ప్రధాని మోదీ నివాసం దగ్గర రాహుల్ ధర్నా
ABN , Publish Date - Jul 21 , 2026 | 04:23 PM
భారత ప్రధాని నరేంద్ర మోదీ నివాసం దగ్గర కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధర్నా చేపట్టారు. నిన్న( సోమవారం) జంతర్‌మంతర్ వద్ద నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై ఆందోళన చేస్తున్న విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్‌కు నిరసనగా చేపట్టిన ఈ ధర్నాలో రాహుల్‌తో పాటు ఖర్గే, కేసీ, ప్రియాంక, పలువురు కాంగ్రెస్ ఎంపీలు పాల్గొన్నారు.
ఇంటర్‌నెట్ డెస్క్: భారత ప్రధాని నరేంద్ర మోదీ నివాసం దగ్గర కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధర్నా చేపట్టారు. నిన్న( సోమవారం) జంతర్‌మంతర్ వద్ద నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై ఆందోళన చేస్తున్న విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్‌కు నిరసనగా చేపట్టిన ఈ ధర్నాలో రాహుల్‌తో పాటు ఖర్గే, కేసీ, ప్రియాంక, పలువురు కాంగ్రెస్ ఎంపీలు పాల్గొన్నారు. కాంగ్రెస్ నేతలు చేతులకు సంకెళ్లు వేసుకుని నిరసన తెలుపుతున్నారు.
గూండాగిరి, నిరంకుశత్వం వద్దంటూ.. అణచివేత చర్యలు నడవవంటూ నిరసనకారులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రధాని మోదీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ నేతలను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన చేస్తుంటే పోలీసులు దౌర్జన్యం చేస్తున్నారంటూ కాంగ్రెస్ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రధాని మోదీ రాజీనామా చేయాలి: రాహుల్
ధర్నా సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. నిన్న యువతపై లాఠీచార్జ్‌కు బాధ్యత వహిస్తూ ప్రధాని మోదీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీట్ లీకేజీపై పార్లమెంట్‌లో చర్చకు అంగీకరించలేదని అన్నారు. ఎన్‌డీఏ ప్రభుత్వంలో జవాబుదారీతనం లేదని పేర్కొన్నారు. ప్రధాని మోదీ మౌనం వీడాలని, నీట్ అంశంపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి
అప్పుడు రోహిత్ శర్మ చెప్పిన మాటలు నమ్మలేదు: సంజు శాంసన్