Share News

మంత్రాలయం రాఘవేంద్రస్వామి దర్శనం కోసం వెళ్తుండగా రోడ్డు ప్రమాదం

ABN , Publish Date - Jul 21 , 2026 | 08:29 AM

కర్నూలు జిల్లాలోని మంత్రాలయం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రాఘవేంద్రస్వామి దర్శనం కోసం రవిశెట్టి కుటుంబ సభ్యులతో బయలుదేరారు.

మంత్రాలయం రాఘవేంద్రస్వామి దర్శనం కోసం వెళ్తుండగా రోడ్డు ప్రమాదం
Kurnool Road Accident

కర్నూలు జిల్లా, జులై 21 (ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లాలోని మంత్రాలయం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రాఘవేంద్రస్వామి దర్శనం కోసం రవిశెట్టి (43) కుటుంబ సభ్యులతో బయలుదేరారు. ఈ క్రమంలో వారి కారు జాతీయ రహదారిపై అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రవిశెట్టి తన కుటుంబ సభ్యులతో కలిసి మంత్రాలయం రాఘవేంద్రస్వామి దర్శనానికి బయలుదేరారు. వారు ప్రయాణిస్తున్న కారు మంత్రాలయం సమీపంలో అదుపుతప్పి కల్వర్టును బలంగా ఢీకొట్టింది. ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండటంతో రవిశెట్టి అక్కడికక్కడే మృతిచెందాడు. కారులో ఉన్న మరో ముగ్గురు కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. ఈ ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషాద ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదానికి గురయ్యారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ఆగస్టు 1న ప్రధాని మోదీ భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారు: హోం మంత్రి అనిత

ఆ సమయంలో రూ.40ల జీతానికి పనిచేశా: మంత్రి నారాయణ

అంబటి రాంబాబుపై పరువు నష్టం దావా వేస్తా: గళ్లా మాధవి

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jul 21 , 2026 | 08:39 AM