తెలంగాణలో రేపు ఓలా, ఉబర్, ర్యాపిడో డ్రైవర్ల సమ్మె
ABN , Publish Date - Jul 21 , 2026 | 06:42 PM
తెలంగాణలో ఓలా, ఉబర్, ర్యాపిడో డ్రైవర్లు రేపు (బుధవారం) సమ్మెకు సిద్ధమయ్యారు. కార్మిక హక్కులు, సామాజిక భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసన చేపట్టనున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: తెలంగాణలో ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి క్యాబ్, బైక్ ట్యాక్సీ సేవల డ్రైవర్లు రేపు (బుధవారం) సమ్మెకు సిద్ధమయ్యారు. కార్మిక హక్కులు, సామాజిక భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ డ్రైవర్లు ఈ నిరసన చేపట్టనున్నారు.
తమ సమస్యలను పరిష్కరించకపోతే ఆగస్టు 8 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని డ్రైవర్ల సంఘాలు హెచ్చరించాయి. ఈ సమ్మెకు మద్దతుగా ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్ రంగాల్లో పనిచేస్తున్న స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, జెప్టో డెలివరీ భాగస్వాములు కూడా నిరసనలో పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది.
Also Read:
ఫ్రిజ్ లేకుండానే టమోటాలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలా?
ఈ తేదీల్లో పుట్టినవారిది రాజసమైన వ్యక్తిత్వం..!