Share News

ములుగును ముంచెత్తిన వాన!.. 7.66 సెం.మీ. సగటు వర్షపాతం నమోదు

ABN , Publish Date - Jul 21 , 2026 | 10:18 AM

ములుగు జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. జిల్లావ్యాప్తంగా సోమవారం నుంచి కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

ములుగును ముంచెత్తిన వాన!.. 7.66 సెం.మీ. సగటు వర్షపాతం నమోదు
Mulugu Rains

ములుగు, జులై 21: ములుగు జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. జిల్లావ్యాప్తంగా సోమవారం నుంచి కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించడంతో పలుచోట్ల వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జిల్లాలో సగటున 7.66 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వాజేడు, వెంకటాపురం మండలాల్లో గరిష్ఠంగా 11 సెం.మీ.కు పైగా వర్షపాతం నమోదైంది.


ఆయా చోట్ల మోస్తరు నుంచి భారీ వానలు కురవడంతో చెరువులు, కుంటలు, వాగులు నిండుకుండను తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని పర్యవేక్షిస్తూ చర్యలు చేపడుతున్నారు.


వరుస సంఖ్య

ప్రాంతం పేరు

వర్షపాతం(మి.మీ)

స్థాయి

1

వెంకటాపూర్

108.8

అత్యధికం

2

ములుగు

52.4

సాధారణం

3

గోవిందరావుపేట

72.8

అత్యధికం

4

తాడ్వాయి

52.2

సాధారణం

5

ఏటూరునాగారం

86.2

అత్యధికం

6

కన్నాయిగూడెం

38.4

సాధారణం

7

వాజేడు

112.6

అత్యధికం

8

వెంకటాపురం

110.6

అత్యధికం

9

మంగపేట్

50.0

సాధారణం

10

మల్లంపల్లి

81.8

అత్యధికం

మొత్తం

765.8

జిల్లా వ్యాప్తంగా సగటు వర్షపాతం

76.6


ఇవి కూడా చదవండి...

మంత్రాలయం రాఘవేంద్రస్వామి దర్శనం కోసం వెళ్తుండగా రోడ్డు ప్రమాదం

ప్రతిభ గల విద్యార్థులకు ప్రత్యేక ప్రోత్సాహం: మంత్రి పొన్నం ప్రభాకర్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 21 , 2026 | 12:32 PM