‘ఐసీయూలో కృష్ణారెడ్డికి చికిత్స’.. హెల్త్ బులెటిన్ విడుదల
ABN , Publish Date - Jul 21 , 2026 | 11:37 AM
లైంగిక వేధింపుల ఆరోపణలతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
హైదరాబాద్, జులై 21: లైంగిక వేధింపుల ఆరోపణలతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈరోజు(మంగళవారం) ఉదయం.. ఉదయ్ కృష్ణారెడ్డి ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదలైంది. ఐసీయూలో కృష్ణారెడ్డి చికిత్స పొందుతున్నారని.. స్పృహలోనే ఉన్నట్లు జయంతి ఆస్పత్రి వైద్యులు తెలిపారు. మాట్లాడగలిగే స్థితిలో ఉన్నట్లు చెప్పారు. ‘మా వైద్య బృందం ఎప్పటికప్పుడు వైటల్స్‌ను పర్యవేక్షిస్తున్నారు. అవసరమైన పరీక్షలు, చికిత్స కొనసాగిస్తున్నాం. మల్టీ డిసిప్లినరీ మెడికల్ టీమ్ నిరంతర పర్యవేక్షణ చేస్తోంది’ అని జయంతి ఆస్పత్రి వైద్యులు పేర్కొన్నారు.
కృష్ణారెడ్డి బాడీలో పాయిజన్ కంటెంట్ లేదు: డాక్టర్
ఉదయ్ కృష్ణారెడ్డి ఆరోగ్య పరిస్థితిపై జయంతి హాస్పిటల్ డాక్టర్ రవిశంకర్ రెడ్డి ‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ.. ‘ఉదయ్ కృష్ణారెడ్డి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.. ఆయన స్పృహలోకి వచ్చారు. ఆహారం తీసుకోకపోవటం, మోతాదుకు మించి ఆల్కహాల్ తీసుకోవడం వల్ల స్పృహ కోల్పోయారని అనుకుంటున్నాం. ఆయన బాడీలో ఎక్కడా పాయిజన్ కంటెంట్ లేదు. రక్త పరీక్షల్లో ఆల్కహాల్ మాత్రమే ఉన్నట్టు కనిపిస్తోంది. రేపు ఉదయం డిశ్చార్జ్ చేస్తాం. గొంతు నొప్పిగా ఉందని చెబుతున్నారు, మింగడానికి కష్టంగా ఉందని అంటున్నారు. స్పృహలోకి వచ్చాక మాట్లాడించాం. సూసైడ్ అటెంప్ట్ చేయలేదని ఉదయ్ చెబుతున్నారు. తాగిన మత్తులో ఏదైనా జరిగి ఉండొచ్చేమో అంటున్నారు. సూసైడ్ నోట్ రాసినట్టు నాకు గుర్తు లేదని చెప్పారు. తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉండటం వల్ల ఆల్కహాల్ మత్తులో నోట్ రాసి ఉండొచ్చని చెబుతున్నారు’ అని డాక్టర్ రవిశంకర్ రెడ్డి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
మంత్రాలయం రాఘవేంద్రస్వామి దర్శనం కోసం వెళ్తుండగా రోడ్డు ప్రమాదం
ప్రతిభ గల విద్యార్థులకు ప్రత్యేక ప్రోత్సాహం: మంత్రి పొన్నం ప్రభాకర్
Read Latest Telangana News And Telugu News