Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Jul 21 , 2026 | 06:36 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Jul 21, 2026 21:33 IST

    అమెరికా: కాలిఫోర్నియాలో రోడ్డు ప్రమాదం

    • హైదరాబాద్‌కు చెందిన ముగ్గురి మృతి, ఇద్దరికి సీరియస్‌

    • మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా గుర్తింపు

  • Jul 21, 2026 21:13 IST

    అమరావతి: పలువురు డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు, పోస్టింగ్స్‌

    • అనకాపల్లి జిల్లా అడ్డరోడ్డు ఆర్డీఓగా కె.వి.రామలక్ష్మి

    • ధర్మవరం ఆర్డీవోగా రామభూపాల్ రెడ్డి

    • అమలాపురం ఆర్డీవోగా డి.ధర్మరాజు

    • పీలేరు ఆర్డీవోగా కె.విజయలక్ష్మి

    • మడకశిర ఆర్దీవోగా నాగప్రసన్న లక్ష్మి

    • అనంతపురం ఆర్డీఓగా ప్రేమ్‌నాథ్‌ కుమార్‌

  • Jul 21, 2026 21:12 IST

    హైదరాబాద్‌: ఉద్యమకారులకు న్యాయం విషయంలో ఆలస్యం వద్దు: కవిత

    • గత ప్రభుత్వంలో ఉద్యమకారులకు అన్యాయం జరిగింది: కవిత

    • BRS వల్ల బలైన వ్యక్తిని నేను: TRS చీఫ్‌ కవిత

  • Jul 21, 2026 21:11 IST

    TG హైకోర్టుకు ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణారెడ్డి

    • తనపై నమోదైన కేసు కొట్టివేయాలని పిటిషన్

  • Jul 21, 2026 21:10 IST

    ఏపీలో కొత్తగా 7 కరోనా కేసులు నమోదు

    • గుంటూరులో నలుగురికి కరోనా పాజిటివ్‌

    • తూ.గో. జిల్లాలో 2, బాపట్లలో ఒక కేసు నమోదు

    • ఏపీలో 26కి చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు

    • కరోనాతో ఇప్పటివరకూ నలుగురి మృతి

  • Jul 21, 2026 21:10 IST

    రేపు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు

    • ప్రధాని మోదీతో భేటీకానున్న సీఎం చంద్రబాబు

    • భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానించనున్న చంద్రబాబు

    • పలువురు కేంద్రమంత్రులతో భేటీ అయ్యే అవకాశం

  • Jul 21, 2026 21:09 IST

    ఢిల్లీ: మందిర్‌ మార్గ్‌ పీఎస్‌కు సోనియా

    • మందిర్‌ మార్గ్‌ పీఎస్‌లో ఉన్న ప్రియాంక

    • రాహుల్‌, ప్రియాంకను వేర్వేరు పోలీస్‌ స్టేషన్లకు తరలింపు

    • ప్రధాని నివాసం ఎదుట మూడున్నర గంటల పాటు కాంగ్రెస్‌ ధర్నా

    పూర్తి కథనం..

  • Jul 21, 2026 21:00 IST

    బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా: పవన్ కల్యాణ్

    • సినిమా చిత్రీకరణలో బాలకృష్ణ గాయపడ్డారని తెలిసింది: పవన్ కల్యాణ్

    • బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితిని అధికారుల ద్వారా తెలుసుకున్నా: పవన్ కల్యాణ్

    • బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా: పవన్ కల్యాణ్

  • Jul 21, 2026 18:54 IST

    మాజీ స్పీకర్ తమ్మినేని కుటుంబ సభ్యులకు హైకోర్టులో ఎదురుదెబ్బ

    • తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలన్న తమ్మినేని పిటిషన్ కొట్టివేత

    • కేసు దర్యాప్తు ప్రాథమిక దశలో ఉంది: హైకోర్టు

    • క్వాష్ పిటిషన్‌లో అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ స్టే ఇవ్వలేం: హైకోర్టు

    • అరెస్టు చేస్తారనే ఆందోళన ఉంటే ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకోవచ్చు: ఏపీ హైకోర్టు

    పూర్తి కథనం..

  • Jul 21, 2026 18:45 IST

    ఢిల్లి: ప్రధాని నివాసం లోక్‌ కల్యాణ్‌ మార్గ్‌లో ఉద్రిక్తత

    • కాంగ్రెస్‌ నేతల ధర్నాను భగ్నం చేసిన పోలీసులు

    • రాహుల్‌ గాంధీ సహా కాంగ్రెస్‌ నేతలను అదుపులోకి తీసుకుని తరలిస్తున్న పోలీసులు

  • Jul 21, 2026 18:25 IST

    హోంశాఖ కార్యదర్శి గోవింద్‌ మోహన్‌తో కలిసి చర్చలు జరిపాం: కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌

    • నీట్‌పై పార్లమెంట్‌లో చర్చించాలని రాహుల్‌ డిమాండ్‌ చేశారు: జితేంద్ర సింగ్‌

    • చర్చకు సిద్ధమని ప్రభుత్వం ప్రకటించింది: జితేంద్ర సింగ్‌

    • మొదట అంగీకరించి.. రాహుల్‌ మాట తప్పారు: జితేంద్ర సింగ్‌

    • మళ్లీ ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా కోరుతున్నారు: జితేంద్ర సింగ్‌

