Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Aug 23 , 2026 | 06:50 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Aug 23, 2026 21:32 IST

    సంగారెడ్డి - హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్

    • కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు

    • ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు

    • రుద్రారం, ముత్తంగి, ఇస్నాపూర్ పరిసరాల్లో స్తంభించిన ట్రాఫిక్

    • జాతీయ రహదారి విస్తరణ పనులతో పాటూ వర్షంతో ట్రాఫిక్ ఇబ్బందులు

  • Aug 23, 2026 21:31 IST

    22A జాబితాను వెంటనే రద్దు చేయాలి: మాజీ మంత్రి హరీశ్ రావు

    • రద్దు చేయకపోతే అసెంబ్లీని స్తంభింపజేయడంతో పాటు సచివాలయాన్ని ముట్టడిస్తాం

    • ప్రజల ఆస్తులను లాక్కోవాలని చూస్తే కాంగ్రెస్‌ మాడిమసైపోవడం ఖాయం: హరీశ్ రావు

  • Aug 23, 2026 21:20 IST

    కాంగ్రెస్‌ 1000 రోజుల దగా పాలన పేరుతో BRS సమరభేరి

    • సెప్టెంబర్‌ 2 నుంచి రాష్ట్రవ్యాప్త నిరసనలకు KTR పిలుపు

    • హామీలు అమలు చేయకుండా మోసం చేశారు: కేటీఆర్‌

    • బాకీ కార్డుల పేరిట కాంగ్రెస్‌ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం: కేటీఆర్‌

    • కాంగ్రెస్‌ మోసాలను గ్రామాల్లో ప్రజలకు వివరిస్తాం: కేటీఆర్‌

  • Aug 23, 2026 21:15 IST

    హైదరాబాద్‌: ఆటో సంఘాలతో రవాణాశాఖ చర్చలు సఫలం

    • ఇవాళ అర్ధరాత్రి నుంచి తలపెట్టిన సమ్మె విరమణ

    • డిమాండ్లపై సానుకూలంగా స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్

  • Aug 23, 2026 21:00 IST

    ఏలూరు: నూజివీడు ఎమ్మార్ అప్పారావు కాలనీలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

    • రూ.17 కోట్లతో ఇంటింటికీ మంచినీటి కుళాయి పైప్‌లైన్‌ పనులకు శ్రీకారం

    • పైప్‌లైన్‌ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి పార్థసారథి

  • Aug 23, 2026 20:45 IST

    అనకాపల్లి జిల్లా: కోడి పందెం నిర్వాహకుల అరెస్ట్

    • పరవాడ మండలం పి-బోనంగి శివార గ్రామంలో కోడిపందాలపై పోలీసుల దాడి

    • కోడి పందేలు నిర్వహిస్తున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

    • 5 కోళ్ళు, రూ.1620 నగదు స్వాధీనం

    • కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్న పరవాడ పోలీసులు

  • Aug 23, 2026 20:30 IST

    ప్రకాశం: మద్దిపాడు మండలం నందిపాడు దగ్గర ప్రమాదం

    • అదుపుతప్పి ఆటో బోల్తా, ఒకరి మృతి, 10 మందికి గాయాలు

    • కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్న పోలీసులు

  • Aug 23, 2026 19:45 IST

    ఏలూరు: ముసునూరులో రేపు సీఎం చంద్రబాబు పర్యటన

    • ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌తో కలిసి సీఎం చంద్రబాబు పర్యటన

    • తొలి నాన్-GMO పాప్‌కార్న్ మెయిజ్ హైబ్రిడ్ విత్తనం ఆవిష్కరణ

    • జన్యుపరంగా మార్పు చెందని మొక్కజొన్న వంగడం విడుదల

    • ముసునూరులో గోర్మే పాప్‌కార్నికా ఆధ్వర్యంలో కార్యక్రమం

    • పాప్‌కార్న్ మెయిజ్ సాగులో రైతులతో సంస్థ భాగస్వామ్యం

  • Aug 23, 2026 19:30 IST

    కారుమూరి నాగేశ్వరరావును గాంధీ ఆసుపత్రికి తరలింపు

    • కొనసాగుతున్న వైద్య పరీక్షలు

    • వైద్య పరీక్షల అనంతరం మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచే అవకాశం

    • లిక్కర్ స్కామ్‌లో కారుమూరిని అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు

