్ ఆదేశం.
జిల్లా కలెక్టర్లు, ఎన్‌ఐసి అధికారుల సమన్వయంతో మార్చి 15లోగా డిజిటల్ క్రాప్ సర్వే (DCS) పూర్తి చేయాలి.
-
Feb 09, 2026 19:43 IST
కడప: జమ్మలమడుగు పట్టణ శివారుల్లో టూరిస్ట్ బస్సు బోల్తా
10 మందికి స్వల్ప గాయాలు.
టూరిస్టులు రైల్వే కోడూరు గ్రామానికి చెందిన వారిగా గుర్తింపు.
బస్సు స్టీరింగ్ తిరగకపోవడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం.
గాయపడిన వారిని జమ్మల మడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.
కన్నెతీర్థం నుండి ఆలూరు రంగనాథ స్వామిని దర్శించుకోవడానికి వెళుతుండగా ప్రమాదం.
-
Feb 09, 2026 19:20 IST
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరుకావాలని వైసీపీ నిర్ణయం
తొలిరోజు గవర్నర్ ప్రసంగానికి హాజరుకావాలని వైసీపీ నిర్ణయం.
-
Feb 09, 2026 19:17 IST
హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లో చోరీకి పాల్పడ్డ నేపాలి గ్యాంగ్ అరెస్ట్
నేపాల్ బోర్డర్‌లో అదుపులోకి తీసుకున్న పోలీసులు.
రవీంద్ర శర్మ ఇంట్లో పనిమనిషిగా చేరి రూ. 20లక్షలు, డైమండ్ రింగ్, బంగారం ఎత్తుకెళ్లిన నేపాలి గ్యాంగ్.
-
Feb 09, 2026 19:16 IST
సీఎం రేవంత్‌రెడ్డి చిట్‌చాట్‌లో కీలక అంశాలు
ఈసారి దేశంలో జమిలీ ఎన్నికలే: సీఎం రేవంత్
తెలంగాణకూ 2029లోనే ఎన్నికలు: సీఎం రేవంత్
జిల్లాల పునర్విభజన చేయాలనే ఆలోచన లేదు: సీఎం రేవంత్
ముందుగా కేంద్రం నుంచి జనగణన: సీఎం రేవంత్
ఆ తర్వాత నియోజకవర్గాల డీలిమిటేషన్: సీఎం రేవంత్
జనాభా ప్రాతిపదికన జరిగితే దక్షిణాదికి నష్టం: సీఎం రేవంత్
కొత్త పార్లమెంట్ కట్టేటప్పుడే 800పైగా సీట్లు ఏర్పాటు చేశారు: సీఎం రేవంత్
-
Feb 09, 2026 19:10 IST
నల్లగొండ: చింతపల్లి మండలం ఉమ్మంతలపల్లిలో దారుణం
కుటుంబ కలహాలతో ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేల్చుకుని శిరీష అనే వివాహిత ఆత్మహత్యాయత్నం.
అదే సమయంలో ఇంట్లోనే ఉన్న ఆమె ఇద్దరు పిల్లలు.
తల్లి పరిస్థితి విషమం, పిల్లలకు గాయాలు.
చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలింపు.
-
Feb 09, 2026 19:08 IST
గుంటూరు: అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరు
అంబటికి బెయిల్ మంజూరు చేసిన స్పెషల్ మొబైల్ కోర్టు.
సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో అంబటికి బెయిల్.
ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న అంబటి రాంబాబు.
పీటీ వారెంట్ కేసులో రిమాండ్‌లోనే ఉండనున్న అంబటి.
-
Feb 09, 2026 19:07 IST
హైదరాబాద్: చిలుకూరులోని రిసార్ట్‌లో విషాదం
స్విమ్మింగ్ పూల్‌లో ఈతకు దిగి 15 ఏళ్ల బాలుడు మృతి.
సరదాగా ఆడుకుంటూ నీట మునిగిన బాలుడు.
