Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Aug 16 , 2026 | 06:59 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Aug 16, 2026 21:54 IST

    చిత్తూరు: పూతలపట్టు మండలం తేనేపల్లి రంగంపేట ఎస్టీ కాలనీలో దారుణం

    • అల్లుడు దాడిలో మామ మృతి

    • ఆన్‌లైన్ గేమ్ ఆడుతున్న అల్లుడు అశోక్‌ను మందలించిన మామ సుబ్రమణ్యం

    • ఆగ్రహానికి గురైన అశోక్.. మామపై దాడి

    • అక్కడికక్కడే మృతి చెందిన మామ.. పరారీలో నిందితుడు

    • కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పూతలపట్టు పోలీసులు

  • Aug 16, 2026 21:49 IST

    అమరావతి: రేపు ఉదయం 9 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

    • ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్న అసెంబ్లీ

    • ఆ తరువాత టీ బ్రేక్.. అనంతరం పలు పేపర్లు టేబుల్ చేయనున్న మంత్రులు

    • అనంతరం మెగా DSCపై ప్రకటన చేయనున్న మంత్రి నారా లోకేశ్

  • Aug 16, 2026 21:23 IST

    కరీంనగర్: జమ్మికుంటలో గంజాయి విక్రయానికి యత్నం.. ఇద్దరు యువకుల అరెస్ట్

    • నాగ్‌పూర్‌ నుంచి 230గ్రాముల గంజాయి కొనుగోలు.. జమ్మికుంటకు తరలింపు

    • ఎఫ్‌సీఐ గోడౌన్‌ వద్ద విక్రయిస్తుండగా పట్టుకున్న పోలీసులు

  • Aug 16, 2026 20:00 IST

    అమరావతి: రేపటి నుంచి అత్యవసర సేవలకు జూడాలు దూరం

    • ఉదయం 8 గంటల నుంచి ఎమర్జెన్సీ సేవల బహిష్కరణ

    • స్టయిఫండ్ పెంపుపై ప్రభుత్వ స్పందన రాకపోవడంతో నిర్ణయం

  • Aug 16, 2026 19:51 IST

    దేశానికి అసలైన ముప్పు బీజేపీ, RSS వేర్పాటువాదం: ఏపీసీసీ చీఫ్ షర్మిల

    • జాగ్రత్త పడాల్సింది వీరి భావజాలం నుంచే: ఏపీసీసీ చీఫ్ షర్మిల

    • చేసింది చెప్పడానికి ఏమీ లేక మోదీ విపక్షాలపై పడ్డారు: షర్మిల

  • Aug 16, 2026 19:21 IST

    రేపు తెలంగాణ వ్యాప్తంగా నిరసనలకు BRS పిలుపు

    • కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై BRS నిరసనలు

    • పథకాలపై హైకోర్టు స్టే విధించిన నేపథ్యంలో నిరసనలకు పిలుపు

  • Aug 16, 2026 18:46 IST

    ప.గో.: పాలకోడేరు మండలం వేండ్ర కాలువలో విషాదం

    • కాలువలో ఈతకు దిగి ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థుల మృతి

    • మృతులు పెరుమాళ్ విఘ్నేష్(22), రాహుల్(21)గా గుర్తింపు

    • సురక్షితంగా బయటపడ్డ మరో నలుగురు విద్యార్థులు

  • Aug 16, 2026 18:45 IST

    హైదరాబాద్: నకిలీ పంచలోహ విగ్రహాల ముఠా అరెస్ట్

    • పంచలోహ లక్ష్మీదేవి విగ్రహం పేరుతో మోసం, ఆరుగురి అరెస్ట్

    • విగ్రహానికి దివ్యశక్తులు ఉన్నాయంటూ జ్యోతిష్కుడితో కలిసి మోసం

    • నకిలీ లక్ష్మీదేవి విగ్రహం, పింక్ కలర్ రాయి, కారు, 5 ఫోన్ల సీజ్

  • Aug 16, 2026 18:28 IST

    విజయవాడలో CBI ట్రాప్ ఆపరేషన్

    • రూ.15లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ రైల్వే ఇంజినీర్

    • సీనియర్ సెక్షన్ ఇంజినీర్ బాపిరాజు అరెస్ట్

    • బాపిరాజుతో పాటు ప్రైవేట్ వ్యక్తి శ్రీచంద్ అరెస్ట్

  • Aug 16, 2026 18:27 IST

    నంద్యాలలో మెడికల్ షాప్ ఉద్యోగి మనోజ్‌కుమార్‌ కిడ్నాప్

    • రాపిడో బుకింగ్ అని నమ్మించి ని పొలాల్లోకి తీసుకెళ్లిన అగంతకులు

    • మనోజ్‌కుమార్ తలపై రాయితో మోది తీవ్రంగా గాయపరిచిన దుండగులు

    • రూ.2 లక్షలు ఇవ్వాలని బెదిరింపులు.. డబ్బులు లేవని చెప్పడంతో మొబైల్ సిమ్‌తో పరారీ