  • Aug 23, 2026 19:15 IST

    సంగారెడ్డి: ORR కొల్లూరు ఎగ్జిట్‌-2 దగ్గర ట్రాఫిక్‌ జామ్‌

    • వర్షం వల్ల ఇరువైపులా భారీగా నిలిచిన వాహనాలు

    • కొల్లూరు, తెల్లాపూర్‌, వెలిమల వైపు వెళ్లే వాహనదారుల ఇబ్బందులు

    • ట్రాఫిక్‌ను క్లియర్‌ చేస్తున్న పోలీసులు

  • Aug 23, 2026 19:00 IST

    కాకినాడ: సూర్యరావుపేట గుర్రాల బీచ్‌లో ఇద్దరి గల్లంతు

    • బీచ్‌లో స్నానికి వెళ్లిన నలుగురు యువకులు

    • కెరటాల దాటికి కొట్టుకుపోయిన ఇద్దరు యువకులు

    • క్షేమంగా ఒడ్డుకు చేరుకున్న ఇద్దరు.. గల్లంతైన వారి కోసం పోలీసుల గాలింపు

  • Aug 23, 2026 18:45 IST

    లండన్‌లో తెలుగు ప్రవాసులతో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం

    • తెలంగాణ రైజింగ్‌ లక్ష్యాలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయాలని పిలుపు

    • తెలంగాణ అభివృద్ధిలో ప్రవాసులు భాగస్వాములు కావాలి: సీఎం రేవంత్ రెడ్డి

    • రాష్ట్రానికి మంచి రాయబారులుగా ప్రవాసులు నిలవాలి: రేవంత్‌రెడ్డి

    • తెలంగాణ అభివృద్ధి, భవిష్యత్‌ ప్రగతిపై ప్రవాసులతో చర్చ: రేవంత్‌రెడ్డి

    • ప్రవాసులతో ఆత్మీయంగా ముచ్చటించిన సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు

  • Aug 23, 2026 18:30 IST

    భద్రాద్రి కొత్తగూడెం: కొత్తగూడెం బస్టాండ్ సర్కిల్‌లో విషాదం

    • ఆర్టీసీ బస్సు వెనుక టైర్ కింద దూరి బట్టు బోస్ (30) అనే యువకుడి బలవన్మరణం

    • కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు

  • Aug 23, 2026 18:10 IST

    పల్నాడు: సత్తెనపల్లి కొత్తపేటలో విషాదం

    • ప్రమాదవశాత్తు లిఫ్ట్‌లో ఇరుక్కుని బాలిక రేవతి(12) మృతి

    • కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్న పోలీసులు

  • Aug 23, 2026 18:00 IST

    భద్రాద్రి కొత్తగూడెం: శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు

    • అంకురార్పణ కార్యక్రమం నిర్వహించిన అర్చకులు

  • Aug 23, 2026 17:55 IST

    ఎన్టీఆర్: డ్రగ్స్‌పై దండయాత్ర కార్యక్రమం విజయవంతమైంది: ఎస్పీ సరిత

    • జిల్లావ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు కల్పించాం: ఎస్పీ సరిత

    • డ్రగ్స్‌పై సమాచారం ఇచ్చేవారి వివరాలు గోప్యంగా ఉంచుతాం: ఎస్పీ సరిత

  • Aug 23, 2026 17:50 IST

    అమరావతి: మంత్రి సత్యకుమార్ చొరవతో ఆయుష్‌కు భారీ ఊతం

    • ఏపీ ఆయుష్ చరిత్రలోనే తొలిసారి రూ.185.75 కోట్లతో వార్షిక ప్రణాళికకు కేంద్రం ఆమోదం

    • తాజా కేటాయింపుల్లో ITDA పరిధిలో 19 మొబైల్ మెడికల్ యూనిట్లు

  • Aug 23, 2026 17:45 IST

    పల్నాడు జిల్లా: సత్తెనపల్లిలోని కొత్తపేటలో విషాదం

    • అడుకుంటూ వెళ్లి లిప్ట్‌లో ఇరుక్కుకొని బాలిక రేవతి (12) మృతి

  • Aug 23, 2026 17:35 IST

    భారత్-శ్రీలంక రెండో టెస్టు: తొలి రోజు ముగిసిన ఆట

    • ఆట ముగిసే సమయానికి భారత్ స్కోర్ 300/5

    • క్రీజులో ధ్రువ్ జురెల్(7*), సారాంశ్ జైన్(4*)

