Share News

టూరిస్ట్ బస్సు, డీసీఎం ఢీ.. ఒకరి మృతి

ABN , Publish Date - Jul 21 , 2026 | 09:14 AM

ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలంలోని సూర్యాపేట క్రాస్ రోడ్డు వద్ద మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఒడిశా నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న టూరిస్ట్ బస్సు, నల్గొండ నుంచి పశ్చిమ గోదావరి జిల్లాకు చేపల వేట కోసం వెళ్తున్న మత్స్యకారుల డీసీఎంను ఢీకొట్టింది.

టూరిస్ట్ బస్సు, డీసీఎం ఢీ.. ఒకరి మృతి
Khammam Road Accident

ఖమ్మం జిల్లా, జులై 21 (ఆంధ్రజ్యోతి): ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలంలోని సూర్యాపేట క్రాస్ రోడ్డు వద్ద ఈరోజు (మంగళవారం) తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఒడిశా నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న టూరిస్ట్ బస్సు.. నల్గొండ నుంచి పశ్చిమగోదావరి జిల్లాకు చేపల వేట కోసం వెళ్తున్న మత్స్యకారుల డీసీఎంను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డీసీఎం డ్రైవర్ అక్కడికక్కడే దుర్మరణం చెందగా, ముగ్గురు మత్స్యకారులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, అత్యవసర సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


ప్రమాద తీవ్రత కారణంగా డీసీఎం ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. డీసీఎం డ్రైవర్ మెడ తెగిపోవడంతో ఘటనాస్థలంలోనే మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. గాయపడిన మత్స్యకారులను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. టూరిస్ట్ బస్సులో ఉన్న వారంతా సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు వాహనాలను మళ్లించి రాకపోకలను పునరుద్ధరించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేలా చూడాలి: ప్రధాని మోదీ

సీఎం రేవంత్‌రెడ్డి వార్నింగ్‌.. ఎమ్మెల్యేల అలర్ట్

పామాయిల్ ధర పెంపునకు మా ప్రభుత్వం కృషి చేస్తోంది: భట్టి విక్రమార్క

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jul 21 , 2026 | 09:40 AM