Share News

స్పెయిన్, అర్జెంటీనా ఆటగాళ్ల మధ్య ఘర్షణ.. దర్యాప్తు చేపట్టిన ఫిఫా

ABN , Publish Date - Jul 21 , 2026 | 01:24 PM

ఫిఫా ప్రపంచ కప్ 2026 ఫైనల్ మ్యాచ్‌ అనంతరం అర్జెంటీనా, స్పెయిన్ ఆటగాళ్ల మధ్య మైదానంలో గొడవ జరిగింది. ఈ ఘటనపై స్పందించిన ఫిపా దర్యాప్తు చేపట్టింది.

స్పెయిన్, అర్జెంటీనా ఆటగాళ్ల మధ్య ఘర్షణ.. దర్యాప్తు చేపట్టిన ఫిఫా
FIFA World Cup 2026

స్పోర్ట్స్ డెస్క్: ఫిఫా ప్రపంచ కప్ 2026 ఫైనల్ మ్యాచ్‌ అనంతరం స్పెయిన్, అర్జెంటీనా ఆటగాళ్ల మధ్య మైదానంలో గొడవ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఫిఫా నిర్వాహకులు స్పందించారు. ఇరుజట్ల మధ్య జరిగిన ఘర్షణపై దర్యాప్తు చేస్తున్నట్లు ఫిఫా తెలిపింది. ఫిఫా క్రమశిక్షణా నియమావళి నిబంధనలు ఉల్లంఘించిన ఆటగాళ్లపై దర్యాప్తు కోసం క్రమశిక్షణా, ఎథిక్స్‌ ప్రాసిక్యూటర్‌ను నియమించామని ఒక ప్రకటనలో తెలిపింది. విచారణ పూర్తైన తర్వాత వివరాలను బహిర్గతం చేస్తామని వెల్లడించింది. దర్యాప్తు ముగింపు కోసం ఎటువంటి కాలపరిమితిని విధించలేదు.


ఫిఫా ప్రపంచ కప్‌లో వరుసగా రెండోసారి విజేతగా నిలవాలని భావించిన డిఫెండింగ్ అర్జెంటీనాకు స్పెయిన్ షాక్ ఇచ్చింది. న్యూయార్క్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో 1-0 తేడాతో ఓడించింది. మ్యాచ్ అనంతరం స్పెయిన్ ఆటగాళ్లు సంబరాలు చేసుకుంటుండగా.. అర్జెంటీనా ప్లేయర్ లియాండ్రో పరెడెస్‌ కాస్త దూరుసుగా ప్రవర్తించాడు. స్పెయిన్ ప్లేయర్లు ఎరిక్ గార్సియా, గావిలపైకి దూసుకెళ్లాడు. వారిని అసభ్య పదజాలంతో దూషించడంమే కాకుండా కొట్టేందుకూ యత్నించాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అర్జెంటీనా కోచ్ లియోనెల్ స్కాలోని ఆటగాళ్లను శాంతపరచడానికి ప్రయత్నించారు.


ఇవి కూడా చదవండి...

ప్రతిభ గల విద్యార్థులకు ప్రత్యేక ప్రోత్సాహం: మంత్రి పొన్నం ప్రభాకర్

‘ఐసీయూలో కృష్ణారెడ్డికి చికిత్స’.. హెల్త్ బులెటిన్ విడుదల

Updated Date - Jul 21 , 2026 | 01:27 PM