ఎంజీఎంలో దిక్కులేని ‘న్యూరో కేర్’
ABN , Publish Date - Aug 22 , 2026 | 01:24 PM
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రితోపాటు సూపర్ స్పెషా లిటీ ఆస్పత్రిలో న్యూరో కేర్.. డోంట్ కేర్.. అన్న చందంగా మారింది.
వైద్యుల కొరతతో రోగుల అవస్థలు
మరమ్మతులు లేక మూలనపడ్డ కోట్ల విలువ చేసే యంత్రాలు
కమీషన్ల కక్కుర్తితో ప్రైవేటు ఆస్పత్రులకు తరలిస్తున్న సిబ్బంది
8 నెలలుగా నిలిచిన న్యూరో సర్జరీలు
న్యూరో సర్జరీలో ఒకే ఒక్క వైద్యుడు
వరంగల్ మెడికల్: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రితోపాటు సూపర్ స్పెషా లిటీ ఆస్పత్రిలో న్యూరో కేర్.. డోంట్ కేర్.. అన్న చందంగా మారింది. రోడ్డు ప్రమాదాలు, న్యూరో సం బంధిత జబ్బులతో చావు బతుకుల మధ్య నిత్యం రోగులు వస్తుంటారు. కానీ చికిత్స అందించే వైద్యు లే కరువయ్యారు. న్యూరో విభాగంలో న్యూరో ఫిజీ షియన్ సేవలు, న్యూరో సర్జరీ సేవల కోసం ప్రత్యే క వార్డులను వైద్యులను ఏర్పాటు చేశారు. కానీ రోగుల సంఖ్యకనుగుణంగా వైద్యులు లేకపోవడం వల్ల సేవలు నిల్‌గా మారాయి. ఎనిమిది నెలలుగా న్యూరో సర్జరీలు బంద్ కావడమే ఎందుకు నిలువె త్తు సాక్ష్యం. సర్జరీ విభాగంలో ఒకే ఒక రెగ్యులర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సేవలు అందిస్తున్నారు. మరో కాంట్రాక్ట్ వైద్యుడు కూడా కొనసాగుతున్నారు. ఒక్క వైద్యులు ఎంతమందికి శస్త్ర చికిత్స చేయగలరు ఉన్నతాధికారులకే తెలియాల్సి ఉంటుంది.
రోగుల తాకిడి ఎక్కువ
న్యూరో విభాగంలో ఒక నెలలో 4 వేలకు పైగా ఓపీ ఉంటుందని గణాంకాల ద్వారా తెలుస్తోంది. కానీ ఓపీ చూసేందుకు కూడా వైద్యులు లేక రోగు లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గంటల తరబడి నిరీక్షించిన న్యూరో సర్జరీ, న్యూరో ఫిజీషి యన్లను రోగులు కలవలేక తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చేవారి బాధ వర్ణనాతీతంగా మారింది. న్యూరో విభాగంలో అత్యవసరంగా శస్త్ర చికిత్స అవసరం ఉన్న రోగులకు దేవుడే దిక్కు అన్న విధంగా మారింది. నిత్యం 10 నుంచి 15 మంది రోడ్డు ప్రమాదాలల్లో తలకు గాయాలు, స్పైన్ సర్జరీలు, ట్రామా లాంటి మెడికో లీగల్ కేసులు ఎంజీఎం సూపర్ స్పెషాలిటీకి వస్తుంటాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న రోగులతో పాటు చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల నుంచి కూడా కేసులు వస్తున్నాయి. ఫిట్స్, పక్షవాతం లాంటి సాధారణ రోగులు కూడా ఇక్కడికి విచ్చేస్తున్నారు.
మూలనపడ్డ యంత్రాలు
న్యూరో సర్జరీ విభాగంలో శస్త్రచికిత్సకు ఉపయో గపడే ఖరీదైన యంత్రాలు వార్షిక మరమ్మతులు నోచుకోక మూలకుపడ్డాయి. అడ్వాన్స్‌సిటీ యంత్రం కోటి 50 లక్షల రూపాయలతో కొనుగోలు చేశారు. కేవలం రూ.32 లక్షలు వార్షిక మరమ్మతులకు నిధులు విడుదల కాకపోవడంతో యంత్రం మూల న పడింది. సూపర్ స్పెషాలిటీలో ఏసీలు పనిచేయ కపోవడం మూలంగా విదేశాల నుంచి తెప్పించిన ఈఈజీ యంత్రాలు మూలనపడ్డాయి. ఇక మైక్రో న్యూరో సర్జరీ యంత్రం రూ.కోటిన్నర వెచ్చించి కొనుగోలు చేసిన ఉపయోగించేవారు లేకపోవడం తో మూలన పడి ఉంది. రూ.25లక్షలు వెచ్చించి బ్రెయిన్ సర్జరీల కోసం కొనుగోలు చేసిన న్యూరోట్రి క్ యంత్రం వైద్యులు లేక మూలన పడి ఉంది.
