ప్రతిభ గల విద్యార్థులకు ప్రత్యేక ప్రోత్సాహం: మంత్రి పొన్నం ప్రభాకర్
ABN , Publish Date - Jul 21 , 2026 | 09:38 AM
ఆగస్టు 30లోగా అన్ని బీసీ గురుకుల విద్యాసంస్థల్లో తనిఖీలు పూర్తి చేయాలని అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఆర్‌సీవో వారానికి మూడు రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు.
హైదరాబాద్, జులై 21: ఆగస్టు 30లోగా అన్ని బీసీ గురుకుల విద్యాసంస్థల్లో తనిఖీలు పూర్తి చేయాలని అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు(మంగళవారం) ఉదయం బీసీ గురుకుల రీజనల్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్‌లతో(ఆర్‌సీవో) మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి ఆర్‌సీవో వారానికి మూడు రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు. ప్రతి వారం కనీసం ఆరు గురుకుల విద్యాసంస్థలను సందర్శించాలని చెప్పారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు సురక్షిత వాతావరణం కల్పించాలని ఆదేశించారు. సొంత భవనాలు లేని గురుకులాలకు భూముల సేకరణ వేగవంతం చేయాలన్నారు.
అద్దె భవనాల నిధుల్లో ఆరు శాతం మరమ్మతులకు వినియోగించాలని మంత్రి తెలిపారు. ప్రతి గురుకులంలో రెయిన్‌వాటర్ హార్వెస్టింగ్ తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించారు. ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు జరగకుండా ఆహార నాణ్యతపై ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. విద్యార్థులకు సైకాలజిస్టులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. చదువుతో పాటు క్రీడలు, కళలు, వ్యక్తిత్వ వికాసానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ప్రతిభ గల విద్యార్థులకు ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తోందన్నారు.
ప్రతి నెల కనీసం 15 గురుకులాల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తామని మంత్రి చెప్పారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యాన్ని ఏమాత్రం సహించమన్నారు. మూసీ గురుకులానికి సొంత భవనం నిర్మాణానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులతో విస్తృతంగా మొక్కలు నాటించి సంరక్షణ బాధ్యత కూడా అప్పగించాలని బీసీ గురుకుల ఆర్‌సీవోలకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలు జారీ చేశారు.
ఇవి కూడా చదవండి...
అస్సాంలో భారీ వర్షాలు, వరదలు.. 10 మంది మృతి..
మంత్రాలయం రాఘవేంద్రస్వామి దర్శనం కోసం వెళ్తుండగా రోడ్డు ప్రమాదం
Read Latest Telangana News And Telugu News