  • Aug 16, 2026 18:11 IST

    గాలె టెస్టులో ముగిసిన రెండో రోజు ఆట

    • తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 460/9

    • దేవ్‌దత్‌ పడిక్కల్‌ 167, KL రాహుల్‌ 82

    • శ్రీలంక బౌలింగ్‌: ప్రభాత్‌ 4, కేషారా నువాంతా 3 వికెట్లు

  • Aug 16, 2026 17:30 IST

    నల్లగొండ : చిట్యాలలో పారిశ్రామిక రసాయనాల అక్రమ విక్రయ ముఠాలో ఐదుగురి అరెస్ట్

    • ట్యాంకర్ల నుంచి సాల్వెంట్లు, ఇతర కెమికల్స్‌ను అక్రమంగా దారి మళ్లింపు

    • వెలిమినేడు శివారులో రాజస్థాన్ ధాబా వెనుక అక్రమ దందా గుట్టురట్టు

    • రసాయనాలతో నింపిన ప్లాస్టిక్ డ్రమ్ములు, 5 వాహనాల స్వాధీనం

  • Aug 16, 2026 17:15 IST

    హైదరాబాద్‌: భూములపై బ్యాంక్ రుణాలు ఇప్పిస్తామని మోసం

    • 20కి పైగా కేసుల్లో నిందితుడైన అంతర్రాష్ట్ర కేటుగాడి అరెస్ట్, రిమాండ్‌

    • CCS పోలీసులకు చిక్కిన నునావత్ యుగంధర్

    • ఆస్తి పత్రాలను దుర్వినియోగం చేసి మూడో వ్యక్తి పేరిట బదిలీ

    • 12 క్రిమినల్ కేసులు.. 8 సివిల్, NI యాక్ట్ కేసులు

    • నిందితుడు యుగంధర్‌ అరెస్ట్, రిమాండ్‌

  • Aug 16, 2026 17:00 IST

    ఇది ప్రజలు ఎన్నుకున్న ఇందిరమ్మ ప్రభుత్వం: పొంగులేటి

    • రెండేళ్లలోనే మామునూరు ఎయిర్‌పోర్టు పూర్తి చేస్తాం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

    • త్వరలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీని ప్రారంభిస్తాం: మంత్రి పొంగులేటి

  • Aug 16, 2026 16:45 IST

    ఖరీఫ్‌-2026లో 35.16 లక్షలకు చేరిన బీమా నమోదు దరఖాస్తులు: మంత్రి అచ్చెన్నాయుడు

    • గత ఖరీఫ్‌తో పోలిస్తే నమోదులో 80 శాతం పెరుగుదల: మంత్రి అచ్చెన్న

    • రైతుకు ఆర్థిక భద్రతే లక్ష్యం.. ఎల్‌నినో ప్రభావిత ప్రాంతాలపై దృష్టి: అచ్చెన్న

  • Aug 16, 2026 16:30 IST

    మేడారం: వనదేవతలను BRS ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది: సీఎం రేవంత్‌రెడ్డి

    • ఆనాడు పీసీసీ అధ్యక్షుడిగా ములుగు నుంచే పాదయాత్ర ప్రారంభించా: సీఎం రేవంత్ రెడ్డి

    • ప్రజల సమస్యలను తెలుసుకుని తీరుస్తామని హామీ ఇచ్చా: రేవంత్

    • మేం అధికారంలోకి వచ్చాక మేడారం ఆలయాన్ని అభివృద్ధి చేశాం: రేవంత్

    • రామప్ప దేవాలయంతో సమానంగా మేడారం అభివృద్ధి: సీఎం రేవంత్‌రెడ్డి

  • Aug 16, 2026 16:15 IST

    కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక.. ములుగు అభివృద్ధి చెందుతోంది: మంత్రి సీతక్క