    • కొత్తగా రెండు డిమాండ్లు పెట్టడం.. మాట తప్పడం సరికాదు: కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌

  • Jul 21, 2026 18:18 IST

    తెలంగాణలో రేపు ఓలా, ఉబర్‌, ర్యాపిడో డ్రైవర్ల సమ్మె

    • కార్మిక హక్కులు, సామాజిక భద్రత కోసం పోరాటం

    • సమస్యలు పరిష్కరించకపోతే ఆగస్టు 8 నుంచి నిరవధిక సమ్మె

    • మద్దతుగా స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్‌, జెప్టో కూడా సమ్మె బాట పట్టే అవకాశం

  • Jul 21, 2026 17:51 IST

    హైదరాబాద్‌ను తాకిన ఢిల్లీ సెగ

    • తెలంగాణ విద్యార్థి సంఘాల చలో లోక్‌భవన్‌

    • ఢిల్లీలో విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా వామపక్ష విద్యార్థి సంఘాల ఆందోళన

    • పోలీసుల అదుపులో విద్యార్థి సంఘాల నాయకులు

  • Jul 21, 2026 17:22 IST

    హైదరాబాద్‌: కొడంగల్‌ బయల్దేరిన సీఎం రేవంత్‌రెడ్డి

    • కొడంగల్‌లో రెండు రోజుల పాటు రేవంత్‌ పర్యటన

    • రాత్రి కొడంగల్‌లోనే సీఎం రేవంత్‌ రెడ్డి బస

    • రేపు SIRపై సమీక్ష నిర్వహించనున్న సీఎం రేవంత్

    • స్థానిక నేతలు, BLAలతో సీఎం రేవంత్‌ సమావేశం

  • Jul 21, 2026 17:21 IST

    అమరావతి: నందమూరి బాలకృష్ణకు సీఎం చంద్రబాబు ఫోన్‌

    • సినిమా షూటింగ్‌లో గాయపడిన బాలకృష్ణ ఆరోగ్యంపై సీఎం ఆరా

    • బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని సీఎం చంద్రబాబు ఆకాంక్ష

  • Jul 21, 2026 17:19 IST

    పరీక్షల నిర్వహణలో లీకేజీలు ఆపాలి: అరవింద్‌ కేజ్రీవాల్‌

    • నీట్‌ పేపర్‌ లీకేజ్‌కు నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలి: కేజ్రీవాల్‌

    • ప్రభుత్వ విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలి: అరవింద్‌ కేజ్రీవాల్‌

    • CJPకే మా మద్దతు: అరవింద్‌ కేజ్రీవాల్‌

  • Jul 21, 2026 16:48 IST

    ఢిల్లి: గంట నుంచి కొనసాగుతున్న కాంగ్రెస్ నిరసన

    • విద్యార్థులపై లాఠీచార్జ్‌కు వ్యతిరేకంగా ధర్నా

    • రాహుల్‌ దగ్గరకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్

    • రాహుల్‌తో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చర్చలు

    • రాహుల్‌కు నచ్చజెబుతున్న జితేంద్ర సింగ్‌

  • Jul 21, 2026 15:52 IST

    అమరావతి: షూటింగ్‌లో గాయపడిన బాలకృష్ణను ఫోన్‌లో పరామర్శించిన లోకేశ్

    • మామయ్య బాలకృష్ణకు మంత్రి నారా లోకేశ్ ఫోన్‌

    • ప్రమాదంపై ఆరా తీసిన నారా లోకేశ్

    • మావయ్య త్వరగా కోలుకుని షూటింగ్‌లో పాల్గొనాలని కోరుకుంటున్నా: ఎక్స్‌లో లోకేశ్

  • Jul 21, 2026 15:48 IST

    బాలకృష్ణకు ప్రమాదంపై జూనియర్‌ ఎన్టీఆర్ ఆవేదన

    • బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని ఎక్స్‌లో జూనియర్‌ ఎన్టీఆర్‌ పోస్టు

    • పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకున్న జూ. ఎన్టీఆర్‌

  • Jul 21, 2026 15:45 IST

    నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

    • 238 పాయింట్ల నష్టంతో ముగిసిన సెన్సెక్స్

    • 51 పాయింట్ల నష్టంతో ముగిసిన నిఫ్టీ

  • Jul 21, 2026 15:45 IST

    ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత

    • ప్రధాని మోదీ నివాసం దగ్గర రాహుల్ ధర్నా

    • ధర్నాలో పాల్గొన్న ఖర్గే, కేసీ వేణుగోపాల్‌, ప్రియాంక

    • గూండాగిరి, నిరంకుశత్వం వద్దంటూ నినాదాలు

    • విద్యార్థులపై లాఠీఛార్జ్‌కు నిరసనగా ఆందోళన

    పూర్తి కథనం..