    • దేవదత్ పడిక్కల్(117) సెంచరీ

    • కెప్టెన్ శుభ్‌మన్ గిల్(50) హాఫ్ సెంచరీ

    • శ్రీలంక బౌలర్ అసిత ఫెర్నాండోకు 3 వికెట్లు

  • Aug 23, 2026 17:27 IST

    అమరావతి: మంత్రి సత్యకుమార్ చొరవతో ఆయుష్‌‌కు భారీ ఊతం

    • రూ.185.75 కోట్లతో వార్షిక ప్రణాళికకు కేంద్రం ఆమోదం

    • ఏపీ ఆయుష్ చరిత్రలోనే తొలిసారి

    • 2024-25 నుంచి 26-27 వరకు కలిపి రూ. 434 కోట్ల కేటాయింపులకు ఆమోదo

    • 2014-15 నుoచి 2023-24 వరకు రూ.120.17 కోట్ల కేటాయింపు

  • Aug 23, 2026 17:00 IST

    ఏపీ లిక్కర్‌ స్కాం: మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్ట్

    • కారుమూరి నాగేశ్వరరావును అరెస్టు చేసిన ఈడీ అధికారులు

    • ఇప్పటికే కారుమూరి సునీల్‌ అరెస్టు

    • వైసీపీ హయాంలో ఏపీ లిక్కర్ రవాణాలో అక్రమాలకు పాల్పడినట్లు ఈడీ గుర్తింపు

    • కాంట్రాక్టుల ద్వారా రూ.28 కోట్ల వరకూ ముడుపులు తీసుకున్నట్లు ఈడీ గుర్తింపు

  • Aug 23, 2026 16:47 IST

    మహారాష్ట్ర: శిరోలిలో భారీ అగ్నిప్రమాదం

    • స్క్రాప్‌ యార్డులో చెలరేగిన మంటలు

    • సహారా ప్లాస్టిక్‌ కంపెనీకి వ్యాపించిన మంటలు

    • మంటలార్పుతున్న ఫైర్‌ సిబ్బంది

  • Aug 23, 2026 16:45 IST

    ఏపీలో ఆధ్యాత్మిక ప్రగతిదారులు

    • 100కుపైగా ప్రధాన క్షేత్రాలకు గ్రామీణ రోడ్ల అనుసంధానం

    • రూ.120 కోట్లతో 205 కిలోమీటర్ల ఆలయ అనుసంధాన రోడ్లు

    • డిప్యూటీ సీఎం పవన్‌ సంకల్పంతో భక్తులకు సౌకర్యం

  • Aug 23, 2026 16:30 IST

    సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్‌కు 20 వసంతాలు పూర్తి

    • 2006 ఆగస్టు 23న PPP పద్ధతని ఆవిర్భవించిన సైబర్‌ సెక్యూరిటీ కౌన్సిల్

    • కౌన్సిల్ సభ్యులు, భాగస్వామ్య సంస్థలకు డీజీపీ శుభాకాంక్షలు

  • Aug 23, 2026 16:27 IST

    కొలంబో టెస్టు: శ్రీలంకపై దేవ్‌దత్‌ పడిక్కల్‌ సెంచరీ

    • టెస్టుల్లో వరుసగా రెండో సెంచరీ చేసిన పడిక్కల్‌

    • తొలి టెస్టులో 167 పరుగులతో రాణించిన పడిక్కల్‌

  • Aug 23, 2026 16:10 IST

    తెలంగాణ MLC ఎన్నికల బరిలో జనసేన

    • ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, వరంగల్‌ పట్టభద్రుల జనసేన MLC అభ్యర్థిగా గడల శ్రీనివాసరావు