    • హైదరాబాద్‌తో సమానంగా ములుగు అభివృద్ధి: మంత్రి సీతక్క

    • పదేళ్లుగా కొట్లాడితే 33వ జిల్లాగా ములుగును ఇచ్చారు: సీతక్క

    • ఎన్నికల ముందే ములుగు కలెక్టరేట్‌కు శంకుస్థాపన చేశారు: మంత్రి సీతక్క

  • Aug 16, 2026 16:01 IST

    ములుగు జిల్లా: గట్టమ్మ ఆలయం దగ్గర హ్యామ్ రోడ్ల పైలాన్ ఆవిష్కరణ

    • నూతన కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

    • ములుగులో రూ.868 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం

    • పరకాలలో రూ.443.42కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభం

  • Aug 16, 2026 15:54 IST

    అనంతపురం: తాడిపత్రిలో ఉద్రిక్తత

    • వివాహ నిశ్చితార్థ వేడుకలో ఘర్షణ

    • జేసీ ప్రభాకర్‌రెడ్డి, వైసీపీ నేత మురళి మధ్య వాగ్వాదం

    • టీడీపీ, వైసీపీ నేతల పరస్పర దాడులు

    • ఇరువర్గాల దాడులతో భారీగా పోలీసుల మోహరింపు

  • Aug 16, 2026 15:53 IST

    చంద్రగిరి దగ్గర ఏనుగుల సంచారంపై ప్రజలను అప్రమత్తం చేయండి: పవన్‌ కల్యాణ్

    • ఏనుగుల కదలికలపై డ్రోన్లతో నిఘా: ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌

  • Aug 16, 2026 15:53 IST

    కృష్ణా: గుడివాడ NTR కాలనీలో చిట్టీల పేరుతో రూ.70 లక్షల మోసం

    • చిట్టీలు నిర్వహిస్తూ.. పేదలకు డబ్బులు ఎగ్గొట్టిన దంపతులు

  • Aug 16, 2026 15:30 IST

    జగన్ తీరుపై బీజేపీ నేత విష్ణువర్ధన్‌రాజు వ్యాఖ్యలు

    • అసెంబ్లీకి రాని వైసీపీ MLAలకు 2029 ఎన్నికల్లో ప్రజలు ఎలా ఓటు వేస్తారు?

    • వైసీపీ MLAలు అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి: విష్ణువర్ధన్‌రాజు

    • అసెంబ్లీలో వైసీపీకి సమయం ఇవ్వరన్న జగన్ ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దు: విష్ణువర్ధన్‌రాజు

  • Aug 16, 2026 15:15 IST

    కాంగ్రెస్‌ నేతలపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఆగ్రహం

    • దేశ ప్రజలను కాంగ్రెస్ అవమానించింది: అమిత్‌ షా

    • వందేమాతరం ఆలపిస్తుండగా మధ్యలో ఆపమని సోనియా గాంధీ చెప్పారు: అమిత్‌ షా

    • కాంగ్రెస్ నిర్వాకాన్ని 140 కోట్ల మంది భారతీయులు చూశారు: అమిత్‌ షా

    • వందేమాతరం వివాదంపై సోనియా గాంధీ క్షమాపణలు చెప్పాలి: అమిత్‌ షా

  • Aug 16, 2026 15:00 IST

    మేడారంలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన

    • సమ్మక్క-సారలమ్మను దర్శించుకున్న సీఎం రేవంత్‌ రెడ్డి

    • మేడారంలో మొక్కులు చెల్లించుకున్న సీఎం రేవంత్‌రెడ్డి

    • సమ్మక్క-సారలమ్మకు నిలువెత్తు బంగారం సమర్పించిన సీఎం

    • మేడారం అభివృద్ధి పనులను పరిశీలించిన సీఎం రేవంత్‌రెడ్డి

  • Aug 16, 2026 14:45 IST

    విశాఖ: ప్రజల కోసమైనా వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాలి

    • మీడియాతో మాట్లాడుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు.. అసెంబ్లీకి వచ్చి చర్చించాలి

    • దయచేసి అసెంబ్లీకి రావాలని వైసీపీ ఎమ్మెల్మేలను కోరుతున్నా: బీజేపీ MLA ఈశ్వరరావు

  • Aug 16, 2026 14:30 IST

    మేడారంలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన

    • సమ్మక్క-సారలమ్మను దర్శించుకున్న సీఎం రేవంత్‌ రెడ్డి

    • సీఎం వెంట మంత్రి పొంగులేటి, ఎంపీ వేం నరేందర్‌రెడ్డి

  • Aug 16, 2026 14:26 IST

    IND vs SL: ఇంకా ప్రారంభం కానీ రెండో రోజు ఆట

    • కాసేపు ఆగి మళ్లీ ప్రారంభమైన వర్షం

    • ఇప్పటికే రద్దైన రెండో రోజు తొలి సెషన్‌ ఆట

    • ప్రస్తుతం భారత్ స్కోర్ 288/2 (73 ఓవర్లు)