-
Feb 09, 2026 19:06 IST
'సర్' ప్రక్రియలో అడ్డంకులు కల్పించవద్దు: సుప్రీంకోర్టు
ఏదైనా ఆదేశాలు, స్పష్టత అవసరమైతే కల్పించుకుంటా: సుప్రీంకోర్టు
దీన్ని అన్ని రాష్ట్రాలు అర్ధం చేసుకోవాలి: సుప్రీంకోర్టు
బెంగాల్ ప్రభుత్వం పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసిన సుప్రీం ధర్మాసనం.
-
Feb 09, 2026 19:00 IST
కరీంనగర్: ఎంఐఎం నేత అక్బరుద్దీన్ హాట్ కామెంట్స్
ముఖ్యమంత్రుల దగ్గరికి మేం వెళ్లం.
ముఖ్యమంత్రిలే మా దగ్గరికి వస్తారు.
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మా మద్దతు లేనిదే కాంగ్రెస్ గెలిచిందా..?
రెడ్డి అయినా రావు అయినా మా దగ్గరికి రావాల్సిందే.
ఎంఐఎం బ్రదర్స్ సత్తా ఏంటో చూపిస్తాం.
మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థులు సత్తా చాటుతారు.
-
Feb 09, 2026 17:00 IST
తెలంగాణలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం
తెలంగాణ వ్యాప్తంగా మూగబోయిన మైకులు.
ఎల్లుండి 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో పోలింగ్.
బ్యాలెట్ పేపర్ల ద్వారానే ఓటింగ్ నిర్వహణ.
ఈనెల 13న మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్.
-
Feb 09, 2026 16:46 IST
టీ20 ప్రపంచ కప్ 2026: తడబడిన ఒమన్.. జింబాబ్వే టార్గెట్ 104
కొలంబో వేదికగా తలపడుతున్న ఒమన్-జింబాబ్వే జట్లు.
19.5 ఓవర్లలో 103 పరుగులకే ఆలౌటైన ఒమన్.
వినాయక్ శుక్లా(28) టాప్ స్కోరర్.
రిచర్డ్, ముజారబని, బ్రాడ్ ఎవన్స్‌లకు తలో 3 వికెట్లు.
ఒక వికెట్ పడగొట్టిన జింబాబ్వే కెప్టెన్ సికందర్.
జింబాబ్వే విజయ లక్ష్యం 104 పరుగులు.
-
Feb 09, 2026 16:22 IST
సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన కెప్టెన్: గౌతమ్ గంభీర్
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌పై హెడ్ కోచ్ గంభీర్ ప్రశంసలు.
పొట్టి ఫార్మాట్‌లో కోచ్‌గా సూర్య నా పనిని సులభతరం చేస్తున్నాడు.
-
Feb 09, 2026 16:21 IST
డిజిటల్ ఆర్థిక మోసాలపై సుప్రీంకోర్టులో విచారణ
డిజిటల్ మోసాలతో రూ.54 వేల కోట్లు కొల్లగొట్టారన్న సుప్రీంకోర్టు.
ఇది భారీ దోపిడీ అంటూ సుప్రీంకోర్టు ఆందోళన.
డిజిటల్ మోసాలపై RBI, బ్యాంకులు తక్షణ చర్యలు తీసుకోవాలి.
బ్యాంకు అధికారుల నిర్లక్ష్యంతోనే డిజిటల్ మోసాలు.
-
Feb 09, 2026 16:21 IST
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ: సీఎం రేవంత్
భవిష్యత్తును ఆలోచించి ఎన్నికల్లో ఓటు వేయాలి.
12 ఏళ్లుగా కేంద్రంలో ఉన్న బీజేపీ.. రాష్ట్రానికి ఏమైనా ప్రాజెక్టులు ఇచ్చిందా?
తెలంగాణకు బీజేపీ ఏం చేసిందో చెప్పాలి?
పాలమూరు-రంగారెడ్డిని జాతీయ ప్రాజెక్టుగా చేస్తామని మోదీ చెప్పారు.
