Share News

ప్రభుత్వ ఆస్పత్రిలో శిశువు మృతి.. కుటుంబ సభ్యుల ఆందోళన

ABN , Publish Date - Aug 22 , 2026 | 12:46 PM

వైద్యుల నిర్లక్ష్యంతో ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ శిశువు మృతి చెందింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది. వివరాల్లోకెళితే..

ప్రభుత్వ ఆస్పత్రిలో శిశువు మృతి.. కుటుంబ సభ్యుల ఆందోళన
Kamareddy Govt Hospital

నిజామాబాద్, ఆగస్టు 22: కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ శిశువు మృతిచెందింది. దీనికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తూ ఆస్పత్రి ఎదుటే నిరసనకు దిగారు.


అసలేం జరిగిందంటే?

కామారెడ్డి జిల్లా ఎక్కపల్లి తండాకు చెందిన ఓ మహిళ ప్రసవం కోసం శుక్రవారం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. వైద్యులు ఆమెకు తొలుత వైద్య పరీక్షలు నిర్వహించి నార్మల్ డెలివరీకి అవకాశముందని తెలిపారు. సర్జరీ చేయడానికి నిరాకరిస్తూ.. నొప్పులు వచ్చేంతవరకు ఎదురుచూడాలని కుటుంబ సభ్యులకు వివరించారు. కానీ ఆమె సాధారణ ప్రసవం కాకపోవడంతో ఈ రోజు(శనివారం) సిజేరియన్ చేయాల్సి వచ్చింది. దీంతో శిశువు గర్భంలోనే మరణించింది. ఆస్పత్రిలో చేర్చిన వెంటనే సిజేరియన్ చేసి ఉంటే శిశువు ప్రాణాలతో ఉండేదని కుటుంబ సభ్యులు వాపోయారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే శిశువు మృతిచెందిందని ఆరోపిస్తూ ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.


ఇవీ చదవండి:

ఐఫోన్‌ ఈఎంఐ కోసం గొడవ.. చివరకు కుమారుడితో పాటు తల్లిదండ్రుల మృతి

అవి అలాగే ఉన్నాయి, అలాగే ఉంటాయి.. పాకిస్థాన్‌ ఆగ్రహంపై భారత్ స్పందన

Updated Date - Aug 22 , 2026 | 12:51 PM