  • Aug 16, 2026 14:15 IST

    హైదరాబాద్‌లో డ్రండ్ అండ్ డ్రైవ్‌పై ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్

    • రెండు రోజుల తనిఖీల్లో 271 మందిపై కేసులు నమోదు

    • 228 బైక్‌లు, 20 ఆటోలు, 23 కార్లు సహా ఇతర వాహనాలపై కేసులు

  • Aug 16, 2026 14:02 IST

    సిన్సినాటి ఓపెన్‌లో టెన్నిస్‌ స్టార్‌ జకోవిచ్‌కు ఎదురుదెబ్బ

    • రెండో రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టిన జకోవిచ్‌

    • అర్జెంటీనా ప్లేయర్‌ థియాగో టిరంటే చేతిలో 2-6, 6-4, 6-4 సెట్ల తేడాచో జకోవిచ్‌ పరాజయం

  • Aug 16, 2026 14:01 IST

    వరంగల్‌: రాయపర్తిలో పిచ్చికుక్క దాడి

    • దాడిలో ఐదుగురికి గాయాలు, ఆస్పత్రికి తరలింపు

  • Aug 16, 2026 14:00 IST

    తెలంగాణలో కొత్తగా TG SAFE ఏర్పాటు

    • TG SAFE కమిషనర్‌గా అవినాష్‌ మహంతి

    • ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం

    • ఆహార భద్రత, డ్రగ్‌ కంట్రోల్‌ విభాగాల విలీనానికి నిర్ణయం

    • అక్రమాలు, కల్తీపై నిఘా పెంచేందుకు ఇంటెలిజెన్స్‌ రిస్క్ ఆధారిత తనిఖీలు చేపట్టనున్న TG SAFE

  • Aug 16, 2026 13:37 IST

    పల్నాడు: ముప్పాళ్ల ఎస్సీ కాలనీలో విగ్రహాలకు డబ్బుల వసూళ్లపై ఇరువర్గాల మధ్య ఘర్షణ

    • నలుగురికి గాయాలు, ఆస్పత్రికి తరలింపు

  • Aug 16, 2026 13:30 IST

    IND vs SL: ఫామ్‌లోకి వచ్చిన లంక బౌలర్లు

    • స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లు కోల్పోయిన భారత్

    • పంత్(39), కేఎల్ రాహుల్‌(82)లను ఔట్ చేసిన కేశర నువాంతు

    • 87 ఓవర్లకు భారత్ స్కోరు 333/4

    • ప్రస్తుతం క్రీజులో దేవదత్ పడిక్కల్ (155), ధ్రువ్‌ జురెల్ (4)

  • Aug 16, 2026 13:24 IST

    విజయవాడ: స్మృతివనం చేరుకున్న టీచర్ల ర్యాలీ

    • ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం నుంచి అంబేడ్కర్‌ స్మృతి వనానికి చేరుకున్న ఉపాధ్యాయులు

    • బందరు రోడ్డులో కదంతొక్కిన ఉపాధ్యాయులు

    • ర్యాలీలో పాల్గొన్న ఉమ్మడి ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల ఉపాధ్యాయులు

  • Aug 16, 2026 13:24 IST

    కడప: బ్రహ్మంగారి మఠంలో దారుణం

    • వ్యక్తిగత కక్షలతో నిద్రిస్తున్న అన్న వెంకటసుబ్బయ్యను కత్తితో నరికి చంపిన తమ్ముడు సురేశ్

  • Aug 16, 2026 13:22 IST

    ముంబై నేవీ నగర్‌లో విషాదం

    • కొలాబాలో నేవీ సైలర్‌ కుటుంబం మృతి

    • దంపతులు సహా ఇద్దరు పిల్లల మృతి

    • ఇంట్లోనే నలుగురి మృతదేహాల గుర్తింపు

    • మృతికి కారణాలపై పోలీసుల విచారణ

  • Aug 16, 2026 13:07 IST

    ప.గో.: ఇరగవరం మండలం ఐతంపూడిలో విషాదం

    • అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లిన కారు

    • యువకులు భాను వికాస్‌, దుశ్వంత్‌ మృతి

    • గల్లంతైన రాజారామ్‌, సాయిసూర్య కోసం గాలింపు

  • Aug 16, 2026 12:50 IST

    కొమురం భీం జిల్లా: జైనూరు KGVB స్కూల్లో కలెక్టర్ హరిత ఆకస్మిక తనిఖీలు

    • హాస్టల్ గదులు, వంటగది, పరిసరాల పరిశీలన

    • మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలని కలెక్టర్ ఆదేశం

  • Aug 16, 2026 12:38 IST

    హైదరాబాద్‌: నిర్మాత బండ్ల గణేష్‌ కుమార్తె వివాహ వేడుక

    • వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించిన తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి

  • Aug 16, 2026 12:26 IST

    తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

    • పెట్రోల్‌, డీజిల్‌ ఆటోలను EVలుగా మార్చేందుకు తెలంగాణలో ఆటో రిక్షా ఎలక్ట్రిక్‌ మార్పిడి పథకం

    • CURE ప్రాంతంలో 18,766 ఆటోలకు ప్రయోజనం

    • రెట్రోఫిట్‌మెంట్‌ లేదా కొత్త EV ఆటో కొనుగోలుకు రూ.1.5 లక్షల సాయం

  • Aug 16, 2026 12:22 IST

    IND VS SL: గాలేలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం

    • తొలి టెస్ట్ రెండో రోజు సాధ్యం కాని తొలి సెషన్

    • ముందుగానే భోజన విరామం ప్రకటించిన అంపైర్లు

    • మరికాసేపట్లో ప్రారంభం కానున్న రెండో సెషన్

    • ప్రస్తుతం భారత్ స్కోర్ 288/2

    • క్రీజులో దేవదత్ పడిక్కల్(131), పంత్(27)

  • Aug 16, 2026 12:11 IST

    చిత్తూరు: పలమనేరు టీఎస్ అగ్రహారంలో ఏనుగుల హల్‌చల్‌

    • పొలాల్లో వరి, టమాటా పంటలను నాశనం చేసిన ఏనుగులు

    • బోరు పైపులను ధ్వంసం చేయడంతో రైతులకు నష్టం

  • Aug 16, 2026 12:11 IST

    సుప్రీంకోర్టుకు రాహుల్ గాంధీ ఆస్తుల వివాదం

    • అలహాబాద్‌ హైకోర్టు ఆదేశాలను సవాల్‌ చేస్తూ రాహుల్‌ పిటిషన్ దాఖలు

    • రాహుల్ గాంధీ పిటిషన్‌పై రేపు సుప్రీంకోర్టులో విచారణ

    • రాహుల్ పిటిషన్‌ను విచారించనున్న CJI త్రిసభ్య ధర్మాసనం

  • Aug 16, 2026 12:04 IST

    వారణాసి ఎయిర్‌పోర్టులో గన్‌ మిస్‌ఫైర్‌

    • తుపాకీ మిస్‌ఫైర్‌లో ఇద్దరికి గాయాలు

    • మహిళ కాలికి తగిలిన బుల్లెట్‌

    • మరో వ్యక్తి చేతికి బుల్లెట్‌ గాయం

    • ట్రామా సెంటర్‌కు క్షతగాత్రుల తరలింపు

  • Aug 16, 2026 11:49 IST

    విజయనగరం: భోగాపురానికి ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకులు రవిశంకర్‌

    • ఎయిర్‌పోర్టు దగ్గర స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ప్రారంభించనున్న రవిశంకర్‌

