జీవో నం.3 పునరుద్ధరణకు సీఎం చంద్రబాబు సానుకూలం: మంత్రి సంధ్యారాణి
ABN , Publish Date - Jul 21 , 2026 | 11:08 AM
సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు గిరిజనుల సమస్యల పరిష్కారానికి జులై 22న సమావేశం నిర్వహించాలని అధికారులకు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆదేశాలు జారీ చేశారు. జీవో నం.3 పునరుద్ధరణకు ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నారని మంత్రి తెలిపారు.
అమరావతి, జులై 21: సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు గిరిజనుల సమస్యల పరిష్కారానికి రేపే(జులై 22న) సమావేశం నిర్వహించాలని అధికారులకు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆదేశాలు జారీ చేశారు. గిరిజనుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సమష్టిగా నిర్ణయం తీసుకోవాలని పిలుపునిచ్చారు. జీవో నం.3 పునరుద్ధరణకు ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నారని మంత్రి తెలిపారు. 1/70 చట్టంతో పాటు అన్ని గిరిజన సమస్యలపై ముఖ్యమంత్రికి పూర్తి అవగాహన ఉందన్నారు. జీవో నం.3 పునరుద్ధరణ కోసం న్యాయ నిపుణులు, గిరిజన సంఘాల నాయకులతో పలుమార్లు సంప్రదింపులు నిర్వహించినట్లు చెప్పారు. అన్ని ఐటీడీఏల పరిధిలో గిరిజన ప్రతినిధులు, సంఘాల అభిప్రాయాలను ప్రభుత్వం సేకరించిందన్నారు.
గిరిజనులకు 50 ఏళ్లకే పెన్షన్, విద్య, వైద్యం, ఐటీడీఏల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి వెల్లడించారు. 1/70 చట్టం గిరిజనుల హక్కు అని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తూచా తప్పకుండా అమలు చేస్తున్నాయన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో బాక్సైట్‌కు గత వైసీపీ ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని అన్నారు. కూటమి ప్రభుత్వం బాక్సైట్ తవ్వకాలపై అనుమతులు నిలిపివేస్తూ గిరిజనుల ప్రయోజనాలను కాపాడుతోందన్నారు. గిరిజన బిడ్డల భవిష్యత్తు, సంక్షేమంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతరం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని తెలిపారు. అసత్య ప్రచారాలను నమ్మవద్దని.. గిరిజనులకు అండగా నిలిచేది చంద్రబాబు, కూటమి ప్రభుత్వమే అని మంత్రి సంధ్యారాణి స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి...
ప్రతిభ గల విద్యార్థులకు ప్రత్యేక ప్రోత్సాహం: మంత్రి పొన్నం ప్రభాకర్
ములుగును ముంచెత్తిన వాన!.. 7.66 సెం.మీ. సగటు వర్షపాతం నమోదు
Read Latest AP News And Telugu News