హామీల అమలు గురించి మాత్రం బీజేపీ చెప్పట్లేదు.
మోదీని చూసి ఓటేయాలని బీజేపీ నేతలు అడుగుతున్నారు.
-
Feb 09, 2026 16:18 IST
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి నేటితో తెర.
సాయంత్రం 5:00 గంటలకు ముగియనున్న ఎన్నికల ప్రచారం.
ఎన్నికల ప్రచారం ముగియనుండటంతో.. నేడు నేతల సుడిగాలి ప్రచారం.
-
Feb 09, 2026 15:58 IST
సూర్యాపేట: కోదాడలో పలు చోట్ల ఈడీ సోదాలు
నీలా సత్యనారాయణ బంధువుల ఇళ్లలో ఈడీ తనిఖీలు.
ఆదాయానికి మించిన ఆస్తులున్నాయనే అభియోగంతో సోదాలు.
రైస్‌మిల్స్, ఇతర వ్యాపారాల్లో పన్ను ఎగవేత ఆరోపణలు.
-
Feb 09, 2026 15:56 IST
విశాఖ: ఎన్‌డీడీబీ రిపోర్ట్ బయటపెట్టాలి: ఏపీ సాధుపరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద
కల్తీ లడ్డూ వ్యవహారంపై సిట్ నివేదికలు ఉన్నాయి.
లడ్డూల్లో రసాయనాలు కలిశాయని తెలిసిన తర్వాత కూడా బాధ్యులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?
వైసీపీ హయాంలోనే ఈ వ్యవహారం అంతా జరిగింది.
టీటీడీ గత ఛైర్మన్లకు తెలియకుండానే ఈ వ్యవహారం జరిగిందా?
-
Feb 09, 2026 15:54 IST
మెదక్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఎన్నికల ప్రచారం..
ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ జైలుకు వెళ్లడం ఖాయం: హరీశ్
అందుకే ఫోరెన్సిక్ ల్యాబ్‌ను దహనం చేశారు: హరీశ్
సీఎం రేవంత్ డైరెక్షన్‌లోనే ఈ ప్రమాదం జరిగింది: హరీశ్
మిర్యాలగూడ, భూపాలపల్లి, నిజామాబాద్ వెళ్లిన సీఎం రేవంత్.. మెదక్‌కు ఎందుకు రాలేదు: హరీశ్
-
Feb 09, 2026 15:52 IST
నెల్లూరు: ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన కానిస్టేబుల్ జ్యోతిపై సస్పెన్షన్ వేటు
ఉత్తర్వులు జారీ చేసిన ఎస్పీ అజితా వెజెండ్ల.
పోలీసు శాఖ నిబంధనలకు విరుద్ధంగా ప్రెస్‌మీట్, నిరసన చేపట్టారని చర్యలు.
సీతారామపురం పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న జ్యోతి.
-
Feb 09, 2026 15:48 IST
హిమంతపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం: ఎంపీ గౌరవ్ గొగోయ్
నా భార్య, మైనర్ పిల్లలను లక్ష్యంగా చేసుకుంటున్నారు.
వృత్తి పరంగా నా భార్య గతంలో పాకిస్థాన్ వెళ్లింది.
నేను కూడా ఆమెతో 10 రోజులు ఉన్నాను.
సిట్ నివేదకను తొక్కిపెట్టారు.
పొలిటికల్ డ్రామా ఆడుతున్న సీఎం.
-
Feb 09, 2026 15:46 IST
సింగరేణి సంస్థ అప్పుల ఊబిలో విలవిల్లాడుతోంది: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
సింగరేణిని రక్షించేది బీజేపీ మాత్రమే.
మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటేయాలి.
రామగుండం అభివృద్ధి కోసం BRS చేసిందేమీ లేదు.
రామగుండంలో బీజేపీని గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తాం.
-
Feb 09, 2026 15:40 IST
NCP(SP) చీఫ్ శరద్ పవార్‌కు తీవ్ర అస్వస్థత
పుణెలోని రూబీ ఆస్పత్రిలో శరద్ పవార్‌కు చికిత్స.