  • Aug 16, 2026 11:33 IST

    ములుగు: కాసేపట్లో సీఎం రేవంత్‌ రెడ్డి మేడారం పర్యటన

    • సమ్మక్క-సారలమ్మను దర్శించుకోనున్న సీఎం రేవంత్‌

    • అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించనున్న రేవంత్‌

    • మేడారంలో చేయూత పెన్షన్ల మంజూరు పత్రాల పంపిణీ

  • Aug 16, 2026 11:27 IST

    శ్రీశైలం ఘాట్‌రోడ్‌లో అదుపుతప్పి డీసీఎం బోల్తా

    • సాక్షి గణపతి ఆలయ సమీపంలో ఘటన

    • ఆటోను తప్పించబోయి కారును ఢీకొన్న వ్యాన్

    • కారులోని ప్రయాణికులకు గాయాలు, ఆస్పత్రికి తరలింపు

    • శ్రీశైలం ఘాట్‌రోడ్‌లో భారీగా వాహనాల రద్దీ

  • Aug 16, 2026 11:19 IST

    కేటీఆర్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్‌ విమర్శలు

    • భారత్‌లో మంచి కాలేజీలు లేవని కేటీఆర్ అంటున్నారు: బండి సంజయ్‌

    • అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ ఏం చేశారు?: బండి సంజయ్‌

    • రాష్ట్రంలో మంచి స్కూళ్లు, కాలేజీలు ఎందుకు ఏర్పాటుచేయలేదు?: బండి సంజయ్‌

    • BRS పాలనలో టీచర్లను ఎందుకు నియమించలేదు?: బండి సంజయ్‌

  • Aug 16, 2026 11:14 IST

    రాజస్థాన్‌: ధోల్‌పూర్‌లో ఆకస్మిక వరద

    • దమోహ్‌ జలపాతం దగ్గర వరద ఉద్ధృతి

    • జలపాతం దగ్గర చిక్కుకుపోయిన 100 మంది పర్యాటకులు

    • పర్యాటకులను రక్షించిన సహాయ సిబ్బంది

  • Aug 16, 2026 11:08 IST

    గాంధీభవన్‌: హైదరాబాద్‌ జిల్లా PAC సమావేశం

    • తెలంగాణ ఇన్‌చార్జ్‌ మీనాక్షి అధ్యక్షతన భేటీ

    • పార్టీ కార్యక్రమాలు, సంస్థాగత అంశాలపై చర్చ

  • Aug 16, 2026 11:08 IST

    కృష్ణా జిల్లా: మచిలీపట్నం సముద్రంలో గల్లంతైన మత్స్యకారుడి మృతదేహం లభ్యం

    • నిన్న మంగినపూడి బీచ్‌లో వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుడు పల్లెటి రాజు(20)

    • విస్తృతంగా గాలించి మృతదేహాన్ని వెలికితీసిన గజ ఈతగాళ్లు

  • Aug 16, 2026 11:05 IST

    ఎన్టీఆర్ జిల్లా: కంచికచర్ల మండలం మోగులూరులో బైక్ దగ్ధం

    • పూర్ణచంద్రరావు అనే వ్యక్తికి చెందిన బైక్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించిన అదే గ్రామానికి చెందిన చంద్ర

    • పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు, కేసు నమోదు

  • Aug 16, 2026 11:02 IST

    హైదరాబాద్‌: ఫిలింనగర్‌లో ఘర్షణ, 12 మందిపై కేసు

    • పండ్ల వ్యాపారులు ముబారక్‌, ముషారఫ్‌పై ముఠా దాడి

    • పోలీసులకు బాధితుల ఫిర్యాదు, కేసు నమోదు

  • Aug 16, 2026 10:53 IST

    విజయవాడలో DSC-2025 టీచర్ల ఆత్మగౌరవ ర్యాలీ

    • ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం నుంచి అంబేడ్కర్‌ విగ్రహం వరకు ఉపాధ్యాయుల ర్యాలీ

    • ర్యాలీలో పాల్గొన్న ఉమ్మడి ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల ఉపాధ్యాయులు

  • Aug 16, 2026 10:47 IST

    డార్విన్‌: టెస్టుల్లో ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ సంచలన విజయం

    • ఆసీస్ టూర్‌లో తొలి టెస్టులో బంగ్లాదేశ్ ఘన విజయం

    • 9 వికెట్ల తేడాతో గెలుపొందిన బంగ్లాదేశ్‌

    • స్కోర్లు: ఆస్ట్రేలియా 198 & 284

    • బంగ్లాదేశ్‌ 426 & 57/1

  • Aug 16, 2026 10:43 IST

    శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో బుల్లెట్ల కలకలం

    • ఢిల్లీ వెళ్తున్న ప్రయాణికుడి దగ్గర బుల్లెట్లు లభ్యం

    • బుల్లెట్లు స్వాధీనం చేసుకున్న CISF అధికారులు

    • ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టిన అధికారులు

  • Aug 16, 2026 10:19 IST

    హైదరాబాద్: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఫేక్‌ టికెట్‌ కలకలం

    • జడ్డా వెళ్తున్న ప్రయాణికుడి దగ్గర ఫేక్‌ టికెట్ గుర్తింపు

    • ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్న అధికారులు

  • Aug 16, 2026 09:43 IST

    డెడ్‌డ్రాప్ గంజాయి కేసులో వెలుగులోకి కీలక అంశాలు

    • పోలీసులకు ఇన్ఫార్మర్లుగా ఉంటూ బొల్లా బ్రదర్స్ గంజాయి దందా

    • క్యాటరింగ్ బాయ్స్‌ను సరఫరా చేసే ముసుగులో గంజాయి దందా

    • బొల్లా బ్రదర్స్ చోరీల కేసులో ముగ్గురు నిందితులు

    • పక్కా సమాచారంతో సదరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

    • పోలీసులకు సమాచారం ఇస్తూ గంజాయి దందాకు బొల్లా బ్రదర్స్‌ ప్లాన్

  • Aug 16, 2026 09:32 IST

    ఏలూరు: నూజివీడు ప్రభుత్వాస్పత్రిలో యువకుడిని బలి తీసుకున్న వైద్యుల నిర్లక్ష్యం

    • కడుపు నొప్పితో ఆస్పత్రిలో చేరిన బోర్వంచకు చెందిన యువకుడు ప్రేమ్ కుమార్(25)

