రాహుల్ మాట తప్పారు.. కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ ఆగ్రహం..
ABN , Publish Date - Jul 21 , 2026 | 06:44 PM
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నీట్‌పై పార్లమెంట్‌లో చర్చకు సంబంధించిన విషయంలో రాహుల్ మాట తప్పారంటూ మండిపడ్డారు.
ఇంటర్‌నెట్ డెస్క్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నీట్‌పై పార్లమెంట్‌లో చర్చకు సంబంధించిన విషయంలో రాహుల్ మాట తప్పారంటూ మండిపడ్డారు. రాహుల్ మాట తప్పడం.. కొత్తగా రెండు డిమాండ్లు పెట్టడం సరికాదని అన్నారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం జితేంద్ర సింగ్ తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు.
ఆ పోస్టులో.. ‘హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్‌తో కలిసి చర్చలు జరిపాం. నీట్‌పై పార్లమెంట్‌లో చర్చించాలని రాహుల్ డిమాండ్ చేశారు. చర్చకు సిద్ధమని ప్రభుత్వం ప్రకటించింది. మొదట అంగీకరించి రాహుల్ మాట తప్పారు. మళ్లీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతున్నారు. కొత్తగా రెండు డిమాండ్లు పెట్టడం.. మాట తప్పడం సరికాదు’ అని పేర్కొన్నారు.
అంతకు ముందు.. ప్రధాని నరేంద్ర మోదీ ఇంటి దగ్గర ధర్నా చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దగ్గరకు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ వెళ్లారు. రాహుల్ గాంధీతో ఆయన చర్చలు జరిపారు. రాహుల్‌కు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. ఆందోళన విరమించాలని కోరారు.
ఇవి కూడా చదవండి
తెలంగాణలో రేపు ఓలా, ఉబర్, ర్యాపిడో డ్రైవర్ల సమ్మె
వైభవ్ సూర్యవంశీ ప్రత్యేకమైన ప్లేయర్.. జాగ్రత్తగా తీర్చిదిద్దాలి: సికందర్ రజా