    • 2027 మార్చిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు

    • ఇతర పార్టీల కంటే ముందే అభ్యర్థిని ప్రకటించిన జనసేన

  • Aug 23, 2026 16:05 IST

    రేపు ఏపీకి ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ రాక

    • ముసునూరు పర్యటనకు రానున్న ఉప రాష్ట్రపతి

    • గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ముసునూరు వరకు ట్రయల్‌రన్

    • కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ ఆధ్వర్యంలో ట్రయల్‌రన్

    • కాన్వాయ్ వెళ్లే మార్గంలో భద్రతా ఏర్పాట్ల పరిశీలన

  • Aug 23, 2026 16:00 IST

    విజయనగరం: గాజులరేగ కొండపై పోలీస్ వాహనం బోల్తా

    • ప్రమాదంలో కానిస్టేబుల్‌ వెంకటరమణ మృతి

    • ఎస్‌ఐ అశోక్‌ సహా ఇద్దరు కానిస్టేబుళ్లకు తీవ్రగాయాలు

  • Aug 23, 2026 15:50 IST

    చిన్నారెడ్డి వివరణకు సంతృప్తి చెందలేదు: MLA మేఘారెడ్డి

    • చిన్నారెడ్డి వివరణలో అన్నీ అబద్ధాలే: MLA మేఘారెడ్డి

    • చిన్నారెడ్డి అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలి

    • క్రమశిక్షణ కమిటీకి అన్ని ఆధారాలు సమర్పించా: మేఘారెడ్డి

    • నిజమైన నేతలు కాంగ్రెస్‌ వెంటే ఉన్నారు: MLA మేఘారెడ్డి

    • BRS నేతలతో చిన్నారెడ్డి టచ్‌లో ఉన్నారు: MLA మేఘారెడ్డి

  • Aug 23, 2026 15:45 IST

    కోనసీమ: అయినవిల్లి మండలం మాగంలో అక్రమ మద్యం విక్రయం

    • 58 యానాం మద్యం సీసాల స్వాధీనం

    • ముగ్గురిని అరెస్ట్ చేసిన ఎక్సైజ్ అధికారులు

  • Aug 23, 2026 15:33 IST

    విశాఖ: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం 17వ స్నాతకోత్సవo

    • చీఫ్‌ గెస్ట్‌గా హాజరైన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌

    • పలువురు విద్యార్థులకు డాక్టరేట్లు ప్రదానం

  • Aug 23, 2026 15:29 IST

    రాజమండ్రి: AE నూకరాజు భార్య మీనా మృతదేహానికి పోస్టుమార్టం

    • మీనా మృతదేహాన్ని బంధువులకు అప్పగించనున్న పోలీసులు

    • ఈ నెల 16న AE నూకరాజు కుటుంబం ఆత్మహత్య

  • Aug 23, 2026 15:20 IST

    అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరణపై సీఎం రేవంత్‌ స్పందన

    • రాజకీయ కారణాలతోనే అమెరికా పర్యటనకు కేంద్రం నిరాకరణ: సీఎం రేవంత్‌ రెడ్డి

    • నా అమెరికా పర్యటనకు మద్దతు తెలిపిన అందరికీ ధన్యవాదాలు: రేవంత్‌

    • లండన్‌లో అన్ని సమావేశాలు, కార్యక్రమాలూ పూర్తి చేశా: సీఎం రేవంత్‌

    • హైదరాబాద్‌లో పూర్తి వివరాలు వెల్లడిస్తా: సీఎం రేవంత్‌

    • బోస్టన్ వెళ్లకుండా హైదరాబాద్‌కు రేవంత్ తిరుగు ప్రయాణం

  • Aug 23, 2026 15:10 IST

    శబరిమల పవిత్రతను కాపాడాలి: బీజేపీ ఏపీ చీఫ్‌ మాధవ్‌

    • హిందూ ధర్మంపై నాస్తికులు దాడి చేస్తున్నారు: PVN మాధవ్‌

    • శబరిమల లేకుండా చేయాలని కుట్ర జరిగింది: PVN మాధవ్‌

    • శబరిమలలో బంగారం దోచుకోవాలని చూశారు: PVN మాధవ్‌

    • శబరిమలలో టీటీడీ తరహా వ్యవస్థ ఉండాలి: బీజేపీ ఏపీ చీఫ్ మాధవ్‌

  • Aug 23, 2026 15:00 IST

    అయ్యప్ప భక్తుల సమస్యల పరిష్కారానికి కృషి: భానుప్రకాష్‌రెడ్డి

    • కేరళంలో ఉన్నది మాటల ప్రభుత్వమే.. చేతల ప్రభుత్వం కాదు: భానుప్రకాష్‌రెడ్డి

    • కేరళంలో తెలుగు స్వాముల సమస్యల పరిష్కారానికి కృషి: భానుప్రకాష్‌రెడ్డి

    • హిందూ ఆలయాల దగ్గర హిందువులే వ్యాపారాలు చేయాలి: భానుప్రకాష్‌రెడ్డి

    • హైందవ కార్యక్రమాలకే టీటీడీ డబ్బు వినియోగించాలి: టీటీడీ బోర్డ్ మెంబర్ భానుప్రకాష్‌రెడ్డి

  • Aug 23, 2026 14:56 IST

    హైదరాబాద్‌: రేపు TPCC ముఖ్యనేతల జూమ్‌ సమావేశం

    • టీపీసీసీ చీఫ్‌ మహేశ్ గౌడ్ నేతృత్వంలో జూమ్‌ మీటింగ్‌

    • పాల్గొననున్న DCC అధ్యక్షులు, MLAలు, SIR కోఆర్డినేటర్లు

    • తెలంగాణలో 27న గ్రామ, వార్డు సభల ఏర్పాట్లపై సమీక్ష

    • SIR ఫేజ్-2 పురోగతి సహా బూత్ స్థాయి అంశాలపై చర్చ

  • Aug 23, 2026 14:47 IST

    మంచిర్యాల: దండేపల్లి మండలం మేదరిగూడెం స్టేజీ దగ్గర ప్రమాదం

    • 33 కేవీ విద్యుత్ లైన్ మరమ్మతులు చేస్తుండగా ప్రమాదం

    • జూనియర్ లైన్‌మెన్ మహేందర్‌కు విద్యుత్ షాక్

    • స్తంభం పైనుంచి జారిపడటంతో తీవ్ర గాయాలు

  • Aug 23, 2026 14:26 IST

    భారత్-శ్రీలంక రెండో టెస్టు: శుభ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీ

    • 99 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన గిల్

    • మరోవైపు క్రీజులో దేవదత్ పడిక్కల్(60*)

    • 49.3 ఓవర్లకు టీమిండియా స్కోర్ 183/2

  • Aug 23, 2026 14:00 IST

    నల్లగొండను సూపర్ స్మార్ట్ సిటీగా తీర్చి దిద్దుతా: మంత్రి కోమటిరెడ్డి

    • 2028 ఆగస్టు నాటికి SLBC సొరంగం పనులు పూర్తి: మంత్రి కోమటిరెడ్డి

    • ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రూ. 2,500 కోట్లతో రోడ్ల నిర్మాణం: మంత్రి కోమటిరెడ్డి

