Share News

షూటింగ్‌లో గాయపడిన బాలకృష్ణకు సీఎం చంద్రబాబు పరామర్శ

ABN , Publish Date - Jul 21 , 2026 | 05:49 PM

సినిమా షూటింగ్‌లో గాయపడిన నందమూరి బాలకృష్ణను సీఎం చంద్రబాబు నాయుడు ఫోన్‌లో పరామర్శించారు. ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే బాలకృష్ణకు సీఎం చంద్రబాబు ఫోన్ చేశారు.

షూటింగ్‌లో గాయపడిన బాలకృష్ణకు సీఎం చంద్రబాబు పరామర్శ
AP CM Chandrababu

అమరావతి, జులై 21: సినిమా షూటింగ్‌లో గాయపడిన నందమూరి బాలకృష్ణను సీఎం చంద్రబాబు నాయుడు ఫోన్‌లో పరామర్శించారు. ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే బాలకృష్ణకు సీఎం చంద్రబాబు ఫోన్ చేశారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ ఖాతా వేదికగా పోస్ట్ చేశారు. ‘చిత్రీకరణ సమయంలో నందమూరి బాలకృష్ణకు గాయమైందన్న విషయం తెలుసుకుని వారితో మాట్లాడాను. వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. వారి అచంచలమైన సంకల్పబలం దృష్ట్యా, వారు అతి త్వరలోనే తిరిగి పనిలో నిమగ్నమవుతారని నాకు నమ్మకం ఉంది! త్వరగా కోలుకోండి!’ అని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు.


బాలా మావయ్య త్వరగా కోలుకోవాలి: నారా లోకేశ్

కాకినాడలో సినిమా షూటింగ్‍లో గాయపడిన నందమూరి బాలకృష్ణను మంత్రి నారా లోకేశ్ ఫోన్‌లో పరామర్శించారు. ఈ మేరుకు ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. బాలా మావయ్య త్వరగా కోలుకుని, యథావిధిగా షూటింగ్‌లో పాల్గొంటారని ఆకాంక్షిస్తున్నాను.. అని నారా లోకేశ్ పేర్కొన్నారు.


బాలా బాబాయ్ త్వరగా కోలుకోండి: జూ. ఎన్టీఆర్

సినిమా షూటింగ్‌లో నందమూరి బాలకృష్ణ గాయపడిన విషయం తెలియగానే.. హీరో జూనియర్ ఎన్టీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘ బాలా బాబాయ్, త్వరగా కోలుకోండి. మీరు త్వరగా ఆరోగ్యవంతులు కావాలని ఆకాంక్షిస్తున్నాను. మీరు పూర్తి ఉత్సాహంతో తిరిగి పుంజుకోవడం చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను..’ అని జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు.

Updated Date - Jul 21 , 2026 | 06:15 PM