ప్రైవేటు ఆస్పత్రికి..
ఎంజీఎం, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలోని కొందరు సిబ్బంది రోగులను మచ్చిక చేసుకుని ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లే విధంగా ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తోంది. కేసులన్నీ హనుమకొండ బాలసముద్రం ఫైర్‌స్టేషన్ రోడ్డులో ఉన్న మూడు ఆస్పత్రులకు ప్రధానంగా వెళుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ మూడు ఆస్పత్రులపై విజిలెన్స్, ఏసీబీ నిఘా ఉంచినట్లు తెలుస్తోంది. పంపిన ప్రతీ కేసుకు అయిన బిల్లులో 50శాతం డబ్బులను సిబ్బందికి కమీషన్ల రూపంలో ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల హనుమకొండ కమలాపూర్ ప్రాంతానికి చెందిన ఒక రోగిని ఇదే తరహాలో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా కమీషన్ రూపంలో లక్ష రూపాయలు వచ్చినట్టు తెలుస్తోంది. అయితే రోగం యథావిధిగా ఉండడంతో ఎంజీఎం నుంచి తరలించిన సిబ్బందితో రోగి బంధువులు వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది.
ట్రామా సెంటర్ అవసరం
ఉత్తర తెలంగాణతో పాటు సరిహద్దు రెండు రాష్ట్రాల నుంచి అత్యవసర రోగులు విచ్చేస్తున్నందున అన్ని సదుపాయాలతో కూడిన ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. కొత్తగూడెం, మహబూబాబాద్, రామగుండం ప్రభుత్వ ఆస్పత్రుల్లో న్యూరో విభాగం వైద్యులు ఉన్నప్పటికీ సేవలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. అక్కడ మౌలిక సదుపాయాలు యంత్రాలు కూడా లేవు. అక్కడి వైద్యుల సేవలను ఇక్కడ ఉపయోగించుకుంటే మెరుగైన సేవలు పేద ప్రజలకు అందుతాయని రోగులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రస్తుతం న్యూరోసర్జరీ విభాగంలో ఒకే ఒక రెగ్యులర్ అసిస్టెంట్ ప్రొఫెసర్, మరో కాంట్రాక్టు వైద్యుడు, న్యూరో ఫిజీషియన్ విభాగంలో ఇద్దరు రెగ్యులర్ వైద్యులతో పాటు కాంట్రాక్టు వైద్యుల సేవలు పూర్తిస్థాయిలో రోగుల సంఖ్యకు అనుగుణంగా అందడం లేదని ఆవేదన వ్యక్తం అవుతోంది. అదేవిధంగా న్యూరో సర్జరీ, న్యూరో ఫిజీషియన్ విభాగాల్లో రోగుల సంఖ్య, యంత్రాల సంఖ్యకు అనుగుణంగా టెక్నీషియన్లను నియమించాలని రోగులు విజ్ఞప్తి చేస్తున్నారు.
కోల్పోయిన పీజీ సీట్లు
న్యూరో సర్జరీ, న్యూరో ఫిజీషియన్ విభాగాలకు మూడు యూనిట్లు అవసరం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఒక్కో విభాగానికి ఒక్కో ప్రొఫెసర్, ఇద్దరు అసోసియేట్, ఐదుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్ల అవసరంగా ఉంది. ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రొఫెసర్ల సంఖ్య లేకపోవడంతో పీజీ సీట్లను కోల్పోయారు. అదే యూరో, నెఫ్రో, పిల్లల సర్జరీ విభాగంలో పీజీ సీట్లు యధావిధిగా కొనసాగుతున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ అర్హుల జాబితా 25న..
Read Latest AP News And Telangana News And International News And Telugu News