  • Jul 21, 2026 15:06 IST

    కృష్ణా: తెంపల్లి-కొత్తగూడెం దగ్గర పోలవరం కాలువపై రైతుల నిరసన

    • అధికారులు మోటార్లను తొలగించడాన్ని వ్యతిరేకిస్తున్న రైతులు

    • పోలవరం ప్రాజెక్ట్ అధికారులు, రైతుల మధ్య వాగ్వాదం

  • Jul 21, 2026 15:05 IST

    హైదరాబాద్‌: మీర్‌పేట్‌ రౌడీషీటర్‌ సూరి హత్య కేసులో ట్విస్ట్‌

    • ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లోకి హత్యకేసు ప్రధాన నిందితుడు ఆఫ్రూజ్‌

    • సూరిని తానే హత్య చేశానంటూ లైవ్‌లో మాట్లాడిన ఆఫ్రూజ్‌

    • లైవ్‌లో పోలీసులను ఉద్దేశించి దుర్భాషలాడిన ఆఫ్రూజ్‌

    • సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన ఆఫ్రూజ్‌ వీడియో

  • Jul 21, 2026 15:04 IST

    శంషాబాద్‌లో రోడ్డు పక్కన పసికందు గుర్తింపు

    • ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్డుపై రోజుల వయసున్న ఆడ శిశువు లభ్యం

    • తెల్లటి సంచిలో పసికందును వదిలివెళ్లిన గుర్తుతెలియని వ్యక్తులు

    • శిశువును శంషాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు

    • ప్రస్తుతం అమీర్‌పేట్ శిశు విహార్ సంరక్షణలో ఉన్న పసికందు

    • కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు

  • Jul 21, 2026 14:48 IST

    అమరావతి: WEFలో కుదుర్చుకున్న మరో ఒప్పందం సాకారం

    • ఏపీలో ఫుడ్‌ క్లస్టర్‌ ఏర్పాటుకు ముందుకొచ్చిన UAE

    • సీఎం చంద్రబాబుతో UAE ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్‌ చర్చలు

  • Jul 21, 2026 14:39 IST

    BRS పాలనలో ప్రజలు ఎంతో నష్టపోయారు: TPCC చీఫ్‌ మహేశ్ గౌడ్

    • నాడు నీళ్లు, భూముల పేరుతో దోపిడీ చేశారు: మహేశ్ గౌడ్

    • BRSను ప్రజలు క్షమించే పరిస్థితి లేదు: మహేశ్ గౌడ్

    • మేం 6 గ్యారంటీలను అమలు చేస్తున్నాం: TPCC చీఫ్‌ మహేశ్ గౌడ్

  • Jul 21, 2026 14:38 IST

    సిక్కిం టన్నెల్‌ ప్రమాదంలో 10కి పెరిగిన మృతులు

    • టన్నెల్‌లో చిక్కుకున్న మరో 27 మంది కార్మికులు

    • కొనసాగుతున్న సహాయక చర్యలు

  • Jul 21, 2026 14:25 IST

    మంచిర్యాల: కరవు రావొద్దనే కేసీఆర్‌ కాళేశ్వరం కట్టారు: కేటీఆర్‌

    • 31 నెలల నుంచి కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు మరమ్మతులు చేయలేదు: కేటీఆర్‌

    • మరమ్మతులు చేయాల్సిన ఎల్‌అండ్‌టీ సంస్థను బెదిరించారు: కేటీఆర్‌

    • గోదావరి ఏపీకి తరలుతోంది.. అక్కడ పట్టిసీమ పారుతోంది: కేటీఆర్‌

    • రేవంత్‌కు తెలిసింది రెండే.. ఒకటి ఓట్లు, రెండోది తిట్లు: కేటీఆర్‌

  • Jul 21, 2026 14:22 IST

    శ్రీకాకుళం: తమ్మినేని సీతారాంపై MLA కూన రవికుమార్‌ ఆగ్రహం

    • భూములు కావాలంటే చట్టబద్ధంగా కొనుగోలు చేయాలి: కూన రవికుమార్‌

    • ఒకరు బతికుండగానే చనిపోయాడని ఫేక్‌ సర్టిఫికెట్‌ సృష్టిస్తారా?: కూన రవికుమార్‌

    • నకిలీ సర్టిఫికెట్‌తో రూ.4 కోట్ల విలువైన స్థలం కబ్జా చేశారు: కూన రవికుమార్‌

  • Jul 21, 2026 14:21 IST

    ములుగు జిల్లాలో పలు చోట్ల భారీ వర్షం

    • తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ మధ్య నిలిచిన రాకపోకలు

    • చీకుపల్లి-గొల్లగూడెం మధ్య పూర్తికాని బ్రిడ్జి నిర్మాణ పనులు

    • భారీ వర్షానికి కొట్టుకుపోయిన తాత్కాలిక రోడ్డు

    • 26 గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు

  • Jul 21, 2026 14:18 IST

    కెరీర్‌ కష్టకాలంలో విరాట్‌ కోహ్లీ అండగా నిలిచారు: పీవీ సింధు

    • విరాట్‌ కోహ్లీ మాటలు ఎంతో స్ఫూర్తి నింపాయి: పీవీ సింధు

    • విరాట్‌ కోహ్లీకి ఎప్పటికీ రుణపడి ఉంటా: పీవీ సింధు

    • కెరీర్‌ క్లిష్టదశలో ఉన్నప్పుడు కోహ్లీని సంప్రదించా: పీవీ సింధు

    • కోహ్లీ ఇచ్చిన సలహాలు ఎంతో ఉపయోగపడ్డాయి: పీవీ సింధు

  • Jul 21, 2026 14:01 IST

    అర్జెంటీనా డ్రెస్సింగ్ రూమ్‌లో అసలేం జరిగింది?

