మాజీ స్పీకర్ తమ్మినేనికి హైకోర్టులో షాక్.. క్వాష్ పిటిషన్ కొట్టివేత
ABN , Publish Date - Jul 21 , 2026 | 07:12 PM
ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ తమ్మినేని దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు తిరస్కరించింది.
అమరావతి: మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ తమ్మినేని దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. కేసు దర్యాప్తు ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని పేర్కొన్న న్యాయస్థానం.. ఈ దశలో జోక్యం చేసుకోవడం సరికాదని స్పష్టం చేసింది. అరెస్టు భయం ఉంటే ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని సూచించింది. ఈ కేసుకు సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను జులై 29కి వాయిదా వేసింది.
కేసు వివరాలు
నకిలీ పత్రాలను ఉపయోగించి సుమారు రూ.4 కోట్ల విలువైన భూమిని తన కుమారుడి పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకున్నారనే ఆరోపణలతో తమ్మినేనిపై కేసు నమోదైంది. ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో కేసును రద్దు చేయాలని కోరుతూ తమ్మినేని హైకోర్టును ఆశ్రయించారు. అయితే కేసు ప్రాథమిక దశలో ఉన్నందున క్వాష్ చేయడానికి నిరాకరించిన హైకోర్టు.. చట్టపరమైన మార్గాలను అనుసరించాలని సూచించింది.
Also Read:
రాహుల్ మాట తప్పారు.. కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ ఆగ్రహం..
షూటింగ్‌లో గాయపడిన బాలకృష్ణకు సీఎం చంద్రబాబు పరామర్శ