వీలైనంత త్వరగా వైభవ్‌ను సీనియర్ జట్టులోకి తీసుకోవాలి: ఎంపీ శశిథరూర్
ABN , Publish Date - Feb 09 , 2026 | 03:17 PM
అండర్ 19 క్రికెట్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగుతున్నాడు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్.. వైభవ్ సూర్యవంశీపై ప్రశంసలు కురిపించారు. వీలైనంత త్వరగా అతడిని భారత జట్టులోకి తీసుకోవాలని అన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: అండర్ 19 క్రికెట్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగుతున్నాడు. ఇటీవలే జరిగిన అండర్ 19 ప్రపంచ కప్‌లో 175 పరుగులతో విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. 14 ఏళ్ల వయసులోనే ఈ స్థాయిలో విరుచుకుపడుతుండటంతో ఈ కుర్రాడిని త్వరగా భారత జట్టులోకి తీసుకోవాలనే అభిమానులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్(Shashi Tharoor).. వైభవ్ సూర్యవంశీపై ప్రశంసలు కురిపించారు.
‘వీలైనంత తొందరగా సీనియర్ల జట్టులో ఆడించాలి. మరింత గౌరవానికి సూర్యవంశీ పూర్తిగా అర్హుడు. ఇలాంటి క్రికెటర్ తరానికి ఒక్కరు మాత్రమే ఉంటారు. దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూడా 14 ఏళ్ల వయసులోనే మైదానంలోకి అడుగుపెట్టి తన అద్భుతమైన ఆటతో అందరినీ ఆశ్చర్యపర్చాడు. సచిన్ కుర్రాడిగా ఉన్నప్పుడే టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. వైభవ్‌ను కూడా త్వరగా భారత జట్టు తరఫున ఆడించాలి’ అని శశిథరూర్ తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నాడు.
ఇవి కూడా చదవండి:
నేపాల్‌కు ద్వైపాక్షిక సిరీస్‌లు ఇవ్వాలి.. ఐసీసీకి ఆకాశ్ చోప్రా కీలక సూచన
టీ20 ప్రపంచ కప్ 2026: భారత్‌తో వివాదం.. పాక్ నిర్ణయం ఆశ్చర్యం కలిగిస్తోంది: గంగూలీ