  • Aug 23, 2026 13:50 IST

    ఢిల్లీ: అవినీతికి మారుపేరు కాంగ్రెస్: TBJP చీఫ్‌ రాంచందర్‌రావు

    • గతంలో రాష్ట్రాన్ని BRS కుటుంబం దోచుకుంది: రాంచందర్‌రావు

    • ఇప్పుడు రేవంత్‌రెడ్డి సోదరులపై ఆరోపణలు: రాంచందర్‌రావు

  • Aug 23, 2026 13:45 IST

    ఖమ్మం జిల్లా: కొణిజర్ల మండలంలో శ్రీనివాస రైస్ మిల్లులో అధికారుల తనిఖీలు

    • రూ.4.4 కోట్ల విలువైన వరి ధాన్యం తరలించినట్లు గుర్తింపు

    • మిల్లు ఓనర్‌ సుబ్బరాజుపై అధికారుల విచారణ

  • Aug 23, 2026 13:38 IST

    ప.గో.: పాలకొల్లు మండలం తిల్లపూడితో శ్మశానవాటికలో శ్రమదానం చేసిన మంత్రి నిమ్మల

    • మంత్రి నిమ్మల పిలుపుతో శ్రమదాన పనుల్లో పాల్గొన్న యువకులు, మహిళలు

    • స్వయంగా చెత్త తరలింపు ట్రాక్టర్ నడిపిన మంత్రి నిమ్మల

  • Aug 23, 2026 13:30 IST

    విశాఖ సిటీ: మాజీ MLA వాసుపల్లి గణేష్‌కుమార్‌పై వెంకట పట్టాభిరామ్ ఆగ్రహం

    • వాసుపల్లికి రాజకీయ భిక్ష పెట్టిందే టీడీపీ: వెంకట పట్టాభిరామ్

    • భాష మార్చుకో.. లేకుంటే తీవ్ర పరిణామాలు: TDP పార్లమెంట్ అధ్యక్షుడు చోడే వెంకట పట్టాభిరామ్

  • Aug 23, 2026 13:16 IST

    ప.గో: కాళ్ల మండలం కోపల్లె వంతెన నిర్మాణం పూర్తి

    • ఈనెల 26న వంతెనను ప్రారంభించనున్న అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు

    • భీమవరం, గుడివాడ ప్రధాన రహదారిపై సుమారు రూ.12 కోట్లతో నిర్మించిన బ్రిడ్జ్

    • వంతెన నిర్మాణం పూర్తి కావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్న ప్రజలు

  • Aug 23, 2026 12:57 IST

    ఖమ్మం: కొణిజర్లలోని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ సివిల్ సప్లై అధికారుల తనిఖీలు

    • శ్రీనివాస రైస్‌మిల్లులో రూ.4..4 కోట్ల విలువైన 1,709 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ వరి ధాన్యం తరలించినట్లు గుర్తింపు

    • మిల్లు యజమాని సుబ్బరాజుపై విచారణ చేపట్టిన అధికారులు

  • Aug 23, 2026 12:48 IST

    హైదరాబాద్: మల్లారెడ్డి కాలేజీపై కేసు నమోదు

    • టాక్సిక్ ప్రి రిలీజ్ ఈవెంట్‌లో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ కేసు

    • ఈవెంట్‌లో తొక్కిసలాటలో పలువురికి గాయాలు

    • టాక్సిక్ సినిమా చిత్ర యూనిట్‌పైనా కేసు నమోదు

  • Aug 23, 2026 12:18 IST

    IND vs SL: లంచ్ బ్రేక్ సమయానికి భారత్ స్కోర్ 88/2

    • క్రీజులో గిల్‌(11*), పడిక్కల్‌(13*)

  • Aug 23, 2026 12:02 IST

    విశాఖ: సముద్రంలో మత్స్యకారులకు తప్పినముప్పు

    • సముద్రపు నీరు చేరి మునిగిపోయిన బోటు

    • బోటులో ఐదుగురు మత్స్యకారుల సురక్షితం

    • మరో బోటు సాయంతో హార్బర్‌కు చేరుకున్న మత్స్యకారులు

  • Aug 23, 2026 11:43 IST

    హైదరాబాద్: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్ అరెస్ట్

    • తెల్లాపూర్‌లోని సుమంత్ ఇంటి ముందు అరెస్ట్ చేసిన పోలీసులు

    • ఓ వ్యాపారిని రూ.10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసి, ఇనుప రాడ్లతో దారుణంగా దాడి చేశాడని సుమంత్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు

    • ఈ కేసులో సుమంత్ డ్రైవర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు

  • Aug 23, 2026 11:42 IST

    హైదరాబాద్: గచ్చిబౌలి ఘటనపై దర్యాప్తు ముమ్మరం

    • గచ్చిబౌలిలో భవనం కూలిన ఘటనలో కాంట్రాక్టర్ సాజిద్ అరెస్ట్‌

    • సాజిద్‌ను అరెస్ట్ చేసిన రాయదుర్గం పోలీసులు

    • సాజిద్ నిర్మించిన అక్రమ భవనాలపై హైడ్రా ఫోకస్‌

  • Aug 23, 2026 11:40 IST

    హైదరాబాద్‌: గుడిమల్కాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం

    • మొఘల్‌ఖానా దగ్గర ఫర్నిచర్ గోదాంలో ప్రమాదం

    • చుట్టుపక్కల గోదాంలు ఉండటంతో మంటలు వ్యాపించే అవకాశం

    • మంటలు ఆర్పుతున్న ఫైర్ సిబ్బంది

  • Aug 23, 2026 11:13 IST

    హైదరాబాద్: గచ్చిబౌలిలో భవనం కూలిన చోట కొనసాగుతున్న శిథిలాల తొలగింపు

    • పక్కనే ఉన్న ఏడంతస్తుల భవనాన్ని క్రేన్‌తో కూల్చనున్న అధికారులు

    • నిన్న భారీ వర్షంతో ఆగిన శిథిలాల తొలగింపు

  • Aug 23, 2026 11:12 IST

    హైదరాబాద్‌: అర్ధరాత్రి నుంచి ఓలా, ఉబర్‌, రాపిడో క్యాబ్‌ ఆటోడ్రైవర్ల సమ్మె

    • అర్ధరాత్రి నుంచి సర్వీసులు నిలిపివేస్తున్నట్లు JAC నేతల ప్రకటన

    • ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఆర్థిక హామీని నెరవేర్చాలని JAC డిమాండ్‌

  • Aug 23, 2026 11:11 IST

    మాకే టెస్ట్‌లో బంగ్లాదేశ్‌పై ఆస్ట్రేలియా విజయం

    • ఇన్నింగ్స్‌ 51 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై ఆస్ట్రేలియా విజయం

    • స్కోర్లు: బంగ్లాదేశ్‌ 64, 95, ఆస్ట్రేలియా 210 ఆలౌట్

  • Aug 23, 2026 10:27 IST

    హైదరాబాద్: గచ్చిబౌలి అంజయ్యనగర్‌‌లో భవనం కూలిన ఘటనలో టౌన్ ప్లానింగ్ అధికారి సస్పెన్షన్

    • అక్రమ నిర్మాణాన్ని అడ్డుకోవడంలో విఫలమైన మాదాపూర్‌ టౌన్‌ ప్లానింగ్ ఆఫీసర్ సంతోష్‌ కుమార్‌‌ను సస్పెండ్ చేసిన కమిషనర్ శ్రీజన

    • తక్షణమే అమల్లోకి వచ్చేలా సస్పెన్షన్ ఉత్తర్వులు

    • శాఖాపరమైన విచారణ పూర్తయ్యే వరకు సస్పెన్షన్ కొనసాగింపు

    • సస్పెన్షన్ కాలంలో హెడ్‌క్వార్టర్స్‌ పరిధి దాటరాదని ఆదేశం

    • కమిషనర్‌ అనుమతి లేకుండా హెడ్‌క్వార్టర్స్‌ వీడొద్దని ఆదేశాలు

  • Aug 23, 2026 10:25 IST

    అమరావతి: జగ్గయ్యపేట సీఐ తీరుపై మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆగ్రహం

    • వైసీపీ నేతలకు సీఐ వెంకటేశ్వర్లు అతిగౌరవం చూపించారని ఫిర్యాదు

    • వివాహ వేడుకలో వైసీపీ నేతలు వెలంపల్లి శ్రీనివాస్, దేవినేని అవినాష్‌కు సీఐ ప్రాధాన్యం

    • మంత్రి కాన్వాయ్ ఉన్నా వాహనాలు క్లియర్ చేయని సీఐ

    • అంగరక్షకుడిని పంపిన తర్వాతే మంత్రి వద్దకు వచ్చిన సీఐ

    • నేను అన్నీ చూస్తున్నా.. ప్రభుత్వం మారిందయ్యా అంటూ మంత్రి వ్యాఖ్య

    • సీఐ తీరుపై పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబుకు మంత్రి ఫిర్యాదు

  • Aug 23, 2026 10:23 IST

    కర్నూలు: ఎమ్మిగనూరు వైసీపీలో మరోసారి వర్గ విభేదాలు

    • పట్టణంలో 11వ వార్డులో వార్డు ఇన్‌ఛార్జ్ మాజీ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ లేకుండానే ‘నమస్తే ఎమ్మిగనూరు’ కార్యక్రమం చేసిన వైసీపీ ఇన్‌ఛార్జ్ రాజీవ్ రెడ్డి

    • రాజీవ్ రెడ్డి పర్యటనపై వాట్సాప్ స్టేటస్‌తో మాజీ మునిసిపల్ వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ ఎద్దేవా.. వైసీపీలో హాట్ టాపిక్