-
Feb 09, 2026 15:35 IST
పంజాబ్‌లో దారుణం
ఓ యువకుడు క్లాస్ రూములో యువతిపై తుపాకితో కాల్పులకు తెగబడ్డాడు.
యువతిని కాల్చి చంపి, తను కూడా అదే తుపాకితో కాల్చుకున్నాడు.
-
Feb 09, 2026 15:32 IST
మహబూబ్‌నగర్: మున్సిపాలిటీలకు సంబంధించి బీజేపీ మేనిఫెస్టో వివరించిన డీకే అరుణ
అవినీతిరహిత పారదర్శక పాలన అందించడమే బీజేపీ లక్ష్యం: డీకే అరుణ
పట్టణాల్లో స్లమ్ ఏరియాలపై ప్రత్యేక దృష్టి పెట్టి డెవలప్ చేస్తాం: డీకే అరుణ
-
Feb 09, 2026 15:30 IST
పఠాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను గెలిపించాలంటూ ఎమ్మెల్యే పిలుపు.
కార్మిక సంఘం నేతలతో నిర్వహించిన సమావేశంలో వ్యాఖ్యానించిన చేసిన ఎమ్మెల్యే.
కొంతకాలంగా కాంగ్రెస్‌కు దూరంగా ఉంటున్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి.
-
Feb 09, 2026 15:26 IST
స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానానికి విపక్షాలు సన్నద్ధం
సభలో మాట్లాడేందుకు స్పీకర్ అనుమతించడం లేదని అసంతృప్తి.
ఖర్గే నివాసంలో విపక్ష ఎంపీల సమావేశం.
రెండో విడత సమావేశాల్లో అవిశ్వాసంపై చర్చకు అవకాశం.
-
Feb 09, 2026 15:23 IST
ఢిల్లీ: కుల్‌దీప్ సింగ్ సెంగార్‌కు సుప్రీంకోర్టులో దక్కని ఊరట
ఉన్నావ్ అత్యాచార కేసులో నిందితుడు బీజేపీ మాజీ ఎమ్మెల్యే సెంగార్.
కుల్‌దీప్ సింగ్ సెంగార్‌కు బెయిల్ ఇవ్వడానికి సుప్రీం ధర్మాసనం నిరాకరణ.
ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోవడానికి సుప్రీం నిరాకరణ.
-
Feb 09, 2026 15:21 IST
విజయవాడ: ముగిసిన దుర్గగుడి పాలకమండలి సమావేశం
ఇంద్రకీలాద్రిపై దాహార్తిని తీర్చేందుకు రూ. కోటి 20 లక్షలతో వాటర్ ప్లాంట్: దుర్గగుడి ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ
శివరాత్రికి ప్రత్యేక ఏర్పాట్లు.
తిరుపతి తరహాలో లడ్డూ తయారీకి మిషన్లు.
ప్రజా ప్రతినిధులతో సమావేశం తర్వాత పార్కింగ్ సమస్యపై పరిష్కారం.
నకిలీ టిక్కెట్లపై విచారణ చేస్తున్నాం.
-
Feb 09, 2026 15:19 IST
నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు నాయుడు
రేపు (మంగళవారం) ఐదుగురు కేంద్రమంత్రులతో సీఎం సమావేశం
ఏపీకి సంబంధించి పలు ప్రాజెక్టులు, వివిధ పథకాలకు నిధుల కేటాయింపుపై కేంద్ర మంత్రులతో సీఎం చర్చ
కేంద్ర మంత్రులతో భేటీ అనంతరం సాయంత్రం 5 గంటలకు అమరావతికి సీఎం తిరుగు పయనం
-
Feb 09, 2026 15:18 IST
సంగారెడ్డి: జహీరాబాద్‌లో బీజేపీ నాయకురాలు నవనీత్ కౌర్ రోడ్ షో
బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం
పస్తాపూర్ కమాన్ నుంచి శివాజీ చౌక్ వరకు రోడ్ షో
-
Feb 09, 2026 15:16 IST
ఎన్టీఆర్ జిల్లాలో వివాహితపై అత్యాచారయత్నం..
