‘ఒకరిపైనే చర్యలు సరికాదు’.. ట్రైనీ ఐపీఎస్ అంశంపై మాజీ సీబీఐ డైరెక్టర్ నాగేశ్వరరావు
ABN , Publish Date - Jul 21 , 2026 | 01:00 PM
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అంశంపై మాజీ సీబీఐ డైరెక్టర్, రిటైర్డ్ ఐపీఎస్ నాగేశ్వరరావు స్పందించారు. ట్రైనీ ఐపీఎస్‌కు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎఫ్‌ఐఆర్ నమోదైన వెంటనే ఉదయ్ కృష్ణారెడ్డిని సస్పెన్షన్ చేయడం.. ప్రశ్నలు లేవనెత్తేలా ఉందన్నారు.
హైదరాబాద్, జులై 21: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అంశంపై మాజీ సీబీఐ డైరెక్టర్, రిటైర్డ్ ఐపీఎస్ నాగేశ్వరరావు స్పందించారు. ఉదయ్ కృష్ణారెడ్డికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ప్రేమ సంబంధం విఫలమైతే దానిని క్రిమినల్ కేసుగా మార్చొద్దని సూచించారు. నిష్పాక్షికంగా దర్యాప్తు జరగాలని సూచించారు. ఎఫ్‌ఐఆర్ నమోదైన వెంటనే ఉదయ్ కృష్ణారెడ్డిని సస్పెన్షన్ చేయడం.. ప్రశ్నలు లేవనెత్తేలా ఉందన్నారు.
పరస్పర అంగీకారంతో సంబంధం ఉంటే ఇద్దరికీ సమానంగా క్రమశిక్షణా చర్యలు ఉండాలని రిటైర్డ్ ఐపీఎస్ వ్యాఖ్యానించారు. ఒకరిపై మాత్రమే చర్యలు తీసుకోవడం సముచితం కాదని అభిప్రాయపడ్డారు. ఉదయ్ కృష్ణారెడ్డి సస్పెన్షన్‌ను పునఃసమీక్షించాలని కేంద్ర హోంశాఖకు విజ్ఞప్తి చేశారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు ఉదయ్‌కు శిక్షణ కొనసాగించే అవకాశం ఇవ్వాలన్నారు. నిష్పాక్షిక దర్యాప్తు జరిగేలా చూడాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్, తెలంగాణ డీజీపీకి విజ్ఞప్తి చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ జోక్యం చేసుకోవాలన్నారు. కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ వరకూ ఎదిగిన ఉదయ్ ప్రయాణం వేలాది యువతకు స్ఫూర్తిదాయకమని ఎక్స్‌లో మాజీ సీబీఐ డైరెక్టర్ నాగేశ్వరరావు పోస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి...
ప్రతిభ గల విద్యార్థులకు ప్రత్యేక ప్రోత్సాహం: మంత్రి పొన్నం ప్రభాకర్
‘ఐసీయూలో కృష్ణారెడ్డికి చికిత్స’.. హెల్త్ బులెటిన్ విడుదల
Read Latest Telangana News And Telugu News