    • సిబ్బంది స్పందించకపోవడంతో నొప్పి భరించలేక ప్రాణాలు విడిచిన యువకుడు

    • డాక్టర్ల నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ మృతుని కుటుంబ సభ్యుల ఆగ్రహాం

  • Aug 16, 2026 09:27 IST

    కోనసీమ: IOB ఏటీఎంలో చోరీకి విఫలయత్నం

    • ముమ్మిడివరం మండలం అనాతవరంలో ఘటన

    • ATMలో సీసీటీవీ కెమెరా, ప్రింటింగ్‌ మిషన్‌ ధ్వంసం

    • అలారం మోగడంతో పరారైన దుండగులు

  • Aug 16, 2026 09:02 IST

    బెంగాల్‌ మాజీ డిప్యూటీ స్పీకర్‌ ఉరివేసుకుని ఆత్మహత్య

    • రాంపూర్‌హాట్‌ TMC పార్టీ ఆఫీస్‌లో ఆశిష్‌ బెనర్జీ ఆత్మహత్య

    • 5 సార్లు TMC ఎమ్మెల్యేగా గెలిచిన ఆశిష్‌ బెనర్జీ

    • పలు కీలక శాఖలకు మంత్రిగానూ పనిచేసిన ఆశిష్‌ బెనర్జీ

    • ఆశిష్‌ బెనర్జీ ఆత్మహత్యకు కారణాలపై పోలీసుల దర్యాప్తు

  • Aug 16, 2026 08:45 IST

    సంగారెడ్డి: అమీన్‌పూర్‌ బీవీజీ లిక్కర్‌ మార్టులో అగ్నిప్రమాదం

    • మంటలను అదుపుచేసిన ఫైర్‌ సిబ్బంది

  • Aug 16, 2026 08:44 IST

    తిరుపతి: నవంబర్‌ దర్శన కోటా టికెట్ల తేదీలను ప్రకటించిన టీటీడీ

    • ఆగస్టు 18న ఉ.10:00 గంటలకు ఆర్జిత సేవా టికెట్ల విడుదల

    • 21న కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార, పుష్పయాగం ఆర్జిత సేవ టికెట్లు

    • వర్చువల్‌ సేవల కోటా టికెట్లు విడుదల చేసిన టీటీడీ

  • Aug 16, 2026 08:36 IST

    ఢిల్లీ: వాజ్‌పేయి స్మారకం దగ్గర ప్రధాని మోదీ నివాళులు

    • వాజ్‌పేయి వర్ధంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, వెంకయ్యనాయుడు, కోవింద్‌ సహా పలువురు నివాళులు

  • Aug 16, 2026 08:26 IST

    నెల్లూరు: కలువాయి మం. పర్లకొండలోని రెండు ఆలయాల్లో చోరీ

    • మాతమ్మ, పోలేరమ్మ ఆలయాల్లో హుండీలు ఎత్తికెళ్లిన దొంగలు

    • సీసీటీవీ కెమెరా ఫుటేజ్‌ల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు

  • Aug 16, 2026 08:21 IST

    విశాఖ ఎయిర్‌పోర్టులో పౌర విమాన సర్వీస్‌ల నిలిపివేత

    • ఇవాళ అర్ధరాత్రి నుంచి పౌర విమాన సర్వీస్‌ల నిలిపివేత

    • ఇకపై పూర్తిగా నేవీ ఆధ్వర్యంలోనే విమాన కార్యకలాపాలు

    • ప్రత్యేక విమానాలకు మాత్రమే అనుమతులు

    • రేపటి నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టు నుంచే సర్వీసులు

    • 45 ఏళ్లుగా విమాన సేవలందించిన విశాఖ ఎయిర్‌పోర్టు

  • Aug 16, 2026 07:42 IST

    బాపట్ల: చీరాల బండ్ల కాలనీలో పోలీసుల కార్డన్‌ సెర్చ్‌

    • సరైన పత్రాల్లేని 32 బైక్‌లు, 8 ట్రాలీ ఆటోల స్వాధీనం

  • Aug 16, 2026 07:41 IST

    తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

    • క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి ఆక్టోపస్‌ సర్కిల్‌ వరకు వేచివున్న భక్తులు

    • శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం

    • నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.81 కోట్లు

  • Aug 16, 2026 07:33 IST

    ఇండోనేసియాలో భూకంపం, తీవ్రత 7.7 నమోదు

    • భూకంపం ధాటికి 50 మందికిపైగా మృతి

    • పలుచోట్ల కూలిన భవనాలు, కొనసాగుతున్న రెస్క్యూ

  • Aug 16, 2026 07:33 IST

    తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

    • సిద్దిపేట, కరీంనగర్‌, హన్మకొండ, జనగామ, వరంగల్‌, మహబూబాబాద్‌, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో వర్షాలు

  • Aug 16, 2026 07:33 IST

    హోర్ముజ్‌పై ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన ఇరాన్‌

    • హోర్ముజ్‌ జలసంధి ఎప్పటికీ మా నియంత్రణలోనే: ఇరాన్‌

    • హోర్ముజ్‌ మూసేయాలా.. తెరవాలా అనేది మా నిర్ణయం: ఇరాన్

    • హోర్ముజ్ జలసంధిని ఎవరూ ఆక్రమించుకోలేరు: ఇరాన్‌

    • యుద్ధ నౌకల మోహరింపుతో భయపడేది లేదు: ఇరాన్‌

  • Aug 16, 2026 07:13 IST

    ఢిల్లీ: నేడు రాష్ట్రపతి భవన్‌లో అమృత్ ఉద్యాన్ ప్రారంభం

    • నేటి నుంచి సెప్టెంబర్‌ 19 వరకు ప్రజల సందర్శనార్థం రాష్ట్రపతి భవన్ గార్డెన్స్‌ ఓపెన్‌

  • Aug 16, 2026 07:12 IST

    నేడు ఖమ్మం జిల్లాలో మంత్రులు భట్టి, తుమ్మల పర్యటన

    • పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు

  • Aug 16, 2026 07:11 IST

    సూర్యాపేటలో రోడ్డు ప్రమాదం

    • రెండు బస్సులు ఢీ, పలువురికి గాయాలు

    • ధ్వంసమైన ఆర్టీసీ బస్సు ముందుభాగం

  • Aug 16, 2026 07:11 IST

    నేడు ఉమెన్స్ హాకీ ప్రపంచకప్‌లో భారత్ Vs చైనా

    • నెదర్లాండ్స్‌లో సాయంత్రం 4:30 గంటలకు మ్యాచ్‌

  • Aug 16, 2026 07:10 IST

    నేడు కామారెడ్డి, ములుగు, హన్మకొండ జిల్లాల్లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన

    • జుక్కల్ MLA లక్ష్మీకాంతరావు కుమార్తె వివాహ విందులో పాల్గొననున్న సీఎం

    • సమ్మక్క-సారలమ్మను దర్శించుకోనున్న సీఎం రేవంత్‌

    • పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్న సీఎం

    • హన్మకొండ జిల్లా పరకాలలో బహిరంగసభ

  • Aug 16, 2026 07:09 IST

    నేడు శబరిమల ఆలయ పునఃప్రారంభం

    • కేరళ మాసం సందర్భంగా ఆలయం ఓపెన్‌

  • Aug 16, 2026 07:09 IST

    విజయవాడ: నేడు DSC-2025 ద్వారా ఎంపికైన టీచర్ల ఆత్మగౌరవ ర్యాలీ

    • ఉ.10:30కు ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం నుంచి అంబేడ్కర్‌ విగ్రహం వరకు ర్యాలీ

    • పాల్గొననున్న ఉమ్మడి ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ప.గో. జిల్లాల టీచర్లు

  • Aug 16, 2026 07:07 IST

    పశ్చిమ గోదావరి: ప్రమాదవశాత్తూ కాలువలోకి దూసుకుపోయిన కారు.. నలుగురి గల్లంతు

    • క్షేమంగా బయటపడిన మరో వ్యక్తి

    • పెరవలిలో పెళ్లికి వెళ్లివస్తుండగా ఇరగవరం మం. అయితంపూడి లాకుల వద్ద ఘటన

  • Aug 16, 2026 06:59 IST

    స్థిరంగా బంగారం ధరలు

    • 24 క్యారెట్ల 10గ్రా. బంగారం ధర రూ.1,55,130

    • 22 క్యారెట్ల 10గ్రా. పసిడి ధర రూ.1,42,200

    • కిలో వెండి ధర రూ.2,55,000