విషయం బయటకు వస్తే భర్తను, పిల్లలను చంపుతానంటూ బెదిరింపులు
ఘటనపై తిరువూరు పోలీస్ స్టేషన్‌లో బాధితురాలి ఫిర్యాదు
ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితురాలి ఆవేదన
నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని భర్త డిమాండ్
-
Feb 09, 2026 15:16 IST
వీలైనంత త్వరగా వైభవ్‌ను సీనియర్ జట్టులోకి తీసుకోవాలి: ఎంపీ శశిథరూర్
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ప్రశంసలు
ఇలాంటి క్రికెటర్ తరానికి ఒక్కరు మాత్రమే ఉంటారు: శశిథరూర్
సచిన్ కూడా 14 ఏళ్ల వయసులోనే క్రికెట్ అరంగేట్రం చేసి చరిత్ర సృష్టించాడు: శశిథరూర్
-
Feb 09, 2026 14:59 IST
టీ20 ప్రపంచ కప్ 2026: ఒమన్‌తో మ్యాచ్.. టాస్ గెలిచిన జింబాబ్వే
కొలంబో వేదికగా తలపడనున్న ఒమన్-జింబాబ్వే
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న జింబాబ్వే
తొలుత బ్యాటింగ్ చేయనున్న ఒమన్
-
Feb 09, 2026 14:55 IST
ఆనందంలో హార్ట్ స్ట్రోక్.. యువకుడి మృతి..
ఏలూరు జిల్లా నూజివీడు మండలం రావిచర్ల గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.
కోడి పందెంలో విజయం సాధించిన ఆనందంలో యువకుడికి గుండెపోటు
ఛాతిలో నొప్పి రావడంతో పందెం బరిలోనే కుప్పకూలిన యువకుడు కిరణ్
హుటాహుటిన నూజివీడు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమద్యంలోనే మృతి
-
Feb 09, 2026 13:41 IST
మధిరలో డిప్యూటీ సీఎం ఎన్నికల ప్రచారం..
ఖమ్మం: మధిరలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రచారం..
మధిరలో గత పదేళ్లలో ఆశించిన అభివృద్ధి జరగలేదు..
మధిరకు కావాల్సింది రాజకీయాలు కాదు.. అభివృద్ధి..
మధిర రూపురేఖలు మార్చే బాధ్యత నాది: డిప్యూటీ సీఎం
-
Feb 09, 2026 13:08 IST
సుప్రీంకోర్టులో రాజ్ కసిరెడ్డికి దక్కని ఊరట
ఢిల్లీ: సుప్రీంకోర్టులో రాజ్ కసిరెడ్డికి దక్కని ఊరట..
రాజ్ కసిరెడ్డికి బెయిల్ నిరాకరించిన సుప్రీంకోర్టు..
ఏపీ లిక్కర్ కేసులో కసిరెడ్డికి రెగ్యులర్ బెయిల్ నిరాకరణ..
స్కామ్‌లో కసిరెడ్డి ఎన్ని కోట్లు అక్రమంగా ఆర్జించారంటూ... సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ సూటి ప్రశ్న
-
Feb 09, 2026 12:39 IST
టీ20 ప్రపంచ కప్ 2026: చెలరేగిన జార్జ్ మున్సే.. ఇటలీ టార్గెట్ 208
ఈడెన్ గార్డెన్స్ వేదికగా తలపడుతోన్న స్కాట్లాండ్-ఇటలీ..
నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసిన స్కాట్లాండ్..
హాఫ్ సెంచరీతో చెలరేగిన జార్జ్ మున్సే(84)..
రాణించిన మెకెల్లమ్(41; 18 బంతుల్లో 4 సెక్సులు)..
అలీ హసన్, స్టీవర్ట్, థామస్, స్మట్స్‌లకు తలొక వికెట్..