    • బుట్టా వర్గం - రాజీవ్ రెడ్డి వర్గాల మధ్య విభేదాలపై చర్చ

    • ఎన్నికల వేళ వైసీపీకి నష్టం తప్పదంటున్న రాజకీయ వర్గాలు

  • Aug 23, 2026 10:00 IST

    ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులకు డిప్యూటీ సీఎం పవన్‌ నివాళులు

    • ప్రజాసేవకు అంకితమైన ఆయన జీవితం అందరికీ ఆదర్శం: పవన్‌ కల్యాణ్‌

  • Aug 23, 2026 09:56 IST

    ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు నివాళులు

    • ఎంతటి వారినైనా ఎదిరించే గుణం ప్రకాశం పంతులు నైజం

    • ఆంధ్ర కేసరి తెలుగువారి పౌరుషానికి ప్రతీక: సీఎం చంద్రబాబు

  • Aug 23, 2026 09:17 IST

    నెల్లూరు: ఆత్మకూరు మండలం పమిడిపాడు దగ్గర బైక్ బోల్తా

    • ఒకరి మృతి, మరొకరికి గాయాలు

  • Aug 23, 2026 09:09 IST

    కొమురం భీం: జిల్లా ప్రజలను హడలెత్తిస్తున్న పెద్ద పులి మహారాష్ట్రకు వెళ్లినట్టు నిర్ధారణ

    • తుమ్మిడిహట్టి శివారులో పంట పొలాలు, ప్రాణహిత నది పరివాహక ప్రాంతంలో పులి అడుగులను గుర్తించిన అధికారులు

    • ప్రాణహిత నది దాటి మహారాష్ట్ర వెళ్లి ఉంటుందని భావిస్తున్న అధికారులు

    • 5 రోజులుగా కౌటాల -సిర్పూర్ మండలాల్లో ప్రజలను భయబ్రాంతులకు గురిచేసిన పులి

  • Aug 23, 2026 09:07 IST

    సంగారెడ్డి: గోల్డ్, సిల్వర్ వ్యాపారం పేరిట భారీ మోసం

    • రూ.28 కోట్ల డిపాజిట్లతో బోర్డు తిప్పేసిన కేటుగాళ్లు

    • అధిక లాభాల ఆశతో హైదరాబాద్‌లోని ‘నైకీ ట్రేడర్స్’ సంస్థలో విడతల వారిగా డబ్బు డిపాజిట్ చేసిన జహీరాబాద్‌కు చెందిన 25 మంది బాధితులు

    • వడ్డీ, అసలు తిరిగి ఇవ్వకపోవడంతో జహీరాబాద్ టౌన్ పోలీసు స్టేషన్‌లో బాధితుల ఫిర్యాదు

    • నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన జహీరాబాద్ పోలీసులు

  • Aug 23, 2026 07:47 IST

    హైదరాబాద్: ప్రియురాలికి యువకుడి ప్రాంక్ మెసేజ్‌

    • రూ.30 లక్షల హవాలా నగదుతో పట్టుబడిన యువకుడు

    • KPHB ఇండిస్ వన్‌సిటీలో ముగ్గురు యువకుల విందు

    • మద్యం మత్తులో కిడ్నాప్‌ చేశారంటూ ప్రియురాలికి మెసేజ్ చేసిన సుమంత్‌ అనే యువకుడు

    • యువతి ఫిర్యాదుతో ఫ్లాట్‌లో తనిఖీలు చేపట్టిన పోలీసులు, నగదు గుర్తింపు

  • Aug 23, 2026 07:40 IST

    రేపు ఏలూరు జిల్లాలో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ పర్యటన

    • ముసునూరులో నూతన పాప్‌కార్న్ సీడ్‌ ఆవిష్కరణ

    • మొక్కజొన్న రైతులకు ఉపరాష్ట్రపతి సన్మానం

  • Aug 23, 2026 07:39 IST

    ఆస్ట్రేలియాతో రెండో టెస్ట్.. కష్టాల్లో బంగ్లాదేశ్

    • రెండో ఇన్నింగ్స్‌లో 24 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన బంగ్లా

    • 2 వికెట్లు తీసిన ఆసీస్ పేసర్ స్టార్క్

  • Aug 23, 2026 07:28 IST

    టోక్యో: ఆదివారం తెల్లవారుజామున జపాన్‌ను వణికించిన భూకంపం

    • తూర్పు జపాన్‌ సహా టోక్యో ప్రాంతంలో 5.9 తీవ్రతతో భూప్రకంపనలు

    • దక్షిణ ఇబరాకి ప్రిఫెక్చర్‌లో 70 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రం