    • ఫిఫా ఫైనల్‌కు ముందు అర్జెంటీనా డ్రెస్సింగ్ రూమ్‌‌లో జరిగిన చర్చ వీడియో వైరల్

    • సహచర ఆటగాళ్లను మెస్సి శాంతింపజేస్తున్నట్లు దృశ్యాలు

    • అసలేం జరిగి ఉంటుందని చర్చించుకుంటున్న అభిమానులు

  • Jul 21, 2026 13:55 IST

    అర్జెంటీనా ప్లేయర్లపై ఫిఫా దర్యాప్తు

    • స్పెయిన్ ఆటగాళ్లతో గొడవపై స్పందించిన ఫిఫా

    • స్పెయిన్ కెప్టెన్ రోడ్రిపై అర్జెంటీనా ప్లేయర్ మోలినా దాడి

    • విచారణ చేపట్టిన ఫిఫా అధికారులు

  • Jul 21, 2026 13:45 IST

    ములుగు: వాజేడులో బొగత జలపాతానికి పోటెత్తిన వరద

    • ఈత కొలనులో స్నానాలకు అనుమతి నిరాకరణ

  • Jul 21, 2026 13:34 IST

    వైసీపీ విధ్వంస పాలనతో ఏపీ తీవ్రంగా నష్టపోయింది: నిమ్మల

    • ఇప్పుడిప్పుడే అన్ని వ్యవస్థలు దారిలోకి వస్తున్నాయి: నిమ్మల

    • పోలవరం పనులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు: మంత్రి నిమ్మల

    • రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో పోలవరం పనులను గాలికొదిలేశారు: నిమ్మల

    • కాలయాపన వల్లే డయాఫ్రం వాల్‌ దెబ్బతింది: మంత్రి నిమ్మల

  • Jul 21, 2026 13:26 IST

    ఢిల్లీ RML ఆస్పత్రికి రాహుల్‌, ప్రియాంక

    • జంతర్‌మంతర్‌ దగ్గర ఆందోళనల్లో గాయపడిన విద్యార్థులకు పరామర్శ

  • Jul 21, 2026 13:25 IST

    ఢిల్లీ RML ఆస్పత్రికి కేంద్రమంత్రి జేపీ నడ్డా

    • జంతర్‌మంతర్‌ దగ్గర ఆందోళనల్లో గాయపడిన విద్యార్థులకు పరామర్శ

  • Jul 21, 2026 13:23 IST

    ఢిల్లీ: విద్యార్థులపై దాడి అనాగరిక చర్య: రాహుల్‌ గాంధీ

    • ఇంత జరుగుతున్నా మోదీ మౌనంగా ఉన్నారు: రాహుల్

    • దాడి ఘటనపై ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలి: రాహుల్‌

    • దేశంలో విద్య, పరీక్షా వ్యవస్థలు భ్రష్టుపట్టాయి: రాహుల్‌

    • కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలి: రాహుల్

  • Jul 21, 2026 13:15 IST

    ఢిల్లీ: లోక్‌సభ స్పీకర్‌ను కలిసిన రాహుల్‌, విపక్ష ఎంపీలు

    • భవిష్యత్తుపై విద్యార్థులు ఆందోళనతో ఉన్నారు: రాహుల్‌

    • ఆందోళన చేసినవారిపై దాడులు చేశారు: రాహుల్‌

    • దాడుల ఘటనపై పార్లమెంట్‌లో చర్చించాలి: రాహుల్‌

  • Jul 21, 2026 13:10 IST

    నటుడు బాలకృష్ణకు స్వల్ప గాయం, ఆస్పత్రికి తరలింపు

    • కాకినాడ పోర్టులో షూటింగ్‌ చేస్తుండగా ఘటన

    • యాక్షన్‌ సీక్వెన్స్‌ చేస్తుండగా మోకాలికి గాయం

    • రెండు రోజుల విశ్రాంతి అవసరమన్న వైద్యులు

    • దర్శకుడు గోపీచంద్‌ మలినేని సినిమా షూటింగ్‌లో ఘటన

  • Jul 21, 2026 12:54 IST

    ఢిల్లీ కిసాన్‌ఘాట్‌ దగ్గర రైతుల నిరసన

    • భారత్‌-యూఎస్ ట్రేడ్‌ డీల్‌ను రద్దు చేయాలని డిమాండ్

    • పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్‌

    • కిసాన్‌ఘాట్‌ నుంచి రైతులను తరలించిన పోలీసులు

  • Jul 21, 2026 12:42 IST

    ఢిల్లీ: బీకేదత్ కాలనీలోని ఇంట్లో అగ్నిప్రమాదం

    • ఇద్దరు చిన్నారులు సహా మహిళ మృతి

  • Jul 21, 2026 12:30 IST

    హైదరాబాద్: బహదూర్‌గూడ భూ వివాదంపై మరో 85 పిటిషన్లు

    • హైకోర్టును ఆశ్రయించిన 85 మంది రైతులు

    • తాజాగా దాఖలైన 85 మంది రైతుల పిటిషన్లపై మధ్యాహ్నం కొనసాగనున్న విచారణ

  • Jul 21, 2026 12:18 IST

    కాంగ్రెస్‌ ప్రభుత్వం మాటలకు ఎక్కువ.. చేతలు తక్కువ: హరీశ్ రావు

    • దేవాదులపై మంత్రులు పెద్ద పెద్ద మాటలు చెప్పారు: హరీశ్ రావు

    • ప్రతి నీటిబొట్టును ఎత్తిపోస్తామని అన్నారు: హరీశ్ రావు

    • 10 మోటార్లు రన్‌ చేస్తామని ఈ నెల 13న చెప్పారు: హరీశ్ రావు

    • 38 TMCలు ఎత్తిపోసి 22 రిజర్వాయర్లు నింపుతామన్నారు: హరీశ్ రావు

    • మంత్రుల మాటలు నమ్మి రైతులు నాట్లు వేశారు: హరీశ్ రావు

    • నీరు వదలకపోవడంతోనే రైతులు ధర్నాలు చేస్తున్నారు: హరీశ్ రావు

  • Jul 21, 2026 12:13 IST

    ఢిల్లీ: జంతర్‌మంతర్‌ దగ్గర కొనసాగుతున్న CJP ఆందోళన

    • నిన్న పోలీసుల లాఠీఛార్జ్‌లో గాయపడిన విద్యార్థులతో నిరసన

  • Jul 21, 2026 12:12 IST

    పార్లమెంట్‌ ఉభయసభలు మరోసారి వాయిదా

    • మ. 2 గంటల వరకు ఉభయసభల వాయిదా

    • నీట్‌, అయోధ్య అంశాలపై చర్చకు విపక్షాల పట్టు

    • విపక్షాల ఆందోళనతో ఉభయసభల వాయిదా

  • Jul 21, 2026 11:55 IST

    రష్యా రాయబారికి కేంద్రం సమన్లు

    • ఉక్రెయిన్‌ తీరంలో వాణిజ్య నౌకపై రష్యా దాడిని తీవ్రంగా ఖండించిన భారత్‌

    • నిన్నటి దాడిలో నలుగురు భారతీయుల మృతి

  • Jul 21, 2026 11:54 IST

    పార్లమెంట్‌ ఆవరణలో AAP ఎంపీల నిరసన

    • విద్యార్థులపై లాఠీఛార్జ్‌కు వ్యతిరేకంగా ఆందోళన

  • Jul 21, 2026 11:48 IST

    సుప్రీంకోర్టును ఆశ్రయించిన శివసేన (UBT)

    • లోక్‌సభ స్పీకర్‌ నిర్ణయాన్ని సుప్రీంలో సవాల్‌ చేసిన UBT వర్గం

    • ఏక్‌నాథ్‌ షిండే వర్గంలో ఆరుగురు ఎంపీల విలీనంపై స్పీకర్‌ నిర్ణయం రద్దుచేయాలని శివసేన(UBT) విజ్ఞప్తి

    • శివసేన UBT పిటిషన్‌ విచారణకు సుప్రీంకోర్టు అనుమతి

  • Jul 21, 2026 11:40 IST

    జమ్మూకశ్మీర్‌లో వరద బీభత్సం.. 40 మంది మృతి

    • పూంఛ్‌, రాజౌరి, సురన్‌కోట్‌లో 3 రోజులుగా వర్షం

    • పూంఛ్‌లో 22 మంది, సురన్‌కోట్‌, రాజౌరిలో 18 మంది మృతి

    • కొండచరియలు విరిగిపడి పలుచోట్ల నివాస భవనాల ధ్వంసం

    • పలువురి గల్లంతు.. కొనసాగుతున్న సహాయకచర్యలు

  • Jul 21, 2026 11:38 IST

    రెండోరోజు పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు

    • సభ ప్రారంభమైన వెంటనే విపక్షాల నినాదాలు

    • నీట్‌, అయోధ్య అంశాలపై చర్చకు విపక్షాల పట్టు

    • విపక్షాల నిరసనల మధ్య పార్లమెంట్‌ ఉభయసభలు మ.12:00 గంటలకు వాయిదా

  • Jul 21, 2026 11:24 IST

    హైదరాబాద్‌: CURE పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు

    • ఆగస్టు 10 వరకు కొనసాగనున్న దరఖాస్తుల స్వీకరణ

    • రూ.6 లక్షల కంటే తక్కువ ఆదాయం కలిగినవారు అర్హులు

    • ఒక కుటుంబం నుంచి ఒక దరఖాస్తు మాత్రమే అనుమతి

    • CURE పరిధిలో పదేళ్లు నివాసమున్నవారికి అవకాశం

  • Jul 21, 2026 11:19 IST

    మంచిర్యాల: బెల్లంపల్లి ఓసీ గనుల్లో ఎడతెరిపిలేని వర్షం

    • ఇందారం, శ్రీరాంపూర్‌, మందమర్రి, ఖైరిగూడ గనుల్లో నిలిచిన 30 వేల మెట్రిక్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి

  • Jul 21, 2026 11:07 IST

    ఢిల్లీ: ముగిసిన ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశం

    • నీట్‌ వ్యవహారంపై స్పందించిన ప్రధాని మోదీ

    • నీట్‌ పేపర్‌ లీక్‌ కారకులకు శిక్షపడేలా చర్యలు తీసుకున్నాం: మోదీ

    • నీట్‌ పేపర్‌ లీక్‌కు పాల్పడిన నిందితులను జైల్లో పెట్టాం: మోదీ

    • భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు: మోదీ

    • విద్యార్థులకు నష్టం కలగకుండా నీట్‌ పరీక్ష నిర్వహించాం: మోదీ

  • Jul 21, 2026 10:53 IST

    ఢిల్లీ: ఉభయసభల్లో వాయిదా తీర్మానం ఇచ్చిన కాంగ్రెస్

    • నీట్ యూజీ పేపర్ లీక్‌పై చర్చించాలని డిమాండ్

  • Jul 21, 2026 10:49 IST

    ఢిల్లీ: హరియాణా-పంజాబ్ సరిహద్దులోని శంభు బార్డర్‌లో హైటెన్షన్

    • పంజాబ్, హరియాణా నుంచి ఢిల్లీ వైపు వస్తున్న వేలాది మంది రైతులు

    • వేల సంఖ్యలో ఢిల్లీకి చేరుకుంటున్న రైతులు

    • కిసాన్ ఘాట్ వద్ద నిరసన చేపట్టనున్న రైతులు

  • Jul 21, 2026 10:35 IST

    హైదరాబాద్‌: నిలకడగా ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆరోగ్యం

    • ఉదయ్ కృష్ణారెడ్డి రక్తంలో విష పదార్థాలు లేవని బ్లడ్ రిపోర్ట్

    • ఉదయ్‌ బ్లడ్‌లో ఆల్కహాల్ మాత్రమే ఉన్నట్టు నివేదకలో వెల్లడి

    • ఐసీయూలోనే ఉదయ్ కృష్ణారెడ్డికి కొనసాగుతున్న చికిత్స

  • Jul 21, 2026 10:26 IST

    శ్రీకాకుళం: ఆముదాలవలసలో తమ్మినేని ఇంటికి తాళాలు

    • తమ్మినేని కుటుంబసభ్యులపై భూకబ్జా ఆరోపణలు

    • తమ్మినేని కుటుంబసభ్యుల ఫోన్లు సిచ్ఛాఫ్‌

    • వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు

  • Jul 21, 2026 10:17 IST

    ఢిల్లీ: పార్లమెంట్‌లో NDA ఎంపీల భేటీ

    • ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఎన్డీఏ ఎంపీల సమావేశం

    • NCPI నుంచి 20 మంది ఎంపీల హాజరు

    • పార్లమెంట్‌ సమావేశాలపై వ్యూహరచన

  • Jul 21, 2026 10:03 IST

    హైదరాబాద్‌: ట్రాఫిక్‌ సిబ్బందికి కొత్త నిబంధనలు

    • విధుల్లో మొబైల్‌ వాడకంపై నిషేధానికి ప్రతిపాదన

    • రోడ్డుపై డ్యూటీలో ఉండగా మొబైల్‌ చూడొద్దని ఆదేశాలు

    • మొబైల్‌ స్థానంలో VHF సెట్లతో కమ్యూనికేషన్‌

    • నిబంధనలపై సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తున్న అధికారులు

    • భద్రత, అప్రమత్తతే లక్ష్యంగా అధికారుల చర్యలు

  • Jul 21, 2026 09:58 IST

    జీఓ నం.3 పునరుద్ధరణకు సీఎం సానుకూలంగా ఉన్నారు: మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

    • 1/70 చట్టంతో పాటు గిరిజన సమస్యలపై సీఎంకు అవగాహన ఉంది: మంత్రి సంధ్యారాణి

    • జీవో నం.3 పునరుద్ధరణ కోసం న్యాయ నిపుణులు, గిరిజన సంఘాల నాయకులతో పలుమార్లు చర్చించాం: సంధ్యారాణి

    • ఐటీడీఏల పరిధిలో గిరిజన ప్రతినిధులు, సంఘాల అభిప్రాయాలను ప్రభుత్వం సేకరించింది: మంత్రి

    • గిరిజనులకు 50ఏళ్లకే పెన్షన్, విద్య, వైద్యం, ఐటీడీఏల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి

  • Jul 21, 2026 09:25 IST

    ఖమ్మం: సూర్యాపేట క్రాస్ రోడ్డు వద్ద టూరిస్ట్ బస్సు-డీసీఎం వ్యాన్ ఢీ

    • డీసీఎం డ్రైవర్‌ మృతి, ముగ్గురు మత్స్యకారులకు గాయాలు

    • టూరిస్ట్‌ బస్సులో ప్రయాణికులకు తప్పిన ప్రమాదం

  • Jul 21, 2026 09:24 IST

    మెదక్‌, సంగారెడ్డి జిల్లాల్లో పలు చోట్ల వర్షం

    • మెదక్‌ మండలంలో 4.8 సెం.మీ. వర్షపాతం నమోదు

    • సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో 4.3 సెం.మీ. వర్షపాతం నమోదు

  • Jul 21, 2026 09:24 IST

    ఏపీలో యూఏఈ మంత్రి అబ్దుల్లా బిన్ అల్ మరి పర్యటన

    • మ.12:00 గంటలకు సీఎం చంద్రబాబుతో UAE మంత్రి అబ్దుల్లా బిన్ అల్ మరి భేటీ

    • ఏపీ-UAE పెట్టుబడులపై కీలక చర్చ

    • వ్యవసాయం, ఫుడ్‌ ప్రాసెసింగ్‌పై ఫోకస్‌

  • Jul 21, 2026 09:17 IST

    అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్

    • ఉదయం 10:50 గంటలకు సచివాలయానికి వెళ్లనున్న సీఎం

    • మ.12:00 గంటలకు సీఎం చంద్రబాబుతో UAE మంత్రి అబ్దుల్లా బిన్ అల్ మరి భేటీ

    • మ.2:30 గంటలకు మున్సిపల్ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష

  • Jul 21, 2026 09:11 IST

    ఢిల్లీ: జంతర్‌మంతర్‌ దగ్గర కొనసాగుతున్న CJP నిరసనలు

    • జంతర్‌మంతర్‌ దగ్గర భారీగా మోహరించిన పోలీసులు

  • Jul 21, 2026 08:52 IST

    ఢిల్లీ: కాక్రోచ్‌ పార్టీ కార్యకర్తల నిరసనలపై ఢిల్లీ పోలీసుల చర్యలు

    • ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగించారని కేసు నమోదు

    • 20కి పైగా ప్రభుత్వ వాహనాలు ధ్వంసం చేశారు: ఢిల్లీ పోలీసులు

    • 118 మంది పోలీసులకు గాయాలయ్యాయి: ఢిల్లీ పోలీసులు

  • Jul 21, 2026 08:27 IST

    నేడు కొడంగల్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

    • రెండు రోజులపాటు కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించనున్న సీఎం

    • సాయంత్రం 4:00 గంటలకు దుద్యాల్ మం. హకీంపేటలోని ఎడ్యుకేషన్ హబ్‌ను పరిశీలించనున్న సీఎం

    • సాయంత్రం 5:00 గంటలకు కొడంగల్‌లో పలు అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించనున్న సీఎం

    • ఇవాళ రాత్రి కొడంగల్‌లోనే బస చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి

  • Jul 21, 2026 07:47 IST

    ఇరాన్‌పై మరోసారి అమెరికా దాడులు

    • ఇరాన్‌ మిలిటరీ కమాండర్‌ సెంటర్‌పై దాడి

    • ఇరాన్‌ డ్రోన్‌ లాంచ్‌ సైట్లు, ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌పై అమెరికా ఎటాక్‌

    • మరోవైపు యూఎస్‌ సైనిక స్థావరాలపై ఇరాన్‌ దాడులు

    • కువైట్‌లోని US స్థావరంపై దాడి చేసినట్లు ఇరాన్‌ ప్రకటన

    • US రాడార్‌ సిస్టమ్‌, అమెరికన్లు టార్గెట్‌గా ఇరాన్‌ ఎటాక్‌

  • Jul 21, 2026 07:40 IST

    సిక్కిం: నమాచిలోని హైడ్రో ప్రాజెక్ట్ టన్నెల్‌లో ఘోరప్రమాదం

    • ఏడుగురు కార్మికుల మృతి

    • ఘటనాస్థలిలో కొనసాగుతున్న సహాయక చర్యలు

  • Jul 21, 2026 07:27 IST

    సంగారెడ్డి: నిజాంపేట్‌ మండలం బాచుపల్లి వద్ద రోడ్డు ప్రమాదం

    • బైక్‌ను తప్పించబోయి స్కార్పియో వాహనం బోల్తా

    • ముగ్గురి మృతి, మృతుల్లో దంపతులు

    • మృతులు నాందేడ్‌ వాసులుగా గుర్తింపు

  • Jul 21, 2026 07:06 IST

    హైదరాబాద్‌: మీర్‌పేట్‌ పీఎస్‌ పరిధిలో రౌడీ షీటర్ సూరి హత్య

    • రౌడీ షీటర్ నందనవనం సూరిని కొన్ని నెలల క్రితం నగరం నుంచి బహిష్కరించిన పోలీసులు

    • గతంలో తన భార్య, బామ్మర్ది సల్మాన్‌ను చంపిన నందనవనం సూరి

    • సల్మాన్‌ సోదరుడు ఆఫ్రోజ్.. స్నేహితుడి పుట్టినరోజు సందర్భంగా సూరిని టీకేఆర్ కాలేజ్ వద్దకు పిలిచి కత్తితో దాడి

    • ఆస్పత్రికి తరలిస్తుండగా సూరి మృతి

  • Jul 21, 2026 07:02 IST

    కెనడాపై మరోసారి అమెరికా సుంకాలు

    • కెనడాపై 50 శాతం సుంకాలు విధిస్తున్నట్లు అమెరికా ప్రకటన

    • 30 రోజుల్లో కొత్త టారిఫ్‌లు అమల్లోకి వస్తాయని వెల్లడి

    • అమెరికా మద్యం, డైరీ ఉత్పత్తులపై కెనడా వివక్ష చూపుతోందన్న ట్రంప్‌

  • Jul 21, 2026 07:02 IST

    బ్రిటన్‌ నూతన ప్రధానిగా ఆండీ బర్న్‌హామ్‌ బాధ్యతలు

    • రాజు ఛార్లెస్‌-3తో భేటీ తర్వాత బాధ్యతల స్వీకరణ

    • బ్రిటన్‌లో కొత్త రాజకీయ, ఆర్థిక విధానాలను తెస్తానని బర్న్‌హామ్‌ వెల్లడి

  • Jul 21, 2026 06:57 IST

    హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం

    • నగర వ్యాప్తంగా కురిసిన వాన

    • బంజారాహిల్స్‌, పంజాగుట్ట, సికింద్రాబాద్‌, నారాయణగూడ, మల్కాజిగిరి పరిసర ప్రాంతాల్లో వర్షం

  • Jul 21, 2026 06:56 IST

    నేడు విజయవాడకు నటి జెత్వానీ

    • విజయవాడ కోర్టులో ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసిన సీఐడీ

    • సీఐడీ ఛార్జ్‌షీట్‌పై ప్రెస్‌మీట్‌ పెట్టనున్న జెత్వానీ

  • Jul 21, 2026 06:55 IST

    స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

    • రూ.1,43,470కి చేరిన 24 క్యారెట్ల 10గ్రా. బంగారం

    • రూ.1,31,510కి చేరిన 22 క్యారెట్ల 10గ్రా. పసిడి

    • రూ.2,34,900 వద్ద ట్రేడ్ అవుతున్న కిలో వెండి రేటు

  • Jul 21, 2026 06:49 IST

    నేడు తెలంగాణ హైకోర్టులో హైడ్రా కేసు విచారణ

    • హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ వ్యవహారంపై విచారణ

    • డివిజన్‌ బెంచ్‌ ఆర్డర్‌ ఉన్నా హైడ్రా జోక్యంపై విచారణ

    • పిటిషనర్‌పై FIR అంశాన్ని పరిశీలించనున్న హైకోర్టు

  • Jul 21, 2026 06:49 IST

    హైదరాబాద్‌: నేటి నుంచి ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు

    • ఆగస్టు 10 వరకు కొనసాగనున్న దరఖాస్తుల ప్రక్రియ

    • క్యూర్‌ పరిధిలోని పేదల కోసం పథకం ప్రారంభం

    • రూ.6 లక్షల కంటే తక్కువ ఆదాయం కలిగిన వారు అర్హులు

    • ఒక కుటుంబం నుంచి ఒకరికి మాత్రమే దరఖాస్తుకు అనుమతి

    • క్యూర్‌ పరిధిలో పదేళ్లు నివాసమున్న వారికి అవకాశం

  • Jul 21, 2026 06:48 IST

    నేడు రెండో రోజు పార్లమెంట్‌ సమావేశాలు

    • నీట్ లీకేజీపై ప్రతిపక్షాల ఆందోళనలు కొనసాగే అవకాశం

    • సుప్రీంకోర్టు జడ్జిల సంఖ్య పెంపు బిల్లు ప్రతిపాదన

    • రాజ్యసభలో వందేమాతరం బిల్లు ప్రవేశపెట్టే అవకాశం

    • మహిళా రిజర్వేషన్‌, డీలిమిటేషన్‌పై చర్చకూ ఛాన్స్‌

    • సభలో కేంద్రాన్ని నిలదీయాలని ఇండియా కూటమి నిర్ణయం

  • Jul 21, 2026 06:46 IST

    నేడు జనసేన సీనియర్‌ నేతలతో పవన్‌కల్యాణ్‌ సమావేశం

    • ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించనున్న పవన్‌

  • Jul 21, 2026 06:46 IST

    నేడు రెండో రోజు యాదగిరిగుట్టలో పాశుపత వరుణ యాగం

    • రామలింగేశ్వర స్వామి ఆలయంలో యాగం నిర్వహణ

    • రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని యాగం

    • ఈ నెల 23 వరకు కొనసాగనున్న పాశుపత వరుణ యాగం

  • Jul 21, 2026 06:45 IST

    హైదరాబాద్‌: నేడు బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం

    • ఉదయం నుంచే పూజా కార్యక్రమాల ప్రారంభం

  • Jul 21, 2026 06:45 IST

    నేడు మంచిర్యాల జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ పర్యటన

    • లక్షెట్టిపేటలో మృతిచెందిన నలుగురు రైతుల కుటుంబాలను పరామర్శించనున్న కేటీఆర్‌

    • తర్వాత BRS కార్యకర్తల సమావేశానికి హాజరు

  • Jul 21, 2026 06:44 IST

    పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం

    • తెలంగాణలో నేడు పలు జిల్లాలకు వర్ష సూచన

    • పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం

  • Jul 21, 2026 06:43 IST

    ఇంగ్లండ్‌ ఫుట్‌బాల్‌ లెజెండ్‌ కెవిన్‌ కీగన్‌(75) కన్నుమూత

    • స్టేజ్‌-4 క్యాన్సర్‌తో మరణించినట్లు న్యూకాసల్‌ క్లబ్‌ వెల్లడి

  • Jul 21, 2026 06:38 IST

    ఢిల్లీ: భారత్‌ బ్యాంకులకు పశ్చిమాసియా సెగ

    • మందగించిన విదేశీ కరెన్సీ డిపాజిట్లు

    • బ్యాంకుల్లోని విదేశీ కరెన్సీ నాన్‌-రెసిడెంట్‌ డిపాజిట్ల సమీకరణపై తీవ్ర ప్రభావం

  • Jul 21, 2026 06:36 IST

    దేశంలో నాలుగు కోట్ల డౌన్‌లోడ్‌ మార్క్‌ దాటిన కొత్త ఆధార్ యాప్‌

    • కొత్త ఆధార్‌ యాప్‌లో ఫేస్‌ ఐడీ వెరిఫికేషన్‌ సేవలు

    • ఆధార్‌ వివరాల ఉచిత అప్‌డేట్‌కు UIDAI అవకాశం