Share News

అస్సాంలో భారీ వర్షాలు, వరదలు.. 10 మంది మృతి..

ABN , Publish Date - Jul 21 , 2026 | 08:45 AM

అస్సాంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం స్తంభించింది. భారీ వానల కారణంగా ఇప్పటివరకు 10 మంది మృతిచెందగా, లక్షల మంది నిరాశ్రయులయ్యారు.

అస్సాంలో భారీ వర్షాలు, వరదలు.. 10 మంది మృతి..
Assam Floods

గౌహతి: అస్సాంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం స్తంభించింది. భారీ వానల కారణంగా ఇప్పటివరకు 10 మంది మృతిచెందగా, లక్షల మంది నిరాశ్రయులయ్యారు. వర్షాలకు అస్సాం రాష్ట్రవ్యాప్తంగా 16 జిల్లాల్లో 794 గ్రామాలు ప్రభావితమయ్యాయి. శివసాగర్, చరైడియో, జోర్హాట్, దిబ్రూఘర్, సోనిత్‌పూర్, బిస్వనాథ్, గోలాఘాట్, ధేమాజీ, తిన్‌సుకియా, నాగావ్, కర్బీ అంగ్లాంగ్, కాచర్, ఉదల్‌గురి, చిరాంగ్, కమ్‌రూప్, కమ్‌రూప్ (మెట్రో) జిల్లాలు ఎక్కువగా దెబ్బతిన్నాయి. ఆయా జిల్లాల్లో మొత్తం 3.62 లక్షల మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.


సహాయక బృందాలు రంగంలోకి దిగి బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. అధికారులు 101 సహాయక శిబిరాలను ఏర్పాటు చేసి నిరాశ్రయులకు ఆశ్రయం కల్పిస్తున్నారు. మరోవైపు భారీ వర్షాలతో నదులకు వరదనీరు పోటెత్తుతోంది. నేమతిఘాట్ వద్ద బ్రహ్మపుత్ర, చెనిమారి (ఖోవాంగ్) వద్ద బుర్హిదిహింగ్, నాంగ్లామురాఘాట్ వద్ద దిసాంగ్, నుమాలిగఢ్ వద్ద ధన్‌సిరి (దక్షిణ), శివసాగర్ వద్ద దిఖౌ నదులు ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాలకు వరదనీరు జనావాసాల్లోకి వచ్చింది. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే అనేక రోడ్లు దెబ్బతిన్నాయి.


ఈ వర్షాలకు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. దాదాపు 19,100 హెక్టార్లలో పంటలు నీట మునిగాయి. మరోవైపు, అస్సాంలోని కొన్ని ప్రాంతాల్లో మరింత వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ మేరకు చెరువులు, నదుల నీటిమట్టాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అలాగే ప్రమాదకర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎప్పటికప్పుడు అధికారుల సూచనలను పాటిస్తూ సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

గాల్లో కాల్పులు.. జువెల్లరీ షాపులో సినీ ఫక్కీ దోపిడీ.. వైరల్ వీడియో

సిక్కింలో కొండచరియలు విరిగిపడి 7 మంది మృతి

Updated Date - Jul 21 , 2026 | 09:18 AM