Share News

ఢిల్లీకి సీఎం చంద్రబాబు..

ABN , Publish Date - Jul 21 , 2026 | 08:23 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు న్యూఢిల్లీ పర్యటన ఖరారైంది. బుధవారం ఉదయం 7.30 గంటలకు ఆయన గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు.

ఢిల్లీకి సీఎం చంద్రబాబు..

అమరావతి, జులై 21: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు న్యూఢిల్లీ పర్యటన ఖరారైంది. బుధవారం ఉదయం 7.30 గంటలకు ఆయన గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతోపాటు పలువురు కేంద్ర మంత్రులతో ఆయన సమావేశం కానున్నారు. ఆగస్టు 1వ తేదీన విజయనగరం జిల్లాలోని భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీని ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు ఆహ్వానించనున్నారు.


అనంతరం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ఆయన భేటీ అవుతారు. ఆ తర్వాత కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, సీఆర్ పాటిల్‌తోపాటు పీయూష్ గోయల్‌తో వరుసగా సమావేశం అవుతారు. బుధవారం రాత్రి ఢిల్లీలోనే సీఎం చంద్రబాబు బస చేయనున్నారు. గురువారం ఉదయం న్యూఢిల్లీ నుంచి నేరుగా గన్నవరం చేరుకుంటారు. అక్కడి నుంచి వెలగపూడిలోని సచివాలయానికి నేరుగా చేరుకుంటారు. కేంద్ర మంత్రులతో జరిగే భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను వారి దృష్టికి సీఎం చంద్రబాబు తీసుకెళ్లనున్నారని సమాచారం.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్‌కు యూఏఈ అండ.. రూ. 100 కోట్లతో తొలి పెట్టుబడి: సీఎం చంద్రబాబు

షూటింగ్‌లో గాయపడిన బాలకృష్ణకు సీఎం చంద్రబాబు పరామర్శ

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 21 , 2026 | 08:30 PM