Share News

ఢిల్లీలోని మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్‌కు సోనియా గాంధీ..

ABN , Publish Date - Jul 21 , 2026 | 09:34 PM

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నివాసం ముందు ఆందోళన చేసిన రాహుల్ గాంధీ.. కాంగ్రెస్, మిత్రపక్షాల ఎంపీలను పోలీసులు మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్‌కి తరలించారు. మందిర్ మార్గ్ పోలీసు స్టేషన్‌లో ఉన్న ఎంపీలను కలిసేందుకు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ వెళ్లారు.

ఢిల్లీలోని మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్‌కు సోనియా గాంధీ..
Rahul Gandhi protest

న్యూఢిల్లీ, జులై 21: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నివాసం ముందు ఆందోళన చేసిన రాహుల్ గాంధీ.. కాంగ్రెస్, మిత్రపక్షాల ఎంపీలను పోలీసులు మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్‌కి తరలించారు. మందిర్ మార్గ్ పోలీసు స్టేషన్‌లో ఉన్న ఎంపీలను కలిసేందుకు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ వెళ్లారు. అయితే, పోలీసులు సోనియాగాంధీని లోపలికి అనుమతించలేదు.


కాగా, భారత ప్రధాని నరేంద్ర మోదీ నివాసం దగ్గర కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధర్నా చేపట్టారు. నిన్న( సోమవారం) జంతర్‌మంతర్ వద్ద నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై ఆందోళన చేస్తున్న విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్‌కు నిరసనగా చేపట్టిన ఈ ధర్నాలో రాహుల్‌తో పాటు ఖర్గే, కేసీ, ప్రియాంక, పలువురు కాంగ్రెస్‌, మిత్ర పక్షాల ఎంపీలు పాల్గొన్నారు. కాంగ్రెస్ నేతలు చేతులకు సంకెళ్లు వేసుకుని నిరసన తెలిపారు. ఈ నిరసనలు ఉద్రిక్తతకు దారి తీయటంతో పోలీసులు బలవంతంగా వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.


ఇవి కూడా చదవండి

బీసీసీఐ కీలక నిర్ణయం.. ఉద్దేశపూర్వకంగా నో బాల్ వేస్తే మ్యాచ్ నుంచే సస్పెన్షన్

12వ అంతస్తు నుంచి కిందపడ్డ యువకుడు.. రోడ్డుపై వెళుతున్న మహిళపై పడటంతో..

Updated Date - Jul 21 , 2026 | 09:53 PM