ఇటలీ విజయ లక్ష్యం 208..
-
Feb 09, 2026 12:36 IST
శ్రీశైలంలో శివస్వాముల ఆందోళన
నంద్యాల: శ్రీశైలంలో శివస్వాముల ఆందోళన..
సర్వదర్శనానికి ఆలస్యమవుతోందని నిరసన..
కృష్ణదేవరాయ క్యూలైన్లు విరగ్గొట్టి ఆలయంలోకి చొచ్చుకెళ్లిన భక్తులు..
కృష్ణదేవరాయ గోపురం నుంచి వందలాదిగా దూసుకొస్తున్న భక్తులు..
-
Feb 09, 2026 12:26 IST
కేటీఆర్ భూపాలపల్లి పర్యటనలో ఉద్రిక్తత
జయశంకర్ భూపాలపల్లి జిల్లా: కేటీఆర్ భూపాలపల్లి పర్యటనలో ఉద్రిక్తత..
సామాజిక కార్యకర్త, దివంగత రాజలింగమూర్తి ఫ్లెక్సీ తొలగింపుపై ఆగ్రహం..
బీఆర్ఎస్ నేతలే తొలగించారంటూ రాజలింగమూర్తి బంధువుల ఆరోపణ..
రోడ్డుపై బైఠాయించి నిరసన..
-
Feb 09, 2026 12:24 IST
తిరుమల లడ్డూ వ్యవహారంపై శ్రీనివాసానంద సరస్వతి ఆగ్రహం
విశాఖ: తిరుమల లడ్డూ వ్యవహారంపై శ్రీనివాసానంద సరస్వతి ఆగ్రహం..
హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి..
లడ్డూ ప్రసాదంలో కూడా ఫుడ్ మాఫియా చేరింది: శ్రీనివాసానంద సరస్వతి
-
Feb 09, 2026 12:02 IST
తల్లి ప్రైవేట్ ఫొటోలు తీసి ప్రియుడికి పంపిన కూతురు..
బెంగళూరులో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన..
కూతురు ఫోన్ చెక్ చేయగా బయటపడ్డ దారుణం..
కూతురు, ఆమె ప్రియుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లి..
-
Feb 09, 2026 11:50 IST
ఏపీఎస్ ఆర్టీసీకి.. సీఎం చంద్రబాబు అభినందనలు
అమరావతి: స్త్రీశక్తి పథకం అమలుపై ఏపీఎస్ ఆర్టీసీకి సీఎం చంద్రబాబు అభినందనలు..
రూ.4 కోట్ల మంది మహిళా ప్రయాణికులకు ఉచిత సేవలు అందించాం: సీఎం
ఏపీఎస్ ఆర్టీసీకి సీఎం ప్రశంసలపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హర్షం..
భవిష్యత్‌లో మెరుగైన సేవలు అందిస్తాం: మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
-
Feb 09, 2026 11:01 IST
అమరావతి కేంద్రంగా క్వాంటం కంప్యూటింగ్‌కు శంకుస్థాపన: సీఎం చంద్రబాబు
రెండేళ్లలో క్వాంటం కంప్యూటర్లు ఇక్కడి నుంచే తయారీ..
ప్రపంచానికి క్వాంటం కంప్యూటర్లు మనమే అందిస్తాం..
AI, క్వాంటం కంప్యూటర్లు, డేటా సెంటర్లతో పెనుమార్పులు: సీఎం చంద్రబాబు
-
Feb 09, 2026 10:51 IST
టీ20 ప్రపంచ కప్ 2026: స్కాట్లాండ్‌తో మ్యాచ్.. టాస్ గెలిచిన ఇటలీ
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా తలపడనున్న స్కాట్లాండ్-ఇటలీ
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇటలీ..
తొలుత బ్యాటింగ్ చేయనున్న స్కాట్లాండ్..
-
Feb 09, 2026 10:47 IST
ఇనుప కంచెలో చిక్కుకున్న ఎలుగుబంటి..
శ్రీకాకుళం: వజ్రపుకొత్తూరులో జీడి తోటల్లో ఇనుప కంచెలో చిక్కుకున్న ఎలుగుబంటి..
వెంటనే అప్రమత్తమైన రెస్క్యూ బృందం..
ఎలుగుబంటిని చాకచక్యంగా బోనులో బంధించి.. విశాఖపట్నం జూకి తరలించిన అటవీశాఖ సిబ్బంది.
-
Feb 09, 2026 09:45 IST
ఢిల్లీలో స్కూళ్లకు బాంబు బెదిరింపులు
ఢిల్లీలో 9 స్కూళ్లకు బాంబు బెదిరింపులు..
రంగంలోకి పోలీస్ దళాలు, బాంబ్ స్క్వాడ్స్..
-
Feb 09, 2026 09:29 IST
కొమురంభీం జిల్లాలో మావోయిస్టుల కలకలం
తిర్యాణి మండలం పంగిడిమాదారం అటవీ ప్రాంతంలో..
మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో పోలీసుల కూంబింగ్..
మావోయిస్టులు పారిపోయారని ప్రచారం..
మావోయిస్టుల సామగ్రి గుర్తించిన గ్రేహౌండ్స్ బలగాలు..
-
Feb 09, 2026 09:28 IST
భారత్-పాక్ టీ20 మ్యాచ్‌పై నేడు కీలక సమావేశం
లాహోర్‌లో సమావేశం కానున్న ఐసీసీ, పీసీబీ, బీసీబీ..
ఇప్పటికే భారత్‌తో మ్యాచ్ ఆడబోమన్న పాక్, బంగ్లాదేశ్..
పాకిస్తాన్ నిర్ణయాన్ని ఖండించిన ఐసీసీ..
నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే కఠిన చర్యలు: ఐసీసీ
-
Feb 09, 2026 09:27 IST
మదురైలో జల్లికట్టు పోటీలు..
మదురై తిరుప్పరంకుండ్రంలో జల్లికట్టు పోటీలు..
పోటీలు ప్రారంభించిన మంత్రులు, ఎమ్మెల్యేలు..
పోటీల్లో 1,300 ఎద్దులు, 600 మంది యువకులు..
-
Feb 09, 2026 09:06 IST
జగిత్యాలలో కరపత్రాల కలకలం
కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించాలని వెలిసిన కరపత్రాలు..
కాంగ్రెస్ బీఫామ్ పొందిన 35మంది.. గతంలో BRS కౌన్సిలర్లు అంటూ కరపత్రాలు..
-
Feb 09, 2026 08:58 IST
మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి జూమ్ మీటింగ్..
మున్సిపల్ ఎన్నికల పోలింగ్ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశా నిర్దేశం..
మున్సిపాలిటీల వారీగా పరిస్థితిని అడిగి తెలుసుకున్న సీఎం..
సర్వేలన్నీ మనకే అనుకూలంగా ఉన్నాయని..
పోలింగ్ ముగిసే వరకూ అప్రమత్తంగా ఉండాలని సూచించిన సీఎం..
-
Feb 09, 2026 08:53 IST
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా..14 మందికి తీవ్ర గాయాలు..
తిరుపతి: శ్రీకాళహస్తి పెద్దకన్నలి వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా..
14 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు..
క్షత్రగాత్రులను చికిత్స నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించిన పోలీసులు..
-
Feb 09, 2026 08:53 IST
గుంటూరు కోర్టుకు అంబటి రాంబాబు..
రాజమండ్రి జైలు నుంచి గుంటూరుకు అంబటి రాంబాబు తరలింపు..
పీటీ వారెంట్‌పై గుంటూరు కోర్టుకు తరలించిన పోలీసులు..
గత నవంబర్ 12న పట్టాభిపురం పీఎస్‌లో అంబటిపై కేసు..
అంబటిని గుంటూరు కోర్టులో హాజరుపర్చనున్న పోలీసులు..
-
Feb 09, 2026 07:47 IST
శ్రీవారి సేవలో సినీ ప్రముఖులు..
