12వ అంతస్తు నుంచి కిందపడ్డ యువకుడు.. రోడ్డుపై వెళుతున్న మహిళపై పడటంతో..
ABN , Publish Date - Jul 21 , 2026 | 09:06 PM
జపాన్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు బిల్డింగ్‌లోని 12వ అంతస్తునుంచి కిందపడ్డాడు. అతడు నేరుగా రోడ్డుపై వెళుతున్న మహిళపై పడ్డాడు. దీంతో ఆ మహిళ ప్రాణాలు కోల్పోయింది. యువకుడు గాయాలతో బయటపడ్డాడు.
టోక్యో, జులై 21: జపాన్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు బిల్డింగ్‌లోని 12వ అంతస్తునుంచి కిందపడ్డాడు. అతడు నేరుగా రోడ్డుపై వెళుతున్న మహిళపై పడ్డాడు. దీంతో ఆ మహిళ ప్రాణాలు కోల్పోయింది. యువకుడు గాయాలతో బయటపడ్డాడు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. నగోయాకు చెందిన షిన్షే తగూచీ అనే 29 ఏళ్ల యువకుడు జులై 19వ తేదీన 12 అంతస్తుల బిల్డింగ్ మీద నుంచి కిందపడ్డాడు. అతడు నేరుగా రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న 23 ఏళ్ల హౌరా ఇనాబా అనే యువతిపై పడ్డాడు.
ఇనాబా స్నేహితురాలు పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడ్డ ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇనాబా ప్రాణాలు కోల్పోయింది. తగూచీ పరిస్థితి విషమంగా ఉంది. వైద్యులు అతడిని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తగూచీ బిల్డింగ్ మీద నుంచి ప్రమాదవశాత్తు కిందపడ్డాడా? లేక తానే దూకాడా అన్నది తెలియరాలేదు.
గతంలో జరిగిన సంఘటనలు..
జపాన్‌లో ఇలాంటి సంఘటనలు జరగటం మొదటిసారి కాదు. 2024 ఆగస్టు నెలలో యోకోహామా స్టేషన్ దగ్గర 17 ఏళ్ల బాలిక బిల్డింగ్ మీద నుంచి కిందకు దూకింది. కింద ఉన్న 32 ఏళ్ల మహిళపై బాలిక పడ్డంతో.. తీవ్ర గాయాలపాలై ఇద్దరూ చనిపోయారు. 2020, అక్టోబర్ నెలలో ఒసాకాలో ఓ బాలుడు బిల్డింగ్‌పై నుంచి కిందకు దూకాడు. అతడు రోడ్డుపై వెళుతున్న యువతిపై పడ్డంతో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు.
ఇవి కూడా చదవండి
వర్షాకాలంలో పాదాలకు ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తోందా? ఈ చిట్కాలు మీ కోసమే