Share News

గంజాయి మత్తులో యువకుల బీభత్సం

ABN , Publish Date - Jul 21 , 2026 | 06:06 AM

తమిళనాడులోని సేలం జిల్లా ఎరుమపాళ్యం రహదారిలో గంజాయి మత్తులో భయాందోళనలు కలిగించేలా కారును నడిపిన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేశారు....

గంజాయి మత్తులో యువకుల బీభత్సం

  • కారు టైరు ఊడినా నిప్పులు చెరుగుతూ ముందుకే.. ఇద్దరి అరెస్టు

చెన్నై, జూలై 20(ఆంధ్రజ్యోతి): తమిళనాడులోని సేలం జిల్లా ఎరుమపాళ్యం రహదారిలో గంజాయి మత్తులో భయాందోళనలు కలిగించేలా కారును నడిపిన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. కారు టైరు ఊడిపోయినా పట్టించుకోకుండా వేగంగా వెళ్తున్న కారు, ఎగిసిపడుతున్న నిప్పు రవ్వల దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. మొదట ఓ కారును బలంగా ఢీకొట్టడంతో కారు టైరు పగిలి విడిపోయింది. అయినా కారును ఆపకుండా రిమ్ముతో వేగంగా ముందుకు వెశ్లారు. దీంతో రహదారిపై ఆ కారు నిప్పులు చెరుగుతూ సాగింది. కొద్ది దూరం పోయాక కారు ఆగిపోయింది. అప్పటికే కారును వెంబడించిన కొందరు ద్విచక్ర వాహనదారులు కారు వద్దకు వెళ్లారు. ఆలోగా కారులో ఉన్న ఇద్దరు యువకులు పారిపోయారు. మరో ఇరువురిని వాహనదారులు బంధించి పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో వారు సేలంకు చెందిన దీపక్‌ గురు, తిరుమురుగన్‌గా గుర్తించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పారిపోయిన ఇద్దరు యువకుల ఆచూకీ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

Updated Date - Jul 21 , 2026 | 06:06 AM