అర్జెంటీనా డ్రెస్సింగ్ రూమ్‌లో అసలేం జరిగింది? మెస్సి వీడియో వైరల్
ABN , Publish Date - Jul 21 , 2026 | 02:48 PM
న్యూయార్క్ వేదికగా స్పెయిన్‌తో జరిగిన ఫిఫా ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌కు ముందు అర్జెంటీనా డ్రెస్సింగ్ రూమ్‌కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: న్యూయార్క్ వేదికగా స్పెయిన్‌పై జరిగిన ఫిఫా ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌కు ముందు అర్జెంటీనా డ్రెస్సింగ్ రూమ్‌కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో జట్టు కెప్టెన్ లియోనెల్ మెస్సి.. సహచర ఆటగాళ్లను శాంతింపజేస్తున్నట్లు కనిపించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. ఫైనల్‌లో స్పెయిన్‌పై 1-0 తేడాతో ఓడిన అర్జెంటీనా.. రన్నర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అద్భుత ప్రదర్శనతో ఫైనల్ వరకు దూసుకొచ్చిన ఆ జట్టు.. స్పెయిన్‌పై మాత్రం పూర్తిగా తడబడింది. మ్యాచ్ మొత్తం అర్జెంటీనా ఒక్క గోల్ కూడా చేయలేకపోవడం, గోల్డెన్ బూట్ రేసులో కొనసాగుతూ వచ్చిన మెస్సి ఏమాత్రం ప్రభావం చూపకపోవడం గమనార్హం.
ఈ పరిణామాల నేపథ్యంలో నెట్టింట ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. అందులో మెస్సి సహచర ఆటగాళ్లతో మాట్లాడుతున్నాడు. ‘అందరూ ప్రశాంతంగా ఉండండి. జరిగినదాన్ని మర్చిపోండి. ఇప్పుడు ఆట గురించే ఆలోచిద్దాం. కేవలం మ్యాచ్‌పైనే దృష్టి పెట్టండి’ అంటూ వారిని శాంతింపజేస్తూ ధైర్యం చెబుతున్నట్లు కనిపించింది. దీంతో ఫైనల్ మ్యాచ్ ప్రారంభానికి ముందే జట్టులో ఏదో అనుకోని ఘటన జరిగి ఉండొచ్చన్న ఊహాగానాలు సోషల్ మీడియాలో జోరందుకున్నాయి. అయితే ఏం జరిగిందనే విషయంపై ఇప్పటివరకు అర్జెంటీనా ఫుట్‌బాల్ అసోసియేషన్ (AFA), జట్టు యాజమాన్యం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఇవి కూడా చదవండి:
స్పెయిన్, అర్జెంటీనా ఆటగాళ్ల మధ్య ఘర్షణ.. దర్యాప్తు చేపట్టిన ఫిఫా
స్వదేశానికి చేరుకున్న అర్జెంటీనా ఫుట్‌బాల్ ప్లేయర్లు.. మెస్సి మాత్రం!