Share News

వైభవ్ సూర్యవంశీ ప్రత్యేకమైన ప్లేయర్.. జాగ్రత్తగా తీర్చిదిద్దాలి: సికందర్ రజా

ABN , Publish Date - Jul 21 , 2026 | 06:22 PM

భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా ప్రశంసల వర్షం కురింపించాడు. ఈ 15 ఏళ్ల ప్లేయర్‌ను జాగ్రత్తగా తీర్చిదిద్దితే భవిష్యత్తులో తరతరాలకు గుర్తిండేపోయే క్రికెటర్‌గా ఎదుగుతాడని అభిప్రాయపడ్డాడు.

వైభవ్ సూర్యవంశీ ప్రత్యేకమైన ప్లేయర్.. జాగ్రత్తగా తీర్చిదిద్దాలి: సికందర్ రజా
Sikandar Raza

ఇంటర్నెట్ డెస్క్: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా ప్రశంసల వర్షం కురింపించాడు. ఈ 15 ఏళ్ల ప్లేయర్‌ను జాగ్రత్తగా తీర్చిదిద్దితే భవిష్యత్తులో తరతరాలకు గుర్తిండేపోయే క్రికెటర్‌గా ఎదుగుతాడని అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో వైభవ్ అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. వరుసగా మూడు మ్యాచుల్లోనూ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. అయితే జులై 23 నుంచి టీమిండియా జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. అక్కడ మూడు టీ20లు ఆడనుంది. ఈ క్రమంలో సికందర్ రజా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


‘వైభవ్ సూర్యవంశీ అత్యంత ప్రతిభావంతుడైన క్రికెటర్. కేవలం 15 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న ఆటగాడిని రెండు, మూడు మ్యాచ్‌ల తర్వాతే విమర్శించడం సరైంది కాదు. అతడి చుట్టూ ఎంతో మంది అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉన్నారు. అతడిని సరైన విధంగా మార్గనిర్దేశం చేసి తీర్చిదిద్దితే వైభవ్ తరతరాలకు గుర్తుండిపోయే గొప్ప ఆటగాడిగా మారగలడు. గతేడాది అతడు సాధించిన విజయాలు, అండర్-19 స్థాయిలో భారత్ తరఫున చేసిన ప్రదర్శన, అదే వయసులో అంతర్జాతీయ అరంగేట్రం చేయడం.. ఇవన్నీ చిన్న విషయాలు కావు. ఇలాంటి కథలు ఇప్పుడు చాలా అరుదుగా వినిపిస్తాయి. వైభవ్ ప్రత్యేకమైన ఆటగాడు. అతడిని ఎలా నడిపిస్తారనేదే చాలా ముఖ్యం’ అని రజా వెల్లడించాడు.


ఇవి కూడా చదవండి:

అర్జెంటీనా డ్రెస్సింగ్ రూమ్‌లో అసలేం జరిగింది? మెస్సి వీడియో వైరల్

హాకీ ప్రపంచ కప్: భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ సింగ్

Updated Date - Jul 21 , 2026 | 06:50 PM