నేటి నుంచే 'ది హండ్రెడ్' సమరం... పూర్తి వివరాలు ఇవే!
ABN , Publish Date - Jul 21 , 2026 | 01:45 PM
క్రికెట్ అభిమానులను అలరించేందుకు ప్రముఖ లీగ్స్‌లో ఒకటైన 'ది హండ్రెడ్ 2026' మళ్లీ వచ్చేసింది. ఇంగ్లండ్ వేదికగా నేటి (మంగళవారం) నుంచి పురుషుల టోర్నీ ఘనంగా ప్రారంభం కానుంది.
స్పోర్ట్స్ డెస్క్: క్రికెట్ అభిమానులను అలరించేందుకు ప్రముఖ లీగ్స్‌లో ఒకటైన 'ది హండ్రెడ్ 2026' మళ్లీ వచ్చేసింది. ఇంగ్లండ్ వేదికగా నేటి (మంగళవారం) నుంచి పురుషుల టోర్నీ ఘనంగా ప్రారంభం కానుంది. లండన్‌లోని ప్రసిద్ధ 'ది ఓవల్' మైదానంలో జరగనున్న తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఎంఐ లండన్ (MI London), సన్‌రైజర్స్ లీడ్స్ (Sunrisers Leeds) జట్టుతో తలపడనుంది. గత సీజన్‌లో 'ఓవల్ ఇన్విన్సిబుల్స్' పేరుతో బరిలోకి దిగి ట్రెంట్ రాకెట్స్‌పై నెగ్గి టైటిల్ కైవసం చేసుకున్న ఎంఐ లండన్.. ఈసారి కూడా అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది.
సామ్ కరన్ కెప్టెన్ గా ఉన్న ఎంఐ లండన్ జట్టులో ట్రెంట్ బౌల్ట్, రషీద్ ఖాన్, నికోలస్ పూరన్ వంటి టి20 దిగ్గజాలు ఉన్నారు. మరోవైపు జ్యాక్ క్రాలీ సారథ్యంలో హ్యారీ బ్రూక్, మిచెల్ మార్ష్, హెన్రీ నికోల్స్ వంటి స్టార్లతో సన్ రైజర్స్ లీడ్స్ కూడా తొలి మ్యాచ్‌లోనే బోణీ కొట్టాలని పట్టుదలతో ఉంది. మొత్తం 8 జట్లు పాల్గొంటున్న ఈ మెగా టోర్నమెంట్ ఆగస్టు 16న జరిగే తుది పోరుతో ముగియనుంది. బర్మింగ్‌హామ్ ఫోనిక్స్, లండన్ స్పిరిట్, మాంచెస్టర్ సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ లీడ్స్, ఎంఐ లండన్, సదరన్ బ్రేవ్, ట్రెంట్ రాకెట్స్, వెల్ష్ ఫైర్ జట్లు టైటిల్ కోసం పోటీ పడనున్నాయి.
ది హండ్రెడ్ 2026 షెడ్యూల్:
ఎక్కడ చూడవచ్చు?:
భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్‌లను జియో హాట్‌స్టార్ (JioHotstar) యాప్, వెబ్‌సైట్‌లో లైవ్ స్ట్రీమింగ్ ద్వారా వీక్షించవచ్చు. టీవీ వీక్షకుల కోసం స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. 100 బంతుల ఈ ధనాధన్ పోరులో ఏ జట్టు విజేతగా నిలుస్తుందో చూడాలి.
ఇవి కూడా చదవండి:
స్పెయిన్, అర్జెంటీనా ఆటగాళ్ల మధ్య ఘర్షణ.. దర్యాప్తు చేపట్టిన ఫిఫా
స్వదేశానికి చేరుకున్న అర్జెంటీనా ఫుట్‌బాల్ ప్లేయర్లు.. మెస్సి మాత్రం!