తిరుమల: శ్రీవారిని దర్శించుకున్న హీరో తేజ సజ్జ, హీరోయిన్ శ్రీలీల..
సంగీత దర్శకుడు తమన్, సింగర్స్ శ్రీకృష్ణ, సాకేత్, సాహితీ చాగంటి, శ్రుతిరంజని..
-
Feb 09, 2026 07:26 IST
అమెరికా కోర్టులో ట్రంప్‌నకు భారీ విజయం
బాండ్ హియరింగ్‌కు అనుమతి ఇవ్వకుండానే..
వలసదారులను నిర్బంధించే ట్రంప్ విధానాన్ని సమర్థించిన అప్పీల్స్ కోర్టు..
-
Feb 09, 2026 07:25 IST
లారీని ఢీకొన్న బైక్.. వ్యక్తి మృతి..
ఏలూరు: పెదవేగి మండలం చక్రాయగూడెం వద్ద లారీని వెనుక నుంచి ఢీకొన్న బైక్..
బైక్‌పై ఉన్న రాంబాబు(50) అనే వ్యక్తి మృతి, అతడి కుమార్తెకు గాయాలు..
ఏలూరులో జరిగే జాతరను చూసేందుకు వెళ్తుండగా ప్రమాదం..
-
Feb 09, 2026 07:12 IST
సైబర్ నేరగాళ్ల వేధింపులకు మరొకరు బలి
ములుగు జిల్లా: సైబర్ నేరగాళ్ల వేధింపులకు మరొకరు బలి..
గడ్డి మందు తాగిన రామారావు, చికిత్స పొందుతూ మృతి..
తన ఫోన్ హ్యాక్ చేసి వేధిస్తున్నారని సూసైడ్ నోట్..
ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూసైడ్ నోట్‌లో పేర్కొన్న రామారావు..
మృతుడి స్వస్థలం ములుగు జిల్లా వెంకటాపురం మండలం తిప్పాపురం..
-
Feb 09, 2026 06:12 IST
నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు..
నేడు ఢిల్లీకి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు..
ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలవనున్న చంద్రబాబు..
-
Feb 09, 2026 06:10 IST
భారత్ పర్యటనలో గ్రీస్ రక్షణ మంత్రి నికోస్
నేడు ఢిల్లీలో రక్షణ మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, నికోస్ భేటీ..
రక్షణ రంగంలో పరస్పర సహకారంపై చర్చ..
-
Feb 09, 2026 06:09 IST
నేడు భూపాలపల్లిలో కేటీఆర్ ఎన్నికల ప్రచారం..
నేడు భూపాలపల్లిలో మాజీ మంత్రి కేటీఆర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం..
మధ్యాహ్నం పరకాల, మహబూబాబాద్‌లో కేటీఆర్ ప్రచారం..
-
Feb 09, 2026 06:07 IST
నేటి సీఎం రేవంత్‌రెడ్డి మెదక్ సభ రద్దు
మున్సిపల్ ఎన్నికల వ్యూహంపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష..
నేడు మెదక్ జిల్లాలో హరీష్‌రావు ఎన్నికల ప్రచారం..
ఖమ్మం: నేడు మధిరలో డిప్యూటీ సీఎం భట్టి ప్రచారం..
కొత్తగూడెం, ఏదులాపురంలో పొంగులేటి ప్రచారం..
నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి, సూర్యాపేటలో ఉత్తమ్..
నిజామాబాద్‌లో మహేష్‌గౌడ్, ఎంపీ అర్వింద్ ఎన్నికల ప్రచారం..
-
Feb 09, 2026 06:05 IST
నేటితో తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారం బంద్
సాయంత్రం 5 గంటలకు ముగియనున్న ప్రచారం..
నేడు చివరి రోజు కావడంతో హోరాహోరీగా పార్టీల ప్రచారం..
ఈ నెల 11న మున్సిపల్ ఎన్నికల పోలింగ్, 13న కౌంటింగ్..