    • ఈ ఘటనలో ఐదుగురికి గాయాలు, నిలిచిపోయిన విద్యుత్ సరఫరా

  • Aug 23, 2026 07:24 IST

    హైదరాబాద్‌: గచ్చిబౌలిలో కొనసాగుతున్న రెస్క్యూ

    • రాత్రి కురిసిన వర్షానికి శిథిలాల తొలగింపునకు ఆటంకం

    • ఇవాళ జయదర్శి అపార్ట్‌మెంట్‌ కూల్చివేసే అవకాశం

    • కూల్చివేతకు అధికారుల ఏర్పాట్లు

  • Aug 23, 2026 07:17 IST

    నేడు హైదరాబాద్‌కు చేరుకోనున్న సీఎం రేవంత్‌ రెడ్డి

    • కేంద్రం అనుమతి ఇవ్వకపోవడంతో అమెరికాకు వెళ్లకుండా బ్రిటన్‌ నుంచే తిరుగు ప్రయాణం

  • Aug 23, 2026 07:17 IST

    ఏపీలో 14వ రోజుకు చేరిన జూనియర్‌ డాక్టర్ల సమ్మె

    • స్టైపండ్‌ పెంచే వరకు సమ్మె విరమించమంటున్న జూడాలు

  • Aug 23, 2026 07:16 IST

    విశాఖలో రెండో రోజు బ్రిక్స్‌ దేశాల కీలక సమావేశాలు

    • నేడు యువజన, క్రీడా మంత్రుల సమావేశం

    • బీచ్‌రోడ్‌లో ఫ్రెండ్‌షిప్‌ సైకిల్‌ ర్యాలీ

    • హాజరుకానున్న కేంద్ర మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ

    • సమావేశాల్లో పాల్గొననున్న రాష్ట్ర మంత్రి రాంప్రసాద్‌ రెడ్డి

  • Aug 23, 2026 07:15 IST

    కాకినాడ ఎస్‌కే కాలేజ్‌ ఆఫ్‌ నర్సింగ్‌ కళాశాలలో సద్దుమణిగిన విద్యార్థినిల మధ్య వివాదం

    • జిల్లా ఎస్పీ, కలెక్టర్ జోక్యంతో వివాదానికి ముగింపు

    • మొబైల్‌ ఫోన్‌ మిస్సింగ్‌ విషయంలో ఇతర రాష్ట్రాలు, తెలుగు విద్యార్థినిల మధ్య చెలరేగిన వివాదం

  • Aug 23, 2026 07:07 IST

    సౌదీ-పాక్‌-టర్కీ రక్షణ ఒప్పందంలో చేరిన బంగ్లాదేశ్‌

    • దేశ ప్రయోజనాల కోసం నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటన

    • త్వరలో సౌదీ అరేబియాలో బంగ్లా ప్రధాని తారిఖ్‌ పర్యటన

  • Aug 23, 2026 07:06 IST

    అమెరికా, ఇరాన్‌ మధ్య మరింత పెరిగిన ఉద్రిక్తతలు

    • అమెరికా ఆంక్షలపై తీవ్రంగా స్పందించిన ఇరాన్‌

    • అంతర్జాతీయ చట్టాల ప్రకారం అమెరికా ఆంక్షలు చెల్లవు: ఇరాన్

    • వలసవాదం మళ్లీ తిరిగొచ్చినట్లే కనిపిస్తోంది: ఇరాన్‌

  • Aug 23, 2026 07:05 IST

    కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

    • ఎయిర్‌పోర్టుల దగ్గర బోర్డింగ్‌ పాస్‌పై స్టాంపింగ్‌ నిబంధనను ఎత్తివేసిన కేంద్రం

    • కొత్త నిబంధన సెప్టెంబర్‌ 1 నుంచి అమలు

  • Aug 23, 2026 07:00 IST

    స్థిరంగా బంగారం ధరలు

    • 24క్యారెట్ల 10గ్రా. బంగారం ధర రూ.1,63,090

    • 22క్యారెట్ల 10గ్రా. బంగారం ధర రూ.1,49,500

    • కిలో వెండి ధర రూ.2,70,000

  • Aug 23, 2026 07:00 IST

    ఢిల్లీలో భారీగా పెరుగుతున్న స్వైన్‌ఫ్లూ కేసులు

    • నిన్న ఒక్కరోజే 114 కొత్త స్వైన్‌ఫ్లూ కేసులు నమోదు

    • ఈ ఏడాది ఇప్పటివరకు 1,777 స్వైన్‌ఫ్లూ కేసులు

    • రెండు వారాల్లో 433 కొత్త కేసులు నమోదు

  • Aug 23, 2026 06:59 IST

    అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు స్థానిక కోర్టులో షాక్‌

    • 75 దేశాల పౌరులకు ఇమిగ్రేషన్‌ వీసా నిలిపివేయాలని ట్రంప్‌ తీసుకున్న నిర్ణయాన్ని కొట్టేసిన కోర్టు

  • Aug 23, 2026 06:58 IST

    తెలంగాణలో 21 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

    • ఈ నెల 26 వరకు వర్షాలు కురిసే అవకాశం

    • పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు

    • నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం

  • Aug 23, 2026 06:56 IST

    నేటి నుంచి భారత్‌-శ్రీలంక మధ్య రెండో టెస్టు

    • కొలంబో వేదికగా ఉ.10:00 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం